Viral: కొలీగ్‌తో సెక్స్ చేస్తూ చనిపోయిన వ్యక్తి.. సీన్ కట్ చేస్తే.. చివరికి అతడి భార్య ఏం చేసిందంటే!
కొన్ని కథలు వింటుంటే.. ఏంటి ఇలా కూడా జరుగుతాయా అని అనిపిస్తుంది.. ఆ కోవకు చెందినదే ఈ వార్త.. ఇక్కడ ఓ భార్య తన భర్తపై రివెంజ్ ఎలా తీర్చుకుందంటే..
ఇదొక రివెంజ్ స్టోరీ.. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా.. నిజంగా జరిగింది. ఓ భార్య తన భర్త చనిపోయిన తర్వాత చేసిన పనికి ఆమె కుమారుడు సపోర్ట్ చేశాడు. తండ్రిపై తన రివెంజ్‌ను రెడ్డిట్ ద్వారా నెటిజన్లతో పంచుకున్నాడు. అమెరికాలో జరిగిన ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మరి అదేంటో తెలుసుకుందాం పదండి..
వివరాల్లోకి వెళ్తే.. అమెరికాలో నివసిస్తున్న జాన్ డే అనే వ్యక్తి.. ఆఫీసులో తనతో పాటు పని చేస్తున్న ఓ సహోద్యోగి అయిన యువతితో ఇల్లీగల్ అఫైర్ పెట్టుకున్నాడు. అయితే అతడికి ఇదివరకే పెళ్లయి.. ఓ కొడుకు ఉన్నాడు. ఇక ఈ ఎఫైర్ విషయం కాస్తా ఒకానొక రోజు అతడి భార్యకు తెలుస్తుంది.. దానితో వారిద్దరి మధ్య ప్రతీ రోజూ గొడవలు జరిగాయి. అయినా ఎలాంటి ప్రయోజనం లేకపోయింది. అతడి పద్దతిలో ఎలాంటి మార్పు రాలేదు.
అంతేకాదు తన భార్య, కొడుకును సైతం విడిచిపెట్టి.. కొలీగ్‌తో లివ్-ఇన్ రిలేషన్‌షిప్ మైంటైన్ చేశాడు. అనంతరం ఆమె గర్భం దాల్చడంతో.. భార్య, కొడుక్కి తెలియకుండా కొలీగ్‌తో కలిసి వెళ్లిపోవాలని నిర్ణయించుకుంటాడు సదరు వ్యక్తి. కాని అనూహ్యంగా కొద్దిరోజుల తర్వాత కొలీగ్‌తో సెక్స్ చేస్తూ.. అతడు గుండెపోటుతో మరణించాడు. ఈ వ్యవహారమంతా ఆమె కొడుకు రెడ్డిట్ ద్వారా నెటిజన్లతో పంచుకున్నాడు.
‘తన తల్లిదండ్రుల మధ్య విడాకుల వ్యవహారం ఏం జరగలేదని.. తన తండ్రి చేసిన పనులకు.. తన తల్లి చాలా బాధపడిందని’ కుమారుడు చెప్పుకొచ్చాడు. ఇదిలా ఉంటే.. భర్త చేసిన ఘనకర్యానికి భార్య.. అతడి సమాధిపై ‘ప్రేమపూర్వక జ్ఞాపకార్ధం, జాన్ డే.. లవ్వింగ్ సన్, హస్బండ్, ఫాదర్, వ్యభిచారి’ అని రాయించింది.
‘తన తల్లి స్వీట్ రివెంజ్‌కు మద్దతు తెలుపుతున్నానని.. కాని తన తండ్రి కుటుంబం, సహోద్యోగి అయిన యువతి ఈ వ్యవహారంపై మండిపడుతున్నారని’ ఆమె కుమారుడు రెడ్డిట్‌లో రాసుకొచ్చారు. కాగా, ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. లేట్ ఎందుకు మీరూ ఓ లుక్కేయండి. (Source)
మరిన్ని వింతలు-విశేషాల కోసం..