Viral Video: పెళ్లి చేసుకోరా నాయనా.. బాగుపడతావ్ అంటూ ఓ రేంజ్ లో డ్యాన్స్ చేస్తోన్న శిఖర్ ధావన్.. వీడియో వైరల్

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో.. ధావన్ పెళ్లి విషయంమై జడేజా ముందు ఓ రేంజ్ లో డ్యాన్స్ చేస్తున్నాడు. పెళ్లి చేసుకో..బాధ్యత వస్తే బాగుపడతావని అంటూ ధావన్ డ్యాన్స్  చేశాడు

Viral Video: పెళ్లి చేసుకోరా నాయనా.. బాగుపడతావ్ అంటూ ఓ రేంజ్ లో డ్యాన్స్ చేస్తోన్న శిఖర్ ధావన్.. వీడియో వైరల్
Shikhar Dhawan Dance Video
Follow us

|

Updated on: Sep 24, 2022 | 7:23 PM

Viral Video: భారత స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా గాయం కారణంగా ప్రస్తుతం టీమ్ ఇండియాకు దూరమైన సంగతి తెలిసిందే. ఆసియా కప్ 2022 సమయంలో గాయపడ్డాడు. దీని కారణంగా రవీంద్ర జడేజా మొత్తం టోర్నమెంట్ నుండి అలాగే T20 ప్రపంచ కప్ కు దూరమయ్యాడు. మోకాలికి శస్త్రచికిత్స చేయించుకున్న జడేజా ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నాడు. క్రమంగా గాయం నుంచి కోలుకుంటున్నాడు. అయితే రవీంద్ర జడేజాను భారత ఓపెనర్ శిఖర్ ధావన్  కలవడానికి వెళ్ళాడు.. అంతేకాదు… ఎంతో సరదాగా గడిపాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో  అందుకు సంబంధించిన ఓ వీడియోను షేర్ చేశాడు శిఖర్ ధావన్ .

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో.. ధావన్ పెళ్లి విషయంమై జడేజా ముందు ఓ రేంజ్ లో డ్యాన్స్ చేస్తున్నాడు. పెళ్లి చేసుకో..బాధ్యత వస్తే బాగుపడతావని అంటూ ధావన్ డ్యాన్స్  చేశాడు. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియా వేదికగా షేర్ చేశాడు ధావన్. జడేజా గాయం గురించి మాట్లాడుతూ.. త్వరగా ఫిట్ నెస్ సాధించి.. మైదానంలోకి త్వరగా అడుగు పెట్టాలని జడేజా ప్రయత్నిస్తున్నాడని చెప్పాడు.

ఇవి కూడా చదవండి

ఆసియా కప్‌ లో పాకిస్తాన్, హాంకాంగ్‌లతో జరిగిన గ్రూప్ స్టేజ్ మ్యాచ్‌లో పాల్గొన్నాడు. పాకిస్థాన్‌పై అద్భుతంగా రాణించి 35 పరుగులు చేశాడు జడేజా. హాంకాంగ్‌తో ఆడుతూ.. ఒక వికెట్ తీసుకున్నాడు.. ఆ తర్వాత గాయం కారణంగా మైదానంలోకి రాలేకపోయాడు. టోర్నమెంట్ నుండి వైదొలగవలసి వచ్చింది రవీంద్ర జడేజా స్థానంలో అక్షర్ పటేల్ వచ్చాడు.

జడేజా గాయంతో జట్టుకు నష్టం అయితే, ఆసియా కప్‌లో.. జడేజా లేని లోటు టీమ్ ఇండియా కు స్పష్టంగా తెలిసింది. టీమ్ ఇండియా సూపర్ 4 అడ్డంకిని అధిగమించలేకపోయింది. శిఖర్ ధావన్ అయితే చివరిసారిగా జింబాబ్వే టూర్‌లో కనిపించాడు. జింబాబ్వేతో జరిగిన తొలి వన్డేలో ధావన్ అజేయంగా 81, రెండో మ్యాచ్‌లో 33, చివరి మ్యాచ్‌లో 40 పరుగులు చేశాడు. అంతకుముందు వెస్టిండీస్ పర్యటనలో అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. అతను 3 మ్యాచ్‌ల్లో 2 అర్ధ సెంచరీలు సాధించాడు.

మరిన్ని క్రికెట్ వార్తలకు సంబంధించి ఇక్కడ క్లిక్ చేయండి..