Navaratri 2022: అమ్మవారి భక్తులకు గుడ్ న్యూస్.. ఇంద్రకీలాద్రిపై రోజులో రెండు సమయాల్లో వారికి ప్రత్యేక దర్శనం..
శరన్నవరాత్రి రోజుల్లో దుర్గమ్మను దర్శించుకునే వృద్ధులు, దివ్యాంగులకు ప్రత్యేక సమయం కేటాయించారు. ఈరోజు నుండి మూలా నక్షత్రం రోజు మినహా మిగిలిన రోజుల్లో రెండు టైమ్ స్లాట్స్ లో అమ్మవారిని దర్శించుకునే అవకాశాన్ని కల్పించారు.
Navaratri 2022: ఏదైనా వ్యవస్థలో తపులు జరిగినప్పుడు..వాటిని సరిచేసుకుంటూ ఇంకోసారి జరగకుండా చూసుకుంటే.. అందరూ హర్షిస్తారు. ఎంతో ప్రతిష్టాత్మకం గా విజయవాడలోని కనక దుర్గమ్మ ఆలయంలో దసరా ఉత్సవాలను జరపాలని భావించిన దేవాదాయశాఖ మంత్రి అందుకు అనుగుణంగా చర్యలు తీసుకుంటుంది. శరన్నవరాత్రి వేడుకల్లో ఎదురవుతున్న ఇబ్బందులను ఒక్కోకిటిగా పరిష్కరించుకుంటు ముందుకెళ్తోంది. నేడు ఇంద్రకీలాద్రిలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు రెండో రోజుకు చేరుకున్నాయి. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మొదటి రోజు దుర్గమ్మ దర్శనానికి వచ్చిన కొంతమంది వికలాంగులు, వృద్ధులను ఇబ్బంది పడిన విషయం మంత్రి దృష్టికి వచ్చింది. దీంతో నేడు వీరికి ప్రత్యేక సమయం,వాహనం కేటాయించారు. మంత్రి తీసుకున్న తక్షన చర్యతో గుడికి వచ్చిన వృద్దులు ఆనందాన్ని వ్యక్తం చేశారు.
శరన్నవరాత్రి రోజుల్లో దుర్గమ్మను దర్శించుకునే వృద్ధులు, దివ్యాంగులకు ప్రత్యేక సమయం కేటాయించారు. ఈరోజు నుండి మూలా నక్షత్రం రోజు మినహా మిగిలిన రోజుల్లో రెండు టైమ్ స్లాట్స్ లో అమ్మవారిని దర్శించుకునే అవకాశాన్ని కల్పించారు. ప్రతి రోజూ ఉ 10:00 గ నుంచి 12:00 గంటలు వరకు లేదా.. సాయంత్రం 4:00 గం నుంచి 6:00 గంటల వరకు రెండో స్లాట్ లో వికలాంగులు, వృద్ధులు అమ్మవారిని దర్శించుకునేందుకు వీలు కల్పించారు. ఆలయం దగ్గర ఉన్న మోడల్ గెస్ట్ హౌస్ నుండి ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశారు. నిర్దేశిత సమయాల్లో అక్కడికి చేరుకునే వికలాంగులు, వృద్ధులకు ప్రత్యేక దర్శనం ఏర్పాట్లను చేసింది దేవాదాయ శాఖ, అంతేకాదు.. వికలాంగులు, వృద్ధులకు ఈ స్పెషల్ దర్శనం కోసం ఎటువంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు. పాయింట్ నుండి తీసుకెళ్లి దర్శనం అనంతరం అయిన అనంతరం భక్తులను తిరిగి అదే పాయింట్లు దింపేవిధంగా అధికారులు ఏర్పాట్లు చేశారు.
మరోవైపు అమ్మవారి ఆలయంలో శరన్నవరాత్రి ఏర్పాట్లను పోలీస్ కమిషనర్ క్రాంతి రానా స్వయంగా పరిశీలించారు. క్యూలైన్ల లో ఉన్న భక్తులను దర్శనానికి జరిపిన ఏర్పాట్లు ఎలా ఉన్నాయని అడిగి తెలుసుకున్నారు. సామాన్య భక్తుల మాదిరిగానే రూ. 500 టికెట్ తీసుకుని దుర్గమ్మ ని దర్శించుకున్నారు సీపీ రానా.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..