Viral Video: ప్రాణాలను లెక్కచేయకుండా బైక్ మీద యువకుడు స్టంట్స్.. పోలీసులు వింత శిక్ష.. భారీ చలానా వడ్డింపు

ఒక యువకుడు కదులుతున్న బైక్‌పై రెండు కాళ్లు ఒకవైపుకి పెట్టుకుని కూర్చున్నాడు. దీంతో అతని కాలు బ్రేకుపై లేదు.. చేయి క్లచ్‌పై లేదు. ఒక చేతితో మాత్రమే బైక్ ని నడుపుతూ హ్యాండిల్ చేస్తున్నాడు.

Viral Video: ప్రాణాలను లెక్కచేయకుండా బైక్ మీద యువకుడు స్టంట్స్.. పోలీసులు వింత శిక్ష.. భారీ చలానా వడ్డింపు
Viral Video
Follow us

|

Updated on: Sep 27, 2022 | 7:56 AM

Viral Video: ప్రపంచంలో చాలా మంది తమ జీవితాలతో తామే ఆడుకుంటారు. తమ ప్రాణాలను పందెంగా పెట్టుకుని సాహసాలను చేస్తూ ఉంటారు. ఏదైనా పని చేసే ముందు దాని వల్ల తమకు ఆపద వస్తుందా లేదా అని ఆలోచించరు. ఇప్పుడు స్టంట్‌మెన్‌లను చూడండి. ఎక్కడైనా సరే తమ విన్యాసాలు చూపించడానికి ఆసక్తిని చూపిస్తారు. అనంతరం వచ్చే పర్యవసానాల గురించి ఆలోచించరు. ముఖ్యంగా బైక్ స్టంట్స్ ను చేసే వారి స్పిరిట్ ఈరోజుల్లో కాస్త ఎక్కువైంది. సోషల్ మీడియాలో కూడా..  దీనికి సంబంధించిన అన్ని వీడియోలను చూసి ఉంటారు. చాలామంది తమ బైక్స్ , కార్లతో రోడ్లపై రకరకాల  విన్యాసాలు చేసి.. చూపిస్తున్నారు.  ప్రసుత్తం అలాంటి వీడియో ఒకటి వైరల్ అవుతోంది. అందులో ఒక వ్యక్తి  బైక్‌పై స్టంట్స్ చేస్తూ కనిపించాడు. అయితే ఈ విన్యాసం కారణంగా ఇప్పుడు వివాదాల్లో చిక్కుకున్నాడు.

సాధారణంగా బైక్‌పై వెళ్తూ వెనుక కూర్చునే మహిళలు తమ రెండు కాళ్లను ఒకవైపున పెట్టుకుని కూర్చుంటారు. అదే విధంగా ఒక యువకుడు కదులుతున్న బైక్‌పై రెండు కాళ్లు ఒకవైపుకి పెట్టుకుని కూర్చున్నాడు. దీంతో అతని కాలు బ్రేకుపై లేదు.. చేయి క్లచ్‌పై లేదు. ఒక చేతితో మాత్రమే బైక్ ని నడుపుతూ హ్యాండిల్ చేస్తున్నాడు. ఇదే స్టైల్‌లో ఎక్కువ దూరం బైక్‌ నడిపాడు. రోడ్డు మధ్యలో గుంతలు ఉన్నా.. వాటిని పట్టించుకోలేదు. కేర్ తీసుకోలేదు. తనదైన శైలిలో సరదాగా విన్యాసం చేస్తూ బైక్ నడుపుతున్నాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అనంతరం పోలీసుల దృష్టికి చేరుకుంది. పోలీసులు వెంటనే చర్యలు ప్రారంభించారు. భారీగా చలాన్‌ వేశారు. అంతేకాదు ఆ వాహనదారుడు తన చెవిని పట్టుకుని.. భవిష్యత్తులో ఇలాంటి పనులు చేయనని క్షమాపణలు చెప్పాడు.

ఇవి కూడా చదవండి

ఈ ఉదంతం ఛత్తీస్‌గఢ్‌లోని దుర్గ్ జిల్లాలో చోటు చేసుకుంది.  బైక్ స్టంట్‌ను చేస్తున్న వ్యక్తి వీడియోను దుర్గ్ పోలీసులు తన అధికారిక ట్విట్టర్ హ్యాండిల్‌లో షేర్ చేశారు. ‘డ్రైవింగ్ స్టంట్స్, మోడిఫైడ్ సైలెన్సర్‌లు, ర్యాష్‌ డ్రైవింగ్ పై తాము నిరంతరం చర్యలు తీసుకుంటున్నామని’ అని క్యాప్షన్‌లో రాశారు. దయచేసి ట్రాఫిక్ రూల్స్ పాటించమని కోరారు.

28 సెకన్ల నిడివి గల ఈ వీడియోను ఇప్పటి వరకు 2 లక్షల 87 వేల మందికి పైగా వీక్షించగా, 9 వేల మందికి పైగా ఈ వీడియోను లైక్ చేసి రకరకాల రియాక్షన్‌లు కూడా ఇచ్చారు.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఈమె మాటలకు.. పాటలకు లక్షలాది జనం ఎందుకు మైమరచిపోతున్నారు.!
ఈమె మాటలకు.. పాటలకు లక్షలాది జనం ఎందుకు మైమరచిపోతున్నారు.!
బంగారంపై పన్ను నిబంధనలను మార్చిన కేంద్రం.! పన్ను చెల్లించాల్సిందే
బంగారంపై పన్ను నిబంధనలను మార్చిన కేంద్రం.! పన్ను చెల్లించాల్సిందే
నవంబరు 1 నుంచి కొత్త రూల్స్ ఇవే.! అన్ని రంగాల్లో మార్పులు..
నవంబరు 1 నుంచి కొత్త రూల్స్ ఇవే.! అన్ని రంగాల్లో మార్పులు..
గ్యాస్, క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు అలర్ట్‌.! మారనున్న రూల్స్‌
గ్యాస్, క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు అలర్ట్‌.! మారనున్న రూల్స్‌
పొద్దున్నే కోడిపుంజు ఎందుకు కూస్తుందో తెలుసా.? ఇదీ అసలు రహస్యం..
పొద్దున్నే కోడిపుంజు ఎందుకు కూస్తుందో తెలుసా.? ఇదీ అసలు రహస్యం..
జనం ఉచిత బస్సు వద్దంటున్నారా.! కర్ణాటకలో ఎత్తేస్తారా.?
జనం ఉచిత బస్సు వద్దంటున్నారా.! కర్ణాటకలో ఎత్తేస్తారా.?
రాత్రిళ్లు తక్కువ నిద్రపోతున్నారా.! అయితే ఈ వీడియో మీకోసమే..
రాత్రిళ్లు తక్కువ నిద్రపోతున్నారా.! అయితే ఈ వీడియో మీకోసమే..
ATM దొంగతనాన్ని లైవ్‌లో చూసిన సిబ్బంది.. తర్వాత ఏం చేశారు.?
ATM దొంగతనాన్ని లైవ్‌లో చూసిన సిబ్బంది.. తర్వాత ఏం చేశారు.?
ఉత్తరాఖండ్‌లో HIV బాంబ్‌.. ఒకేసారి 19మందికి సోకిన ఎయిడ్స్‌.!
ఉత్తరాఖండ్‌లో HIV బాంబ్‌.. ఒకేసారి 19మందికి సోకిన ఎయిడ్స్‌.!
పసిబిడ్డను వంతెనపై నుంచి విసిరేసిన తల్లిదండ్రులు. తర్వాత ఏమైందంటే
పసిబిడ్డను వంతెనపై నుంచి విసిరేసిన తల్లిదండ్రులు. తర్వాత ఏమైందంటే