Viral Video: బురదలో కూరుకున్న ట్రక్కు.. నేనున్నానంటూ గజరాజు సాయం.. వీడియో వైరల్

మహారాష్ట్రలోని నాందేడ్‌లో దసరా పండుగ సందర్భంగా నిర్వహించే జాతరలో పాల్గొనే బృందంతో పాటు అమృత్‌సర్ నుండి ఏనుగు కూడా వచ్చింది.  నాందేడ్‌కు వెళ్లే బ్యాచ్‌లో 60 గుర్రాలు కూడా ఉన్నాయి.

Viral Video: బురదలో కూరుకున్న ట్రక్కు.. నేనున్నానంటూ గజరాజు సాయం.. వీడియో వైరల్
Elephant Video Viral
Follow us
Surya Kala

|

Updated on: Sep 24, 2022 | 6:51 PM

Viral Video: భూమి మీద అతి పెద్ద జంతువు ఏనుగు.. వీటి జీవన విధానానికి మానవ జీవన విధానానికి చాలా దగ్గర పోలిక ఉంటుందని వన్యప్రాణి ప్రేమికులు చెబుతారు. ఏనుగుకి సంబంధించిన అనేక రకాల వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి. తాజాగా ఓ ఏనుగు ట్రక్కును నెట్టుతున్న వీడియో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఆ వీడియోలో ట్రక్కు తడి మట్టిలో ఇరుక్కుపోయింది. కొంతమంది ట్రక్కును ఆ మట్టి నుంచి  బయటకు నెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. అయితే ఆ తడి మట్టిలో ఇరుక్కున్న ట్రక్కుని బయటకు తీయడానికి ఏనుగు కూడా సహాయం చేసింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

అమృత్‌సర్‌ నుంచి నాందేడ్‌ వెళ్తున్న బృందం: సమాచారం ప్రకారం.. కొందరు సిక్కు యువకుల బృందం.. అమృత్‌సర్ నుండి మహారాష్ట్రలోని నాందేడ్‌కు వెళుతోంది. సిక్కు సంఘానికి చెందిన బృందం కొలారస్‌లోని భటోవా గ్రామంలో సేవ చేయడానికి వెళ్తుంది. బ్యాచ్‌లోని సభ్యుడు గురుదేవ్ సింగ్ మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతం కావడంతో.. తమ బృందం వెళ్తున్న ట్రక్ ను ఒక రహదారిపై పార్క్ చేయాల్సి వచ్చింది. అకస్మాత్తుగా కురిసిన భారీ వర్షాలకు రోడ్డు బురదగా మారింది. దీంతో పలు లారీలు బురదలో కూరుకుపోయాయి. మట్టిలో ఇరుక్కున్న ట్రక్కులను బయటకు తీయడానికి సిక్కు వర్గానికి చెందిన బృందం ప్రయత్నించింది. కష్టపడి.. తమ శక్తిని అంతా ఉపయోగించి మట్టిలో ఇరుక్కున్న సుమారు 3 ట్రక్కులను బయటకు తీశారు. దీనికి ఏనుగుకు కూడా సాయం చేసింది.

ఇవి కూడా చదవండి

మహారాష్ట్రలోని నాందేడ్‌లో దసరా పండుగ సందర్భంగా నిర్వహించే జాతరలో పాల్గొనే బృందంతో పాటు అమృత్‌సర్ నుండి ఏనుగు కూడా వచ్చింది.  నాందేడ్‌కు వెళ్లే బ్యాచ్‌లో 60 గుర్రాలు కూడా ఉన్నాయి. సిక్కులు ఇప్పటికీ గుర్రాలు, ఏనుగులను తమ సైన్యంలో భాగంగా భావిస్తారు. ఈ ఏనుగు కూడా గురూజీ సైన్యంలోని సైనికుడే..  ఈ ఏనుగు మనుషుల్లాగే తెలివైనది. ఏ పని చేయమని అడిగినా వెంటనే చేస్తుంది. ఇంతకు ముందు కూడా చాలాసార్లు ఇరుక్కుపోయిన వాహనాల్లోకి బయటకు తీయడంలో సహాయం చేసిందని సిక్కు బృందం సభ్యులు చెప్పారు.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!
గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!
వరుసగా 9 సినిమాలు ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
వరుసగా 9 సినిమాలు ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
దువ్వెనతో దువ్వితే బంగారం..ఎక్కడో తెలుసా?
దువ్వెనతో దువ్వితే బంగారం..ఎక్కడో తెలుసా?
బ్లూటీతో బోలేడు బెనిఫిట్స్‌.. బరువు తగ్గేందుకు బెస్ట్‌ హోం రెమిడీ
బ్లూటీతో బోలేడు బెనిఫిట్స్‌.. బరువు తగ్గేందుకు బెస్ట్‌ హోం రెమిడీ
చౌటుప్పల్ బస్టాండ్‌లో ఓ లేడి.. ఇద్దరు వ్యక్తులు.. అనుమానం వచ్చి..
చౌటుప్పల్ బస్టాండ్‌లో ఓ లేడి.. ఇద్దరు వ్యక్తులు.. అనుమానం వచ్చి..
మందుకు బానిసైన స్టార్ హీరో.. రాత్రంతా తాగుతూనే.. ఎలా మానేశాడంటే?
మందుకు బానిసైన స్టార్ హీరో.. రాత్రంతా తాగుతూనే.. ఎలా మానేశాడంటే?
బాక్సింగ్ డే టెస్టు మ్యాచ్‌కు టీమిండియా జట్టు ఇదే
బాక్సింగ్ డే టెస్టు మ్యాచ్‌కు టీమిండియా జట్టు ఇదే
విజయ్ దళపతి చేతిలో ఉన్న ఈ అమ్మాయిని ఇప్పుడు చూస్తే..
విజయ్ దళపతి చేతిలో ఉన్న ఈ అమ్మాయిని ఇప్పుడు చూస్తే..
తెల్ల జుట్టు నల్లగా మారేందుకు అద్భుతమైన చిట్కా..10రోజుల్లోనే..
తెల్ల జుట్టు నల్లగా మారేందుకు అద్భుతమైన చిట్కా..10రోజుల్లోనే..
ఐసీసీ బౌలర్ల ర్యాంకింగ్స్‌ విడుదల.. బుమ్రా ప్లేస్ ఎక్కడో తెలుసా
ఐసీసీ బౌలర్ల ర్యాంకింగ్స్‌ విడుదల.. బుమ్రా ప్లేస్ ఎక్కడో తెలుసా