Raviteja: మాస్ మహారాజా మరో ఛాలెంజింగ్.. ఈసారి సరికొత్తగా రాబోతున్న రవితేజ..

ఈ సినిమాలే కాకుండా మెగాస్టార్ చిరంజీవి, డైరెక్టర్ బాబీ కాంబోలో రాబోతున్న వాల్తేరు వీరయ్య చిత్రంలో కీలకపాత్రలో నటిస్తున్నారు రవితేజ. ఓవైపు వరుస సినిమాలతో బిజీగా ఉన్న రవితేజ.. మరో కొత్త ప్రాజెక్ట్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా టాక్ వినిపిస్తోంది.

Raviteja: మాస్ మహారాజా మరో ఛాలెంజింగ్.. ఈసారి సరికొత్తగా రాబోతున్న రవితేజ..
Raviteja
Follow us
Rajitha Chanti

|

Updated on: Sep 28, 2022 | 9:38 PM

మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ధమాకా.. టైగర్ నాగేశ్వరరావు సెట్స్ పై ఉన్నాయి. ధమకా సినిమాలో యంగ్ హీరోయిన్ శ్రీలీల కథానాయికగా నటిస్తోంది. ఇటీవలే రామరావు ఆన్ డ్యూటీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన రవితేజ.. ఇప్పుడు ధమాకా మూవీతో అలరించేందుకు సిద్ధమయ్యాడు. ఈ సినిమాకు త్రినాథ రావు దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్, సాంగ్స్ ఆకట్టుకుంటున్నాయి. ఇక రవితేజ నటిస్తున్న చిత్రాల్లో రావణాసుర కూడా ఉంది. త్వరలోనే ఈ మూవీ పట్టాలెక్కనున్నట్లు తెలుస్తోంది.

ఈ సినిమాలే కాకుండా మెగాస్టార్ చిరంజీవి, డైరెక్టర్ బాబీ కాంబోలో రాబోతున్న వాల్తేరు వీరయ్య చిత్రంలో కీలకపాత్రలో నటిస్తున్నారు రవితేజ. ఓవైపు వరుస సినిమాలతో బిజీగా ఉన్న రవితేజ.. మరో కొత్త ప్రాజెక్ట్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా టాక్ వినిపిస్తోంది. డైరెక్టర్ కార్తిక్ ఘట్టమనేని దర్శకత్వంలో ఓ మూవీ చేయనున్నాడట. అయితే ఈ సినిమాలో రవితేజ సరికొత్త పాత్రలో కనిపించనున్నాట. ఇప్పటివరకు మాస్ మహారాజా చేయని పాత్రలో కనిపించనున్నారట. ఈ మూవీలో డ్యూయల్ రోల్ ఉండనుందని.. అందులో ఒకటి వృద్ధుడి పాత్ర అని తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

ఇప్పటివరకు అన్ని వైవిధ్యమైన పాత్రలతో మెప్పించిన రవితేజ.. ఇప్పుడు ఏకంగా వృద్ధుడి పాత్ర చేయడం షాకింగ్ అనే చెప్పుకోవాలి. ఆ పాత్రలో ఎంతవరుక ప్రేక్షకులను ఆకట్టుకుంటాడో చూడాలి. ఈ సినిమాను పీపూల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై నిర్మించనున్నారు. ఇందులో అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా నకిపించనుంది. త్వరలోనే ఈ మూవీ పట్టాలెక్కనుందని.. అన్ని విషయాలను అనౌన్స్ చేయనున్నట్లు తెలుస్తోంది.

ఉద్యోగం కోసం వెతుకుతున్నారా..? మేనేజర్‌ పోస్ట్‌ ఖాళీ.. దరఖాస్తులు
ఉద్యోగం కోసం వెతుకుతున్నారా..? మేనేజర్‌ పోస్ట్‌ ఖాళీ.. దరఖాస్తులు
మీ కారు టైర్లు త్వరగా అగిరిపోతున్నాయా? అసలు కారణాలు ఇవే..!
మీ కారు టైర్లు త్వరగా అగిరిపోతున్నాయా? అసలు కారణాలు ఇవే..!
హలో దీదీ..మీరు సూపరహే..!ఇల్లూడ్చే చీపురుతో ఇలాంటి స్టంట్ చెయొచ్చా
హలో దీదీ..మీరు సూపరహే..!ఇల్లూడ్చే చీపురుతో ఇలాంటి స్టంట్ చెయొచ్చా
ఇది పండు కాదు.. అమృతఫలం.. రోజుకొకటి తింటే.. మీరు సేఫ్ అంతే.!
ఇది పండు కాదు.. అమృతఫలం.. రోజుకొకటి తింటే.. మీరు సేఫ్ అంతే.!
మీ వాహనంపై చలాన్‌ విధించారో.. లేదో తెలుసుకోవడం ఎలా?
మీ వాహనంపై చలాన్‌ విధించారో.. లేదో తెలుసుకోవడం ఎలా?
అరెరే ఎంతపనైపాయే.. గూగుల్ తల్లి కొంప కొల్లేరు చేసిందిగా.. పాపం.!
అరెరే ఎంతపనైపాయే.. గూగుల్ తల్లి కొంప కొల్లేరు చేసిందిగా.. పాపం.!
ఒకే ఓవర్‌లో 4,4,4,4,4,4.. వామ్మో ఇలా ఉన్నావ్ ఏంది సామీ..!
ఒకే ఓవర్‌లో 4,4,4,4,4,4.. వామ్మో ఇలా ఉన్నావ్ ఏంది సామీ..!
రూ.2 కోట్ల యాడ్ రిజెక్ట్ చేసింది.. ఆమె పేరు చెబితే పూనకాలే..
రూ.2 కోట్ల యాడ్ రిజెక్ట్ చేసింది.. ఆమె పేరు చెబితే పూనకాలే..
హిట్‌మ్యాన్, ట్రావిస్ హెడ్ కాదు.. 23 సిక్సర్లతో ఆ క్రికెటర్ తోపు
హిట్‌మ్యాన్, ట్రావిస్ హెడ్ కాదు.. 23 సిక్సర్లతో ఆ క్రికెటర్ తోపు
ఫాదర్ అఫ్ ట్రావిస్ హెడ్ అంటూ ఫుల్లు ట్రోలింగ్..
ఫాదర్ అఫ్ ట్రావిస్ హెడ్ అంటూ ఫుల్లు ట్రోలింగ్..