Viral: వింత జీవి హల్‌చల్‌.. పాము ఆకారాన్ని పోలిన రెక్కలతో.. దేవత అంటూ పూజలు చేస్తున్న ప్రజలు..

విశాల ప్రపంచంలో రకరకాల జీవులు తమతమ మనుగడ కొనసాగిస్తున్నాయి. ప్రతి జీవి తన ఉనికి కోసం పోరాటం చేస్తుంటుంది. ఇతర జీవుల నుంచి తమను తాము కాపాడుకోడానికి వాటికి ప్రత్యేకమైన నైపుణ్యాలు ఉంటాయి. బీహార్‌లో..

Viral: వింత జీవి హల్‌చల్‌.. పాము ఆకారాన్ని పోలిన రెక్కలతో.. దేవత అంటూ పూజలు చేస్తున్న ప్రజలు..
Atlas Moth
Follow us

|

Updated on: Sep 27, 2022 | 5:34 PM

విశాల ప్రపంచంలో రకరకాల జీవులు తమతమ మనుగడ కొనసాగిస్తున్నాయి. ప్రతి జీవి తన ఉనికి కోసం పోరాటం చేస్తుంటుంది. ఇతర జీవుల నుంచి తమను తాము కాపాడుకోడానికి వాటికి ప్రత్యేకమైన నైపుణ్యాలు ఉంటాయి. బీహార్‌లో ఓ వింత జీవి హల్‌చల్‌ చేసింది. ఆ జీవి పాము ఆకారాన్ని పోలి ఉంది. అంతేకాదు దానికి రెక్కలు కూడా ఉండటంతో జనం ఆశ్చర్యపోయారు. బీహార్‌ లోని కాలా బరియా గ్రామంలో సెప్టెంబర్‌ 24 రాత్రి ఓ బల్బు దగ్గరకు వచ్చింది ఈ వింత జీవి. తొలుత గ్రామస్థులు దానిని పాముగానే భావించారు. అయితే దాని రంగు, రూపం, ఆకృతి భిన్నంగా కనిపించడంతో గ్రామస్తుల్లో భయాందోళన కలిగింది. ఆ జీవిని కొందరు వనదేవత అవతారంగా, మరికొందరు సైతాన్ రూపంగా భావిస్తున్నారు. ఆ వింత జీవిని దేవతగా భావించినవారు పూజలు చేశారు. అయితే ఆ జీవిని అట్లాస్ మాత్ అనే కీటకంగా వరల్డ్ వైల్డ్‌లైఫ్ ఫండ్ కో-ఆర్డినేటర్ గుర్తించారు.

ఇది ప్రపంచంలోనే అతి పెద్ద కీటక జాతులలో ఒకటని, సీతాకోక చిలుకలా కనిపించే ఈ కీటకం రెక్కలు పాము ఆకారంలో ఉంటాయి. ఆ రెక్కల పొడవు 12 నుంచి 17 సెం.మీ. వరకు ఉంటుంది. సీతాకోకచిలుక లాంటి ఈ కీటకం నిజానికి చాలా అరుదుగా కనిపిస్తుంది. పగలు అసలు కనిపించదు. అటవీ ప్రాంతాల్లో తప్ప జనసంచారం ఉన్న ప్రాంతాల్లో చాలా అరుదుగా కనిపిస్తాయి. ఇతర జంతువుల నుంచి ప్రమాదం ఉందని భావించినపుడు, వాటిని భయపెట్టడానికి అట్లాస్ మాత్ పాము తలలా కనిపించే దాని రెక్కలను విప్పుతుంది. చీకట్లో మాత్రమే ఎగిరే అట్లాస్ మాత్ ఎక్కడైనా కాంతి కనిపిస్తే అక్కడే గంటల తరబడి ఉండిపోతుందట. కాగా, అట్లాస్ మాత్ ఉత్పత్తి చేసే ఉన్ని లాంటి పట్టు చాలా మన్నికైనది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి