Optical Illusion:ఈ ఫొటోలో ఓ పిల్లి దాగుంది.. 10 సెకన్లలో కనిపెడితే తోపులే.. 99 శాతం ఫెయిల్.. మరి మీరు?
Viral Photo: ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆప్టికల్ ఇల్యూషన్ ఫొటోలు తెగ ట్రెండ్ అవుతున్నాయి. పని ఒత్తిడి, ఉద్యోగం అలాగే రొటీన్ లైఫ్ నుంచి కాస్త ఉపశమనం పొందేందుకు ఇవి బాగా ఉపయోగపడుతున్నాయి.
Viral Photo: ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆప్టికల్ ఇల్యూషన్ ఫొటోలు తెగ ట్రెండ్ అవుతున్నాయి. పని ఒత్తిడి, ఉద్యోగం అలాగే రొటీన్ లైఫ్ నుంచి కాస్త ఉపశమనం పొందేందుకు ఇవి బాగా ఉపయోగపడుతున్నాయి. మెదడుకు పదును పెట్టె ఫొటో పజిల్స్‌ను పరిష్కరించేందుకు చాలామంది ఆసక్తి చూపిస్తున్నారు. అందుకు తగ్గట్లే డిజైనర్లు కొత్త కొత్త ఫొటోలు, పజిల్స్‌ను నెట్టింట్లో ట్రెండ్ చేస్తున్నారు. అందులో దాగున్న మర్మాన్ని కనుక్కోమంటూ సవాళ్లు విసురుతున్నారు. అలా తాజాగా మరో ఫొటో సామాజిక మాధ్యమాల్లో వైరలవుతోంది. ఈ ఫొటోలో ఒక పిల్లి దాగి ఉంది. అది ఎక్కడ ఉందో 10 సెకన్లలో కనుక్కుంటే మీరే తుర్రం ఖాన్ అని అంటున్నాడు డిజైనర్. మరి మీరూ ఈ ఫొటో పజిల్‌ని సాల్వ్ చేయగలరేమో ట్రై చేయండి.
ఈ ఆప్టికల్ ఇల్యూషన్ ఒక పెయింటింగ్. అందులో ఓ మహిళ ఇంటిని శుభ్రం చేయడం మనం చూడవచ్చు. ఆ స్త్రీ చేతిలో చీపురు ఉండడం, పక్కనే బకెట్ ఉంటుంది. ఈ ఫొటోలోనే ఒక పిల్లి కూడా దాక్కొని ఉంది. అయితే ఇది అంత తేలికగా మాత్రం కనిపించదు. 99 శాతం మంది దానిని కనుక్కోవడంలో విఫలమవుతారు. అలాగనీ పిల్లిని కనుక్కోవడం మరీ కష్టమేమీ కాదు. కాస్త ఓపిక తెచ్చుకుని డేగకళ్లు ఉన్న వారు ఇట్టే ఆ పిల్లిని కనుగొనవచ్చు. మరి ఎంతో గందరగోళానికి గురిచేస్తోన్న ఈ ఫొటోలో పిల్లి ఇంకా కనిపించలేదా? అయితే సమాధానం కోసం కింద చూడండి.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..