- Telugu News Photo Gallery Spiritual photos Navratri 2022 know how the festival of navratri is celebrated in different parts of the country
Navratri 2022: మొదలైన నవరాత్రి సందడి.. దేశంలో వివిధ ప్రాంతాలలో దసరా పండుగను ఎలా జరుపుకుంటారో తెలుసా…
Navratri 2022: ఈ సంవత్సరం దేవీ శరన్నవరాత్రులు నేటి నుండి అంటే సెప్టెంబర్ 26 నుండి ప్రారంభమయ్యాయి. దేశవ్యాప్తంగా ఈ పండుగను వైభవంగా జరుపుకుంటారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో అమ్మవారికి వివిధ రకాలుగా స్వాగతం పలుకుతూ.. విభిన్న పద్ధతుల్లో పూజలను చేస్తారు.
Updated on: Sep 26, 2022 | 4:54 PM

హిందూమతంలో నవరాత్రి పండుగకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. దేశవ్యాప్తంగా ఈ పండుగను వైభవంగా జరుపుకుంటారు. ఈ సమయంలో, ప్రజలు దుర్గాదేవి తొమ్మిది రూపాలను అత్యంత భక్తి శ్రద్దలతో పూజిస్తారు. దేశంలోని వివిధ ప్రాంతాలలో నవరాత్రి పండుగను వివిధ రకాలుగా జరుపుకుంటారు.

పశ్చిమ బెంగాల్ - పశ్చిమ బెంగాల్‌లో నవరాత్రి చివరి 4 రోజులు వైభవంగా జరుపుకుంటారు. ఇందులో సప్తమి, అష్టమి, నవమి, దశమి మొదలైనవి ఉన్నాయి. ఈ సందర్భంగా మహిళలు సంప్రదాయ చీరలు ధరిస్తారు. ధునుచి నృత్యాన్ని ప్రదర్శిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా అనేక మండపాలు ఏర్పాటు చేశారు. అమ్మవారిని ప్రతిష్టించి పూజలను చేస్తారు.

గుజరాత్‌లో గర్బా - నవరాత్రి సమయంలో గుజరాత్‌లో గర్బా ఆడతారు. దేవత తొమ్మిది రూపాలను గర్బా నృత్యంతో పూజించి ఆడిపాడతారు. గర్బా ఆడుతున్న సమయంలో మహిళలు దీపం ఉన్న మట్టి కుండ చుట్టూ నృత్యం చేస్తారు. అంతేకాదు మహిళలు, పురుషులు సాంప్రదాయ దుస్తులను ధరించి వెదురు కర్రలతో కోలాటం చేస్తారు.

దక్షిణ భారతదేశంలో నవరాత్రుల వెరీ వేరే స్పెషల్. వీధి వీధిన మండపాలు ఏర్పాటు చేసి.. అమ్మవారి విగ్రహాన్ని తొమ్మిది రోజులు అత్యంత భక్తి శ్రద్దలతో కొలుస్తారు. బొమ్మలు కొలువు ఏర్పాటు చేస్తారు. ఈ ప్రదర్శన దక్షిణాదిలో వివిధ రూపాల్లో ప్రసిద్ధి చెందింది. ఈ బొమ్మలు 7, 9, 11 మొదలైన బేసి సంఖ్యలలో ఏర్పాటు చేస్తారు. నవరాత్రులలో ఈ బొమ్మలను పూజిస్తారు. కొబ్బరికాయలు, మిఠాయిలు స్నేహితులకు, బంధువులకు కానుకగా ఇస్తారు.

మహారాష్ట్ర - గర్బా మహారాష్ట్రలో కూడా వివిధ ప్రదేశాలలో నిర్వహించబడుతుంది. వివాహిత స్త్రీలు ఒకరి ఇంటికి ఒకరు వస్తారు. వారు పసుపు, కుంకుమలను ఒకరికొకరు ఇచ్చుకుని.. తీపి వస్తువులను గిప్ట్ గా అందించుకుంటారు.





























