Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: సాయం చేసే గుణం మాకూ ఉంది… మనసుకు హత్తుకుంటోన్న వీడియో

అందుకే అలాంటి వీడియోలు నిత్యం వైరల్ అవుతూనే ఉంటాయి. ఇకపోతే, ఇక్కడ రెండు కుక్కల మధ్య స్నేహాం, కష్టా్ల్లో ఉన్నవారిని కాపాడే గుణానికి నిదర్శంగా ఉంది ఈ వీడియో..

Viral Video: సాయం చేసే గుణం మాకూ ఉంది... మనసుకు హత్తుకుంటోన్న వీడియో
Dog Saves Its Friend
Follow us
Jyothi Gadda

|

Updated on: Sep 27, 2022 | 5:30 PM

ప్రస్తుత ప్రపంచమంతా స్వార్థంతో నిండిపోయి ఉంది. ఎవరికి వారు తమ స్వార్థం కోసం తమకు నచ్చినట్టుగానే ప్రవర్తిస్తున్నారు. ఆ స్వార్థంతో కనీసం ఎదుటివారికి సాయం కాదుగదా.. కనీసం కష్టసుఖాల్లో పలకరించే సమయం కూడా ఉండటం లేదు. అలాంటి మనుషల మధ్యలో నిస్వార్థమైన మూగజీవాలు మానవత్వం ప్రదర్శించాయి. నోరులేని మూగజీవాలే అయినప్పటికీ ఎదుటి వారు ప్రాణాపాయ స్థితిలో ఉంటే..ప్రాణాలకు తెగించి మరీ తన స్నేహితున్ని కాపాడుకుంటున్నాయి. ప్రస్తుతం రెండు కుక్కలకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. నదిలో మునిగిపోతున్న ఒక కుక్కను మరో కుక్క రక్షించిన వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది. ఈ వీడియోకు 2 మిలియన్లకంటే ఎక్కువ వ్యూస్ వచ్చాయి.

జంతువులు, పక్షుల వీడియోలను నెటిజన్లు చాలా ఇష్టంగా చూస్తుంటారు. ఇంటర్నెట్‌లోని ఈ వీడియోల్లో అన్ని రకాల ఫన్ దొరుకుతుంది. అందుకే అలాంటి వీడియోలు నిత్యం వైరల్ అవుతూనే ఉంటాయి. ఇకపోతే, ఇక్కడ రెండు కుక్కల మధ్య స్నేహాం, కష్టా్ల్లో ఉన్నవారిని కాపాడే గుణానికి నిదర్శంగా ఉంది ఈ వీడియో.. ఇందులో ఓ కుక్క నీటిలో మునిగిన మరో కుక్కను రక్షించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కుక్క ఒక కొమ్మను తీసుకురావడానికి వేగంగా నదిలోకి దూకింది. కానీ అది బ్యాలెన్స్ కోల్పోయి నది ప్రవాహానికి లోతైన ప్రదేశంలోకి కొట్టుకుపోబోయింది. అంతలోనే ఒడ్డునే ఉన్న మరో కుక్క చూసింది..నది ప్రవాహంలో కొట్టుకుపోతున్న కుక్కను రక్షించటానికి చాకచక్యంగా వ్యవహరించింది. నీళ్లలో కొట్టుకుపోతున్న కుక్క నోట్లో ఉన్న కర్రను పట్టి ఒడ్డుకు లాగింది. దాంతో ప్రమాదం నుంచి ఆ శునకం సురక్షితంగా బయటపడింది. ఈ వీడియోను గాబ్రియెల్ కార్నో షేర్‌ చేశారు. కాగా, నీటి ప్ర‌వాహంలో కొట్టుకుపోతున్న కుక్క‌ను మ‌రో శున‌కం మునిగిపోకుండా కాపాడిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

ఇవి కూడా చదవండి

వీడియోకి ఇప్పటివరకు 2 మిలియన్ల కంటే ఎక్కువగానే వ్యూస్‌ వచ్చాయి. వీడియో చూసిన నెటిజన్లు ఆ శునకాన్ని ఎంతగానో అభినందిస్తున్నారు. త‌న ఫ్రెండ్‌ను కాపాడిన కుక్క‌ను ప‌లువురు మెచ్చుకుంటూ కామెంట్స్‌ చేస్తున్నారు. కుక్కలు విశ్వాసానికి ప్రతీక అంటారు. కడుపు ఇంత తిండి పెడితే చాలు..అవి ప్రాణాలకు తెగించి యజమానులను కాపాడతాయి. అందుకే వాటిని చాలా మంది ఇష్టంగా పెంచుకుంటూ ఉంటారు. యజమానులను అవి ఒక్క క్షణం కూడా విడిచిపెట్టి ఉండలేవు. అలాంటి కుక్కలు తమ స్నేహితుల కోసం ఎలాంటి రిస్క్‌ అయినా సరే చేస్తాయి. సరిగ్గా అలాంటి సంఘటనే ఇది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి