Viral Video: తన ఓటమిలో కొడుకు విజయాన్ని చూసుకుని మురిసిపోయేవాడే నాన్న .. మీరు తండ్రి అయితే ఈ వీడియో మిస్ కాకండి..

తండ్రి తన కొడుకుతో సరదాగా డబ్ల్యూడబ్ల్యూఈ ఫైట్‌ చేస్తున్నది వీడియోలో చూడవచ్చు. పిల్లవాడు రాండీ ఓర్టన్‌గా మారాడు. తండ్రి బిగ్ షోగా మారి సరదాగా పోట్లాడుతున్నాడు.

Viral Video: తన ఓటమిలో కొడుకు విజయాన్ని చూసుకుని మురిసిపోయేవాడే నాన్న .. మీరు తండ్రి అయితే ఈ వీడియో మిస్ కాకండి..
Fathers Love Video Viral
Follow us
Surya Kala

|

Updated on: Sep 23, 2022 | 8:59 PM

Viral Video: స్మార్ట్‌ఫోన్‌లు ప్రజల జీవితాలను మార్చేశాయి.  వయసుతో సంబంధం లేకుండా సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టే వీడియోలను ఇష్టపడుతున్నారు. ఇంకా చెప్పాలంటే.. సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వీడియోలను చూడకుండా రోజు కూడా గడపలేకున్నారు. కొంతమంది తమ పిల్లలు చేసే ముద్దు ముద్దు పనులను తమ సెల్ ఫోన్ కెమెరాలో రికార్డ్ చేయడం అలవాటు చేసుకున్నారు. పిల్లలకు సంబంధించిన వీడియోలు ఇతర వీడియోల కంటే వేగంగా వైరల్ అవుతాయి. ఇందులో పిల్లల అందమైన చర్యలు నెటిజన్ల హృదయాలను గెలుచుకుంటాయి. అలాంటి వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

అమాయకత్వంతో నిండిన పిల్లలు ఆనందం, వారి సానుకూల దృక్ఫథం చూపరులకు శక్తిని నింపుతాయి. అలాంటి వీడియో ఒకటి ఇంటర్నెట్‌లో మళ్లీ ప్రత్యక్షమైంది. ఇందులో తండ్రి తన కొడుకుతో సరదాగా కుస్తీ పడుతున్నది చూడవచ్చు. తండ్రీ కొడుకుల ఫన్నీ ఫైట్‌ని డబ్ల్యూడబ్ల్యూఈ ఫైట్‌లా చూపిస్తున్నారు. ఈ చిన్నారి అమాయకత్వంతో నిండిన ఈ వీడియో మిమ్మల్ని మరింత ఆనందంగా మారుస్తుంది.

ఇవి కూడా చదవండి

తండ్రీ కొడుకుల వీడియోపై ఓ లుక్ వేయండి..: 

తండ్రి తన కొడుకుతో సరదాగా డబ్ల్యూడబ్ల్యూఈ ఫైట్‌ చేస్తున్నది వీడియోలో చూడవచ్చు. పిల్లవాడు రాండీ ఓర్టన్‌గా మారాడు. తండ్రి బిగ్ షోగా మారి సరదాగా పోట్లాడుతున్నాడు. ఇంతలో పిల్లవాడు మొదట తన తండ్రిని రాండీ ఓర్టన్‌తో కొట్టాడు. వెంటనే తండ్రి తన కొడుకుని సంతోషపెట్టడానికి కిందకు  పడిపోయాడు. ఆపై పిల్లవాడు తన తండ్రిని పిన్-డౌన్ చేస్తాడు. ఈ మ్యాచ్ గెలిచాడు.

ఈ వీడియో @GabbbarSingh ఖాతాలో ట్విట్టర్‌లో పోస్ట్ చేయబడింది. వార్త రాసే సమయానికి 23 లక్షల మందికి పైగా చూశారు. ‘మాకు ఇక్కడ WWE లేదు,  అయితే రెజ్లింగ్ ఖచ్చితంగా జరుగుతోందని ఒకరు.. పిల్లలు పందెం కట్టి మరీ తండ్రిని కొట్టారని మరొకరు తన ఓటమిలో కూడా తండ్రి తన విజయాన్ని చూస్తాడు.’ మరొక.. ఈ ‘వీడియో నిజంగా మూడ్ ఫ్రెషర్‌గా ఉంది’ అని రకరకాల కామెంట్స్ చేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..