- Telugu News Photo Gallery Spiritual photos According to chanakya niti women love these qualities in men in telugu
Chanakya Niti: పురుషుల్లో ఈ లక్షణాలు ఉంటే స్త్రీలు ప్రేమలో పడడం ఖాయం అంటోన్న చాణక్య.. అందులో మీరున్నారా..
ఆచార్య చాణక్య రాష్ట్ర పాలనను నడపడంలో ముఖ్యమైన పాత్ర పోషించిన ఉత్తమ వ్యూహకర్తలలో ఒకరు. చాణక్యుడు సూచించిన విషయాలు చాలా ప్రభావవంతంగా ఉంటాయి. నేటికీ ప్రజలు వాటిని జీవితంలో అమలు చేయడానికి ప్రయత్నిస్తున్నారు.
Updated on: Sep 24, 2022 | 4:12 PM

ఆచార్య చాణక్యుడు నీతి శాస్త్రంలో మానవ జీవితంలోని అనేక ముఖ్యమైన అంశాలను గురించి చెప్పాడు. ఈ విషయాలను అనుసరించడం ద్వారా ఒక వ్యక్తి తన జీవితాన్ని విజయవంతం చేసుకోవచ్చు. మానవ జీవితాన్ని నరకంగా మార్చే చాణక్య నీతిలో ఇలాంటి కొన్ని సంఘటనలు కూడా ప్రస్తావించబడ్డాయి. ఆ సంఘటనలు ఏంటో తెలుసుకుందాం.

సమయం సందర్భం లేకుండా.. మెలికలు తిరుగుతూ మాట్లాడేవాళ్ళను మనం చూస్తూనే ఉంటాం.. మన చుట్టు పక్కల ఇలా మాట్లాడేవాళ్ళు చాలా మంది ఉంటారు. అలాంటి వారి మనసులో ఒకటి అనుకుంటారు.. బయటకు ఒకటి వ్యక్తం చేస్తారు. అలాంటి వారిని నమ్మడం వల్ల మీరు ఇబ్బందుల్లో పడతారు. కాబట్టి అలాంటి వారికి వీలైనంత దూరం పాటించండి

తప్పుడు నిర్ణయాల తీసుకునే విధంగా మిమ్మల్ని ప్రోత్సహించే వ్యక్తులు - తప్పుడు నిర్ణయాలు తీసుకునే విధంగా మిమ్మల్ని ప్రోత్సహించే వ్యక్తులను దూరం ఉంచండి. అలాంటి వ్యక్తులు మిమ్మల్ని ముందు నుంచి ప్రోత్సహిస్తారు. వెనుక నుంచి మిమ్మల్ని ఎగతాళి చేస్తారు.

స్త్రీలు, పురుషులు తమ భాగస్వామి అందంగా కనిపించాలని కోరుకుంటారనేది నిజం. అయితే చాలా మంది మహిళలు పురుషుల వ్యక్తిత్వంపై ఎక్కువ శ్రద్ధ చూపుతారు. ఒక వ్యక్తి మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటే.. అతని గొప్ప గుణమని నిరూపించవచ్చు. స్త్రీలు అత్యాశ లేదా అహంకార ధోరణులను కలిగి ఉన్న పురుషుల నుండి దూరంగా ఉండటానికి ఇష్టపడతారు. మహిళలు నిజాయితీగా, విధేయతతో ఉన్నవారిని ఇష్టపడతారు. అటువంటి వారిని జీవిత భాగస్వామిగా కోరుకుంటారు.

చెడు చేసే వారు - ఆచార్య చాణక్యుడు ప్రకారం మీ వెనుక చెడు చేసే వ్యక్తుల నుండి దూరంగా ఉండండి. ఎందుకంటే ఇతరులకు మీ ముందు చెడు చేసే వ్యక్తి .. రేపు మీకు ఖచ్చితంగా చెడు చేస్తాడు.





























