Telugu News » Photo gallery » Health Tips These are the benefits of consuming coconut water at night
Coconut Water Benefits: రాత్రి నిద్రపోయే ముందు కొబ్బరి నీళ్లు తాగితే బోలెడు ప్రయోజనాలు.. ఆ వ్యాధులన్నింటికీ చెక్..
Shiva Prajapati |
Updated on: Sep 27, 2022 | 2:03 PM
Coconut Water Benefits: కొబ్బరి నీరు శరీరానికి ఎంత మేలు చేస్తుందో మనందరికీ తెలిసిందే. ఆరోగ్యంపై శ్రద్ధ ప్రతి ఒక్కరూ కొబ్బరి నీళ్లను తాగుతుంటారు. ఇందులో విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉండటం వల్ల ఆరోగ్యానికి అనేక రకాల ప్రయోజనాలను అందిస్తాయి.
Sep 27, 2022 | 2:03 PM
కొబ్బరి నీరు శరీరానికి ఎంత మేలు చేస్తుందో మనందరికీ తెలిసిందే. ఆరోగ్యంపై శ్రద్ధ ప్రతి ఒక్కరూ కొబ్బరి నీళ్లను తాగుతుంటారు. ఇందులో విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉండటం వల్ల ఆరోగ్యానికి అనేక రకాల ప్రయోజనాలను అందిస్తాయి.
1 / 9
స్వచ్ఛమైన, సహజమైన ఈ కొబ్బరి నీళ్లను చాలా మంది పగటిపూట ఎక్కువగా తాగుతుంటారు. ముఖ్యంగా వేసవి కాలంలో కొబ్బరినీరు తాగడం వల్ల శరీరం చల్లగా ఉంటుంది. అయితే, పగటిపూట తాగడం వల్ల కలిగే ప్రయోజనాలకంటే.. రాత్రిపూట కొబ్బరినీరు, కొబ్బరి తినడం వలన అనేక ప్రయోజనాలు ఉన్నాయని పరిశోధకులు చెబుతున్నారు.
2 / 9
శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుకోవడం వల్ల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. ఇందులో హైడ్రేటింగ్, యాంటీఫంగల్, యాంటీబ్యాక్టీరియల్ లక్షణాలు ఉన్నాయి. అధిక రక్తపోటు, గుండె సంబంధిత సమస్యల చికిత్సలో కొబ్బరి నీరు చాలా ప్రభావవంతంగ ఉంటుంది.
3 / 9
చాలా మందికి తెలియకపోవచ్చు.. ఉదయం పూట గానీ, రాత్రి నిద్రపోయే ముందు కొబ్బరి నీళ్లు తాగడం చాలా ప్రయోజనకరమని నిపుణులు చెబుతున్నారు. అయితే, చాలామంది ఉదయాన్నే, రాత్రి పడుకునే వేళ కొబ్బరినీళ్లు తాగితే దగ్గు, కఫం వంటి సమస్యలు తలెత్తుతాయని భయపడుతుంటారు. కానీ, అలాంటి భయం అవసరంలేదని చెబుతున్నారు పరిశోధకులు. ఈ సమయాల్లో తాగితే ఆరోగ్య ప్రయోజనాలుంటాయని చెబుతున్నారు.
4 / 9
అధిక రక్తపోటుతో బాధపడేవారికి కొబ్బరి నీరు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. సహజ పద్ధతిలో బ్లడ్ ప్రెజర్ తగ్గాలంటే.. రాత్రిపూట కొబ్బరి నీళ్లు తాగాలని సూచిస్తున్నారు. అయితే, రాత్రి వేళ బీపీ టాబ్లెట్స్ వాడుతున్నట్లయితే కొబ్బరి నీరు అస్సలు తీసుకోవద్దని సూచిస్తున్నారు నిపుణులు.
5 / 9
కిడ్నీ సమస్యలు ఉన్నవారు కూడా కొబ్బరి నీళ్లు తాగవచ్చు. కిడ్నీ వ్యాధిగ్రస్తులు సాయంత్రం పూట కొబ్బరినీళ్లను తాగితే.. అందులోని పోషకాలు రాత్రంతా శరీరానికి అవసరమైన శక్తిని అందజేస్తుంది. తద్వారా శరీరానికి, ఆరోగ్యానికి మేలు చేస్తుంది.
6 / 9
డీహైడ్రేషన్‌కు కొబ్బరి నీరు ఉత్తమ ఔషధం. రాత్రి పడుకున్నాక మన శరీరం రిలాక్స్ అవుతుంది. పగటిపూట మేల్కొని ఉన్నప్పుడు మామూలుగానే నీళ్లు తాగుతాం. నిద్రిస్తున్నప్పుడు నీళ్లు తాగం. దీనివల్ల శరీరం డీహైడ్రేట్ అవుతుంది. అందుకే నిద్రపోయే ముందు కొబ్బరి నీళ్లు తాగడం వల్ల శరీరం హైడ్రేట్‌గా ఉంటుంది.
7 / 9
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ రాకుండా ఉండాలంటే కొబ్బరి నీళ్లు తాగాలని సూచిస్తున్నారు ఆరోగ్య నిపుణులు. మూత్ర ద్వారా శరీరంలోని టాక్సిన్స్‌ను తొలగిస్తుంది.
8 / 9
కొబ్బరి నీళ్లలో ఎలక్ట్రోలైట్స్, పొటాషియం ఉంటాయి. ఇవి గుండె సంరక్షణలో సహాయపడతాయి. ఇందులో ఉండే విటమిన్లు, మినరల్స్ గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. మీ గుండె ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ రాత్రి పడుకునే ముందు కొబ్బరినీళ్లు తాగవచ్చని సూచిస్తున్నారు పరిశోధకులు.