- Telugu News Photo Gallery Spiritual photos Chanakya niti stay away from these people or else there will be big loss
Chanakya Niti: హ్యాపీగా ఉండాలనుకుంటున్నారా.. ఇటువంటి ఆలోచనలు కల్గిన వ్యక్తికి దూరంగా ఉండమంటున్న చాణక్య..
ఆచార్య చాణక్యుడు నీతిశాస్త్రంలో కొంతమంది వ్యక్తుల ఆలోచనా తీరుని పేర్కొన్నాడు. వీరికి దూరంగా ఉండటం మంచిది. ఆచార్య చాణక్య ప్రకారం.. ఒక వ్యక్తి ఎటువంటి ఆలోచనపరులకు దూరం పాటించాలో ఈరోజు తెలుసుకుందాం..
Updated on: Sep 25, 2022 | 7:07 PM

ఆచార్య చాణక్యుడు నీతి శాస్త్రంలో మానవ జీవితంలోని అనేక ముఖ్యమైన అంశాలను గురించి చెప్పాడు. ఈ విషయాలను అనుసరించడం ద్వారా ఒక వ్యక్తి తన జీవితాన్ని విజయవంతం చేసుకోవచ్చు. మానవ జీవితాన్ని నరకంగా మార్చే చాణక్య నీతిలో ఇలాంటి కొన్ని సంఘటనలు కూడా ప్రస్తావించబడ్డాయి. ఆ సంఘటనలు ఏంటో తెలుసుకుందాం.

సమయం సందర్భం లేకుండా.. మెలికలు తిరుగుతూ మాట్లాడేవాళ్ళను మనం చూస్తూనే ఉంటాం.. మన చుట్టు పక్కల ఇలా మాట్లాడేవాళ్ళు చాలా మంది ఉంటారు. అలాంటి వారి మనసులో ఒకటి అనుకుంటారు.. బయటకు ఒకటి వ్యక్తం చేస్తారు. అలాంటి వారిని నమ్మడం వల్ల మీరు ఇబ్బందుల్లో పడతారు. కాబట్టి అలాంటి వారికి వీలైనంత దూరం పాటించండి

తప్పుడు నిర్ణయాల తీసుకునే విధంగా మిమ్మల్ని ప్రోత్సహించే వ్యక్తులు - తప్పుడు నిర్ణయాలు తీసుకునే విధంగా మిమ్మల్ని ప్రోత్సహించే వ్యక్తులను దూరం ఉంచండి. అలాంటి వ్యక్తులు మిమ్మల్ని ముందు నుంచి ప్రోత్సహిస్తారు. వెనుక నుంచి మిమ్మల్ని ఎగతాళి చేస్తారు.

చెడు చేసే వారు - ఆచార్య చాణక్యుడు ప్రకారం మీ వెనుక చెడు చేసే వ్యక్తుల నుండి దూరంగా ఉండండి. ఎందుకంటే ఇతరులకు మీ ముందు చెడు చేసే వ్యక్తి .. రేపు మీకు ఖచ్చితంగా చెడు చేస్తాడు.

మనస్సులో మోసం ఉన్న వ్యక్తి - తన మాటలను ఇతరులతో ఎప్పుడూ పంచుకోని వ్యక్తిని దూరం ఉంచండి. మీరు నష్టపోతుంటే.. వారు మనసులో సంతోషపడుతుంటారు. మీకు జరిగిన చెడును చూసి సంతోషిస్తారు. బహిర్గతంగా వ్యక్తం చేయకపోయినా లోలోపల సంతోషిస్తారు. మనసుని మోసంతో నింపేసుకుంటారు.




