Viral Video: కుక్కని నిద్రలేపడానికి రామ చిలుక తిప్పలు.. శునకాన్ని అనుకరిస్తున్న వీడియో చూస్తే వావ్ అంటారు..

చిలుక సరిగ్గా కుక్క గొంతుని కాపీ చేసింది. వీడియోలో  ఒక కుక్క తన మంచం మీద హాయిగా నిద్రిస్తుండగా, తెల్లటి చిలుక .. ఆ కుక్క స్వరాన్ని అనుసరిస్తూ.. ఆ కుక్కను నిద్ర లేపడానికి..

Viral Video: కుక్కని నిద్రలేపడానికి రామ చిలుక తిప్పలు.. శునకాన్ని అనుకరిస్తున్న వీడియో చూస్తే వావ్ అంటారు..
Video Viral
Follow us
Surya Kala

|

Updated on: Sep 24, 2022 | 3:41 PM

Viral Video: అందమైన పక్షులను చూడడం అందరికీ ఇష్టమే.. అయితే వాటిలో భిన్నం రామ చిలుకలు. వీటిని పెంచుకోవడానికి ప్రజలు అమితాశక్తిని చూపిస్తారు. చిలుకలు ఎంత తెలివిగలవో అంతే అందంగా ఉంటాయి. మనుషుల స్వరాన్ని ఖచ్చితంగా అనుకరిస్తాయన్న సంగతి తెలిసిందే. అయితే రామ చిలుకలు మనుషుల స్వరాలను మాత్రమే కాదు.. వివిధ రకాల జంతువులను స్వరాలను, అనేక రకాల శబ్దాలను కూడా అనుకరిస్తాయి. అంతేకాదు చాలా చిలుకలు మొబైల్ ఫోన్ రింగ్‌టోన్‌ల ధ్వనిని కూడా అనుకరిస్తూ ఉంటాయి. ఇలాంటి వీడియోలు తరచుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం ఒక వీడియో ఒకటి వైరల్ అవుతోంది. అందులో చిలుక కుక్క గొంతును అనుకరించిన తీరు విపరీతంగా నెటిజన్లను అలరిస్తుంది.

కుక్కలాగా చిలుక మొరిగే శబ్దం వింటే అసలు అది కుక్క కాదని మీకు అస్సలు అనిపించదు. చిలుక సరిగ్గా కుక్క గొంతుని కాపీ చేసింది. వీడియోలో  ఒక కుక్క తన మంచం మీద హాయిగా నిద్రిస్తుండగా, తెల్లటి చిలుక .. ఆ కుక్క స్వరాన్ని అనుసరిస్తూ.. ఆ కుక్కను నిద్ర లేపడానికి ప్రయత్నిస్తున్నట్లు మీరు చూడవచ్చు. మొదట్లో రామ చిలుక తన గొంతులో శునకాన్ని నిద్ర లేపాలని ప్రయత్నించినా నిద్ర లేవలేదు. దీంతో రామ చిలుక కుక్కలా మొరుగుతూ లేపడం మొదలు పెట్టింది. ఇప్పటి వరకూ మనుషులను , మానవ స్వరాన్ని అనుకరించే చిలుకలను మీరు చాలానే చూసి ఉంటారు. అయితే కుక్కలా మొరిగే చిలుకను చూడడం చాలా అరుదు. ఈ వీడియో చాలా ఫన్నీగా, అద్భుతంగా ఉంది. ఇది చూసిన తర్వాత మీరు కూడా ఆశ్చర్యపోతారు.

ఇవి కూడా చదవండి

వీడియోపై ఓ లుక్ వేయండి: 

కుక్కను అనుకరిస్తున్న చిలుక ఈ అద్భుతమైన వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఇన్‌స్టాగ్రామ్‌లో ID పేరుతో vishalkashyap2555తో భాగస్వామ్యం చేయబడింది. ఈ వీడియోను ఇప్పటివరకు 30 లక్షల కంటే ఎక్కువ మంది చూశారు. అదే సమయంలో లక్ష 60 వేల మందికి లైక్ చేసారు. వివిధ రకాల రియాక్షన్‌లు ఇచ్చారు. ఈ వీడియో చూసి కొందరు చిలుకకు నిద్రపోయేవారిని నిద్ర లేపకూడదు అంటూ బుద్ది చెప్పగా, మరికొందరు నవ్వుకుంటున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

మందుకు బానిసైన స్టార్ హీరో.. రాత్రంతా తాగుతూనే.. ఎలా మానేశాడంటే?
మందుకు బానిసైన స్టార్ హీరో.. రాత్రంతా తాగుతూనే.. ఎలా మానేశాడంటే?
బాక్సింగ్ డే టెస్టు మ్యాచ్‌కు టీమిండియా జట్టు ఇదే
బాక్సింగ్ డే టెస్టు మ్యాచ్‌కు టీమిండియా జట్టు ఇదే
విజయ్ దళపతి చేతిలో ఉన్న ఈ అమ్మాయిని ఇప్పుడు చూస్తే..
విజయ్ దళపతి చేతిలో ఉన్న ఈ అమ్మాయిని ఇప్పుడు చూస్తే..
తెల్ల జుట్టు నల్లగా మారేందుకు అద్భుతమైన చిట్కా..10రోజుల్లోనే..
తెల్ల జుట్టు నల్లగా మారేందుకు అద్భుతమైన చిట్కా..10రోజుల్లోనే..
ఐసీసీ బౌలర్ల ర్యాంకింగ్స్‌ విడుదల.. బుమ్రా ప్లేస్ ఎక్కడో తెలుసా
ఐసీసీ బౌలర్ల ర్యాంకింగ్స్‌ విడుదల.. బుమ్రా ప్లేస్ ఎక్కడో తెలుసా
ప్రధాని మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ.. ఆ అంశాలపై కీలక చర్చ!
ప్రధాని మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ.. ఆ అంశాలపై కీలక చర్చ!
ఆనంద్‌ మహీంద్రాకు ఎంతమంది పిల్లలు.. వారు ఏం చేస్తుంటారో తెలుసా.?
ఆనంద్‌ మహీంద్రాకు ఎంతమంది పిల్లలు.. వారు ఏం చేస్తుంటారో తెలుసా.?
టీమిండియా క్రికెటర్ తండ్రికి ఏడేళ్ల జైలు శిక్ష.. కేసు ఏంటంటే?
టీమిండియా క్రికెటర్ తండ్రికి ఏడేళ్ల జైలు శిక్ష.. కేసు ఏంటంటే?
అమ్మబాబోయ్.. 1 కాదు.. 2 కాదు.. 11 పులులు వచ్చాయ్..
అమ్మబాబోయ్.. 1 కాదు.. 2 కాదు.. 11 పులులు వచ్చాయ్..
గురువారం సీఎం రేవంత్ రెడ్డితో సినీప్రముఖుల భేటీ..
గురువారం సీఎం రేవంత్ రెడ్డితో సినీప్రముఖుల భేటీ..