AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Navratri 2022: నవరాత్రుల్లో మీకిష్టమైన వాటిని వదులుకుని అమ్మవారిని పూజించండి.. దేవీ అనుగ్రహం మీ సొంతం

బ్రహ్మ వరంతో మహిషాసురుడు శక్తి వంతుడిగా మారి.. తన అనుచరులతో కలిసి దేవతలను, మనుషులను ఇబ్బంది పెట్టడం, తీవ్ర హింసలకు గురించి చేయడం మొదలు పెట్టాడు.  మహిషాసురుడు రాక్షస కృత్యాలను ఏ దేవుడు అడ్డుకోలేకపోయాడు. 

Navratri 2022: నవరాత్రుల్లో మీకిష్టమైన వాటిని వదులుకుని అమ్మవారిని పూజించండి.. దేవీ అనుగ్రహం మీ సొంతం
Avatars Of Maa Durga
Surya Kala
|

Updated on: Sep 26, 2022 | 6:08 PM

Share

Navratri 2022: నవరాత్రి వేడుకలు దేశ వ్యాప్తంగా అత్యంత ఘనంగా ప్రారంభమయ్యాయి. దేవీ శరన్నవరాత్రులను తొమ్మిది రోజుల పాటు అత్యంత ఘనంగా నిర్వహిస్తారు. రోజుకు ఒక అవతారంలో దుర్గాదేవిని భక్తులు అత్యంత శ్రద్దగా కొలుస్తారు. నవరాత్రి వేడుకల్లో ఒకొక్క రోజున ఒకొక్క అమ్మవారి రూపాన్ని పూజిస్తూ.. రకరకాల సాత్వికాహారాన్ని నైవేద్యంగా సమర్పిస్తారు. కుటుంబ సభ్యులు, స్నేహితులతో అత్యంత సంతోషముగా గడుపుతారు. అయితే, మనం నవరాత్రులు ఎందుకు జరుపుకుంటాము? తొమ్మిది రోజుల పండుగ ప్రాముఖ్యతను గురించి తెలుసుకోండి..

పురాణాల ప్రకారం.. సృష్టి కర్త బ్రహ్మ.. రాక్షస రాజు మహిషాసురునికి స్త్రీ చేతిలో తప్ప మిగిలిన వారి చేతిలో మరణం సంభవించని వరాన్ని ఇచ్చాడు.  మహిషాసురుడు శక్తి వంతుడిగా మారి.. తన అనుచరులతో కలిసి దేవతలను, మనుషులను ఇబ్బంది పెట్టడం, తీవ్ర హింసలకు గురించి చేయడం మొదలు పెట్టాడు.  మహిషాసురుడు రాక్షస కృత్యాలను ఏ దేవుడు అడ్డుకోలేకపోయాడు.

పరిస్థితిని గమనించిన త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణువు, శివుడు తమ శక్తులతో దుర్గాదేవిని సృష్టించారు. రాక్షసుడైన మహిషాసురుడిని సంహరించేందుకు దుర్గాదేవిని అత్యంత శక్తివంతమైన మహిళా చేయడం కోసం.. వివిధరకాల శక్తులను అందించారు. అంతేకాదు యుద్ధం చేసే ముందు.. మహిషాసురుడిని ఓడించడానికి దేవతలు దుర్గాదేవికి తొమ్మిది ఆయుధాలను అందించారు.

ఇవి కూడా చదవండి

దుర్గాదేవి మహిషాసురుడితో పది రోజుల పాటు యుద్ధం చేసింది. యుద్ధ సమయంలో దేవతలను మోసం చేస్తూ.. చావునుంచి తప్పించుకోవడం కోసం.. రకరకాల రూపాయలను ధరించేవాడు. దుర్గాదేవి ఈ పది రోజులు మహిషాశుడితో రాక్షసులతో యుద్ధం చేస్తూ.. అనేక కష్టాలను ఎదుర్కొంది.  యుద్ధం చేసే సమయంలో దుర్గాదేవి నుంచి మరణాన్ని తప్పించుకునేందుకు నిరంతరం తన రూపాన్ని మార్చుకున్నాడు. చివరికి గేదెగా మారిపోయాడు. దుర్గాదేవి మహిష రూపంలో ఉన్న మహిషాసురుడిని యుద్ధం మొదలైన పదోరోజు సంహరించింది.

దీంతో చెడుపై మంచి విజయం సాధించింది. ఈ విజయానికి గుర్తుగా అప్పటి నుంచి నవరాత్రులను అత్యంత ఘనంగా జరుపుకుంటారు. ఈ నవరాత్రులు (9 రాత్రులు) చెడుపై మంచి గెలుపుకి సాక్ష్యంగా నిలుస్తాయి. దీంతో ఈ నవరాత్రుల్లో అమ్మవారిని అనుగ్రహం కొలిచే భక్తులు సుఖ సంతోషాలను విడిచి కష్ట నష్టాలకు ఓర్చి పూజించాలని కోరుకుంటారు. లోక కళ్యాణం కోసం దుర్గాదేవి చేసిన త్యాగం,  ఆ తొమ్మిది రోజుల్లో ఆమె అనుభవించిన కష్టాలను గౌరవిస్తూ.. భక్తులు తమ కు ఇష్టమైన వాటిని నవరాత్రుల్లో విడిచిపెడతారు. ఇలా తమకు నచ్చిన ఆహారాన్ని నవరాత్రుల్లో విడిచి పెడితే., అమ్మ అనుగ్రహం లభిస్తుందని భక్తుల విశ్వాసం.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: (ఇక్కడ ఇచ్చినవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)