Prabhas: ప్రభాస్‏ను ఢీకొట్టనున్న బాలీవుడ్ స్టార్.. ఆ సినిమాలో విలన్ ఎవరంటే..

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో స్పిరిట్ చేయాల్సి ఉంది. అలాగే మారుతీ డైరెక్షన్లో ఓ మూవీ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇటీవలే ఈ సినిమా పూజా కార్యక్రమాలు నిర్వహించారు.

Prabhas: ప్రభాస్‏ను ఢీకొట్టనున్న బాలీవుడ్ స్టార్.. ఆ సినిమాలో విలన్ ఎవరంటే..
Prabhas
Follow us
Rajitha Chanti

|

Updated on: Sep 28, 2022 | 8:48 PM

ప్రస్తుతం ప్రభాస్ నటిస్తోన్న సినిమాలపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. అన్ని భారీ బడ్జెట్ పాన్ ఇండియా చిత్రాలు కావడం విశేషం. ఇప్పటికే బాలీవుడ్ డైరెక్టర్ ఓంరౌత్ తెరకెక్కిస్తున్న ఆదిపురుష్ సినిమా చిత్రీకరణ పూర్తైంది. వచ్చే ఏడాదిలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే.. ప్రాజెక్ట్ కె, సలార్ సినిమాలు షూటింగ్ జరుపుకుంటున్నాయి. అలాగే డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో స్పిరిట్ చేయాల్సి ఉంది. అలాగే మారుతీ డైరెక్షన్లో ఓ మూవీ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇటీవలే ఈ సినిమా పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ మూవీ గురించి ఓ క్రేజీ న్యూస్ నెట్టింట వైరవలవుతుంది.

లేటేస్ట్ అప్టేట్ ప్రకారం మారుతీ, ప్రభాస్ కాంబోలో రాబోతున్న ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ ను తీసుకోవాలనుకుంటున్నారట. ఇప్పటికే అతడితో చర్చలు షురు చేసినట్లుగా తెలుస్తోంది. గతంలో కేజీఎఫ్, షంషేరా వంటి సినిమాల్లో ప్రతినాయకుడిగా అదరగొట్టారు సంజయ్ దత్. ఇక ఇప్పుడు ప్రభాస్ సినిమాలో నటించనుండడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. ఇటీవలే రెబల్ స్టార్ కృష్ణంరాజు అకాలమరణంతో ప్రభాస్ చిత్రాలు వాయిదా పడ్డాయి. కానీ భారీ బడ్జెట్ మూవీస్ కావడంతో ప్రభాస్ తిరిగి చిత్రీకరణలలో పాల్గోన్నట్లు తెలుస్తోంది.

ఇక ప్రభాస్.. ఓంరౌత్ కాంబోలో రాబోతున్న ఆదిపురుష్ చిత్రం టీజర్ అయోద్యలో అక్టోబర్ 2న విడుదల కానుంది. ఇందులో కృతి సనన్ సీతగా.. సైఫ్ అలీ ఖాన్ రావణుడిగా కనిపించనుండగా.. ప్రభాస్ రాముడి పాత్రలో నటిస్తున్నారు. అలాగే డైరెక్టర్ నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న ప్రాజెక్ట్ కె చిత్రంలో దీపికా పదుకొణె, అమితాబ్ నటిస్తున్న సంగతి తెలిసిందే.