Viral Video: దేవకన్యని తలపిస్తోన్న నెమలి.. అంబరాన్ని చుంబించాలని వయ్యారంగా ఎగురుతున్న అద్భుత దృశ్యం..

గాలిలో ఎగురుతున్న నెమలిని చూస్తుంటే అది భూలోకానికి చెందిన పక్షిలా అనిపించదు ఎవరికైనా. ఆకాశం నుంచి దిగివచ్చిన పక్షి.. తిరిగి తన స్థానానికి చేరుకోవాలని తపన పడుతున్నట్లు అనిపిస్తుంది.

Viral Video: దేవకన్యని తలపిస్తోన్న నెమలి.. అంబరాన్ని చుంబించాలని వయ్యారంగా ఎగురుతున్న అద్భుత దృశ్యం..
Viral Video
Follow us
Surya Kala

|

Updated on: Sep 24, 2022 | 4:43 PM

Viral Video: నెమలి జాతీయ పక్షి. చాలా అందమైన పక్షులకు హిందూ ధర్మంలో విశిష్ట స్థానం ఉంది. భారత ఉపఖండం కాకుండా ఆగ్నేయాసియా,  ఆఫ్రికా ఖండంలోని కాంగో బేసిన్‌లో కనిపిస్తాయి. నెమలిని పక్షుల రాజు అని కూడా పిలుస్తారు. ఎందుకంటే వర్షాకాలంలో ఆకాశం మేఘావృతమైనప్పుడు నెమలి  తమ రెక్కలను విప్పి, వజ్రాలు పొదిగిన దుస్తులు ధరించినట్లు నృత్యం చేస్తాయి. నెమలి నృత్యం గురించి వినని వారు బహు అరుదు. నెమలి నాట్యం ప్రజాదరణ పొందింది. అందమైన, రంగురంగుల ఈకలు మనస్సును బంధిస్తాయి. ప్రపంచంలోనే భూమిపై ఎగరగలిగే అతిపెద్ద పక్షులలో నెమళ్లు ఒకటి.  అలాంటి వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో నెమలి గాలిలో ఎగురుతున్నట్లు కనిపిస్తుంది.

గాలిలో ఎగురుతున్న నెమలిని చూస్తుంటే అది భూలోకానికి చెందిన పక్షిలా అనిపించదు ఎవరికైనా. ఆకాశం నుంచి దిగివచ్చిన పక్షి.. తిరిగి తన స్థానానికి చేరుకోవాలని తపన పడుతున్నట్లు అనిపిస్తుంది. నెమలి రెక్కలు చాలా అద్భుతం అనిపిస్తాయి. అడవిలో ఇరుకైన రహదారిపై రెండు నెమళ్లు నడుస్తూ వెళ్తున్నాయి.  అందులో ఒకటి రోడ్డుపై హాయిగా నడుస్తుండగా.. మరో నెమలి పెద్ద రెక్కల సాయంతో గాలిలో ఎగరాలని ప్రయత్నిస్తోంది. ఇలాంటి అద్భుతమైన దృశ్యం చాలా అరుదుగా కనిపిస్తుంది.

ఇవి కూడా చదవండి

ఎగిరే నెమలి అందమైన వీడియో:

ఎగురుతున్న నెమలి అద్భుతమైన వీడియో @CosmicGaiaX అనే IDతో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయబడింది . ‘మెజెస్టిక్ ఫ్లైట్’ అని క్యాప్షన్ ఇచ్చారు. ఈ 10 సెకన్ల వీడియో 19 లక్షల సార్లు వీక్షించగా, 26 వేల మందికి పైగా లైక్ చేశారు. వీడియో చూసిన తర్వాత ప్రజలు వివిధ రకాల కామెంట్స్ చేస్తున్నారు. ఇది చాలా అందమైన దృశ్యమని కొందరు, ప్రకృతి అద్భుతమని కొందరు అంటున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..