Navaratri 2022: బ్రహ్మచారిణి రూపంలో అమ్మవారు.. మంగళ దోషం తీర్చే అమ్మవారి పూజ విధానం, ప్రాముఖ్యత గురించి తెలుసుకోండి..

బ్రహ్మచారిణి అమ్మవారిని పూజించడం ద్వారా.. జాతకానికి సంబంధించిన మంగళ దోషాలు, దాని నుండి ఉత్పన్నమయ్యే అన్ని రకాల సమస్యలు తొలగిపోతాయి. అటువంటి పరిస్థితిలో ఈ రోజు మీ జాతకంలో అంగారక గ్రహం బలపడటం..

Navaratri 2022: బ్రహ్మచారిణి రూపంలో అమ్మవారు.. మంగళ దోషం తీర్చే అమ్మవారి పూజ విధానం, ప్రాముఖ్యత గురించి తెలుసుకోండి..
Goddess Brahmacharini Devi
Follow us
Surya Kala

|

Updated on: Sep 27, 2022 | 8:47 AM

Navaratri 2022:  సనాతన సంప్రదాయంలో నవరాత్రుల్లో తొమ్మిది రోజులు.. దుర్గాదేవి రూపాలను పూజిస్తారు. నేడు నవరాత్రుల్లో రెండవ రోజు. ఈరోజు దుర్గాదేవి అవతారాల్లో రెండో అవతారమైన బ్రహ్మచారిణిగా భక్తులతో పూజలను అందుకుంటారు. బ్రహ్మచారిణి అంటే అనంతం అని అర్ధం. బ్రహ్మ అంటే అన్నీ తెలిసిన, తానే జగత్తుగా కలిగిన స్వయంగా దైవం, జ్ఞానం కలిగిన అనే అర్ధం.  బ్రహ్మచారిణి జ్ఞానం, తపస్సు కలిగిన దేవతగా పరిగణించబడుతుంది. తనను ఆరాధించే మనిషికి దివ్య జ్ఞానాన్ని ఇస్తుంది. పరీక్ష-పోటీల కోసం రెడీ అవుతున్న స్టూడెంట్స్ ఆశించిన విజయాన్ని పొందడానికి ఈ తల్లిని ప్రత్యేకంగా పూజించడానికి కారణం ఇదే. తెల్లని చీర దాల్చి, కుడి చేతిలో జప మాల, కమండలం, ఎడమ చేతిలో కలశం ధరించి ఉంటుంది బ్రహ్మచారిణీ దేవి. ఈరోజు బ్రహ్మచారిణిని పూజించే విధానం, మంత్రోచ్ఛారణ, పవిత్ర కథ గురించి వివరంగా తెలుసుకుందాం.

బ్రహ్మచారిణి కథ నవరాత్రులలో దుర్గాదేవి రెండవ రూపమైన బ్రహ్మచారిణి తల్లిని పూజిస్తారు. పూర్వ జన్మలో బ్రహ్మచారిణి హిమాలయాల పర్వత రాజు కుమార్తెగా జన్మించి, శివుడిని భర్తగా పొందేందుకు దేవర్షి నారదుడి సలహా మేరకు కఠోర తపస్సు చేసిందని ప్రతీతి. అందుకే అమ్మవారిని బ్రహ్మచారిణి లేదా తపశ్చరిణి అని అంటారు. శివుడిని తన భర్తగా పొందడం కోసం.. అనేక సంవత్సరాలు కేవలం పండ్లు, పువ్వులను మాత్రమే తిని తీవ్రమైన తపస్సు చేసిందని పురాణాల కథనం.

బ్రహ్మచారిణి పూజా విధానం నవరాత్రులలో రెండవ రోజున, సూర్యోదయానికి ముందే నిద్రలేచి, స్నానం చేసి, ధ్యానం చేసిన తర్వాత.. అమ్మవారి పూజకు రెడీ అవ్వాలి. బ్రహ్మచారిణి ఫోటో ఉన్న గంగాజలాన్ని చల్లి స్నానం చేయించాలి. అనంతరం అమ్మవారికి బట్టలు, పువ్వులు, పండ్లు మొదలైన వాటిని నైవేద్యంగా సమర్పించండి. అమ్మవారి ఆరాధనలో, ఈ రోజు ముఖ్యంగా కుంకుమ, ఎర్రటి పువ్వులు సమర్పించాలి. నవరాత్రుల్లో రెండవ రోజున కుంకుమపువ్వు, పాయసం లేదా పంచదారను అమ్మవారి బ్రహ్మచారిణి పూజలో నైవేద్యంగా సమర్పించడం వల్ల అమ్మవారి అనుగ్రహం లభిస్తుందని, సాధకుడికి సర్వ సుఖాలు లభిస్తాయని నమ్ముతారు.

ఇవి కూడా చదవండి

ఆరాధనకు జ్యోతిష్య పరిహారం జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బ్రహ్మచారిణి అమ్మవారిని పూజించడం ద్వారా.. జాతకానికి సంబంధించిన మంగళ దోషాలు, దాని నుండి ఉత్పన్నమయ్యే అన్ని రకాల సమస్యలు తొలగిపోతాయి. అటువంటి పరిస్థితిలో ఈ రోజు మీ జాతకంలో అంగారక గ్రహం బలపడటం ద్వారా భూమి, భవనం, బలం మొదలైనవి లభిస్తాయి. కనుక బ్రహ్మచారిణీ అమ్మవారి అనుగ్రహాన్ని పొందడానికి ఈ రోజు ప్రత్యేకంగా పూజించండి.

బ్రహ్మచారిణి పూజించే మంత్రం నవరాత్రులలో రెండవ రోజున, ‘ఓం హ్రీం క్లీం బ్రహ్మచారిణ్యై నమః’ అనే మంత్రాన్ని భక్తితో, విశ్వాసంతో బ్రహ్మచారిణిని ఆరాధించండి. కోరిన కోరికలన్నీ త్వరగా నెరవేరుతాయి.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: (ఇక్కడ ఇచ్చినవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)