Navaratri 2022: పిండి ఆకారంలో ఇక్కడ అమ్మవారు.. నవరాత్రికి కూరగాయలే స్పెషల్ నైవేద్యం.. ఎక్కడో తెలుసా..

కాన్పూర్‌లోని హతియా బజార్‌లోని మూల్‌గంజ్‌లోని ఇరుకైన వీధుల్లో బుద్ధ దేవి ఆలయం నిర్మించబడింది. ఈ ఆలయం అన్ని అమ్మవారి ఆలయాలకంటే  భిన్నమైనది. బుద్ధ దేవి ఆలయానికి సంబంధించిన ఈ ప్రత్యేకమైన సంప్రదాయం కూడా

Navaratri 2022: పిండి ఆకారంలో ఇక్కడ అమ్మవారు.. నవరాత్రికి కూరగాయలే స్పెషల్ నైవేద్యం.. ఎక్కడో తెలుసా..
Buddha Devi Temple Kanpur
Follow us

|

Updated on: Sep 26, 2022 | 6:01 PM

Navaratri 2022: దేశ వ్యాప్తంగా నేటి నుంచి శరన్నవరాత్రులు ప్రారంభమయ్యాయి. అమ్మవారి భక్తులకు ఈ రోజు పెద్ద పండుగ లాంటిది. తొమ్మిది రోజుల పాటు అమ్మవారిని భక్తి శ్రద్దలతో పూజిస్తారు. తొమ్మిది రోజులు తొమ్మిది రూపాల్లో అమ్మవారు తన భక్తులను అనుగ్రహిస్తుందని.. విశ్వాసం. ఈ నవరాత్రుల్లో దేశ వ్యాప్తంగా ఉన్న అమ్మవారి ఆలయాల్లో భక్తుల రద్దీ నెలకొంది. వివిధ ఆలయాల్లో భక్తుల అమ్మవారిని పూజించి.. తమ శక్తికొలది పండ్లు, పువ్వులు, కొబ్బరి కాయలు సమర్పిస్తారు. దాదాపు ప్రతి ఆలయంలోనూ ఇదే విధంగా భక్తులు కనులను సమ్పరిస్తారన్న సంగతి తెలిసింది. అయితే కాన్పూర్‌లో ఓ దేవాలయంలో మాత్రం అమ్మవారికి విభిన్నంగా నైవేద్యం పెడతారు.

కాన్పూర్‌లోని హతియా బజార్‌లోని మూల్‌గంజ్‌లోని ఇరుకైన వీధుల్లో బుద్ధ దేవి ఆలయం నిర్మించబడింది. ఈ ఆలయం అన్ని అమ్మవారి ఆలయాలకంటే  భిన్నమైనది. బుద్ధ దేవి ఆలయానికి సంబంధించిన ఈ ప్రత్యేకమైన సంప్రదాయం కూడా హతియా బజార్ కు స్పెషల్ గుర్తింపును తెచ్చిపెట్టింది. ఇతర దేవాలయాల మాదిరిగానే.. బుద్దాదేవి ఆలయంలో పండ్లు, పువ్వులు కొబ్బరికాయను నైవేద్యంగా పెడతారు.  అయితే అమ్మవారికి స్వీట్స్ వంటి ఆహారపదార్ధాలకు బదులుగా, అమ్మవారి ఆనందం కోసం ఆకుపచ్చ కూరగాయలను నైవేద్యంగా సమర్పిస్తారు.

ఆకు కూరలను నైవేద్యంగా పెట్టి.. సస్యశ్యామలం కావాలని ఆకాంక్షించారు కాన్పూర్‌లోని బుద్ధ దేవి ఆలయం వెలుపల ఆకుపచ్చ కూరగాయలతో పండ్లు, పువ్వులతో కొబ్బరి వ్యాపారం చేస్తున్న సావిత్రి అనే భక్తులు.. ఇలా అమ్మవారికి పచ్చని కూరగాయలను నైవేద్యంగా సమర్పించడానికి ఒక కారణం ఉందని చెబుతుంది. అమ్మవారికి ఆకుపచ్చ కూరగాయలను సమర్పించి తమ కుటుంబంలోని పిల్లలు, పెద్దలు ను చల్లగా చూడమని కోరుకుంటుంది. అయితే ఆ ఆలయంలో అమ్మవారి విగ్రహం లేదు.. అమ్మవారిని బదులు పిండిని అమ్మవారిగా భావించి కొలుస్తున్నారు.

ఇవి కూడా చదవండి

బుద్దాదేవికి పచ్చి కూరగాయలు ఈ ఆలయాన్ని 200 సంవత్సరాల క్రితం నిర్మించినట్లు తెలుస్తోంది. ఈ ఆలయాన్ని నిర్మించిన చోట, పూర్వం పచ్చని తోట ఉండేది. ఇక్కడ పచ్చని కూరగాయలు పండించేవారు. కూరగాయల తోటను చూసుకునే వారికి దేవత కలలో వచ్చి ఇక్కడ భూమిలో తనను పాతిపెట్టినట్లు చెప్పింది. ఆ తర్వాత బుద్ధ దేవత మృతదేహాలను భూమి నుండి బయటకు తీసి ఇక్కడ ప్రతిష్టించారు. అప్పటి నుంచి బుద్దాదేవికి పచ్చి కూరగాయలను సమర్పించే సంప్రదాయం మొదలైంది. ఎన్నో ఏళ్లుగా ఇక్కడికి వస్తున్నామని కొంతమంది మహిళలు చెప్పారు. పిల్లలు, కుటుంబ పురోభివృద్ధి కోసం తల్లులందరూ పచ్చి కూరగాయలను నైవేద్యంగా సమర్పిస్తారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: (ఇక్కడ ఇచ్చినవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)