AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Godfather: ఇండస్ట్రీలో నాకు గాడ్ ఫాదర్ లేరని అంటారు.. కానీ .. మెగాస్టార్ ఆసక్తికర వ్యాఖ్యలు

మోహన్ రాజా దర్శకత్వంలో చిరంజీవి నటిస్తున్న సినిమా ఇది. మలయాళంలో వచ్చిన లూసిఫర్ సినిమాకు రీమేక్ గా తెరకెక్కింది ఈ సినిమా.

Godfather: ఇండస్ట్రీలో నాకు గాడ్ ఫాదర్ లేరని అంటారు.. కానీ .. మెగాస్టార్ ఆసక్తికర వ్యాఖ్యలు
Megastar Chiranjeevi
Rajeev Rayala
|

Updated on: Sep 29, 2022 | 10:51 AM

Share

బాస్ సినిమా కోసం తెలుగు రాష్ట్రాల ప్రజలు వేయు కళ్లతో ఎదురుచూస్తున్నారు. త్వరలోనే గాడ్ ఫాదర్ గా గర్జించడానికి రెడీ అవుతున్నారు మెగాస్టార్. మోహన్ రాజా దర్శకత్వంలో చిరంజీవి నటిస్తున్న సినిమా ఇది. మలయాళంలో వచ్చిన లూసిఫర్ సినిమాకు రీమేక్ గా తెరకెక్కింది ఈ సినిమా. దసరా కానుకగా అక్టోబర్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ సినిమా. గాడ్ ఫాదర్ సినిమాలో బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. అలాగే లేడీ సూపర్ స్టార్ నయనతార మెగాస్టార్ సిస్టర్ పాత్రలో కనిపించనున్నారు. ఇక ఇంతకు ముందే ఓ డైలాగ్‌ ఆడియోను ట్వీట్ చేసి.. తెలుగు టూ స్టేట్స్ లో పొలిటికల్ రచ్చ లేపిన మెగాస్టార్ చిరు.. ఇప్పుడా రచ్చ రేంజ్‌నే మార్చేశారు. అనంతపూర్‌లో జరిగిన గాడ్‌ ఫాదర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదికగా… మరో పవర్‌ ఫుల్ డైలాగ్ చెప్పి… అందర్నీ ఆకట్టుకున్నారు.

ఇక అంత వర్షంలోనూ.. కదలని అభిమాలను ఉద్దేశ్యించి మెగా స్టార్ ఉద్వేగంగా మాట్లాడారు. తాను ఎప్పుడు వచ్చినా.. రాయసీమలో వర్షం పడుతుందని… ఇదో సెంటిమెంట్‌ అని చెబుతూనే.. ఓ పవర్‌ ఫుల్ డైలాగ్ ను జనాలపైకి సంధించారు. మీ అందరి ఊపిరిని కాంట్రాక్ట్ తీసుకున్నా అంటూ.. ఒక్కాసారిగా తన హార్డ్ కోర్ ఫ్యాన్స్ న అరిపించారు. మెగాస్టార్ మాట్లాడుతూ.. చాలా తృప్తిగా ఉంది. ఈ మధ్య కాలంలో కొంచెం స్తబ్దత ఏర్పడింది. విజయాలు, అపజయాలు మన చేతుల్లో ఉండవని మనకు తెలుసు. కానీ ప్రేక్షకులను అలరించలేకపోయానే చిన్న బాధ ఉంది. దానికి సమాధానం.. నాకు ఊరట.. ఈ గాడ్ ఫాదర్. ఈ సినిమా ఓ నిశ్శబ్ద విస్పోటనం. ప్లీజ్ మీ అందరి ఆశీస్సులు కావాలి. వర్షం పడుతున్నా.. మీరందరూ కదట్లేదు. ఇలాంటి ప్రేమను నేను కోరుకుంటున్నా అన్నారు.

అలాగే ఒక్క విషయం నేను చాలా సీన్సియర్‌గా చెబుతున్నా. గాడ్ ఫాదర్ అని మీరు నన్ను అంటున్నారు. కానీ ఏ గాడ్ ఫాదర్స్ లేకుండా వచ్చినా నాకు.. ఈ సినిమా ఇండస్ట్రీలో నిలదొక్కుకునే పరిస్థితి .. స్థితి ఇచ్చిన ప్రతి ఒక్క అభిమాని కూడా నాకు గాడ్ ఫాదర్. నా అభిమానులే నాకు గాడ్ ఫాదర్స్. నాకు గాడ్ ఫాదర్స్ ఎవరు లేరని అంటారు. కానీ.. ఇప్పుడంటున్నాను.. నా వెనుకలా ఇన్ని లక్షలమంది గాడ్ ఫాదర్స్ ఉన్నారు. చాలా సంతోషంగా ఉంది. నా మనసు అంతరాంతరాల్లో నుంచి వచ్చి వస్తున్న మాట అంటూ తన స్పీచ్ తో ఆకట్టుకున్నారు మెగాస్టార్.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..