Prabhas: బాలీవుడ్ అగ్రహీరోలను కాదని.. ప్రభాస్‏ను తీసుకుంది అందుకేనా ?.. ఆదిపురుష్ వెనకాల అంత కథ ఉందా ?..

ఆదిపురుష్ సినిమా కోసం ప్రభాస్‏ను ఎంపిక చేసుకోవడానికి కొన్ని ప్రత్యేక కారణాలు ఉన్నాయట. ప్రస్తుతం ఇదే న్యూస్ ఫిల్మ్ సర్కిల్లో చర్చనీయాంశంగా మారింది.

Prabhas: బాలీవుడ్ అగ్రహీరోలను కాదని.. ప్రభాస్‏ను తీసుకుంది అందుకేనా ?.. ఆదిపురుష్ వెనకాల అంత కథ ఉందా ?..
Adipurush, prabhas
Follow us
Rajitha Chanti

|

Updated on: Sep 28, 2022 | 5:07 PM

ప్రభాస్.. ఇప్పుడు పాన్ ఇండియా లెవల్లో భారీగా ఫాలోయింగ్ ఉన్న హీరో. జక్కన్న తెరకెక్కించిన బాహుబలి సినిమాతో డార్లింగ్ క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది. ప్రపంచవ్యాప్తంగా బాహుబలి సినిమా రికార్డ్ క్రియేట్ చేసింది. ప్రభాస్ స్టైల్, నటనకు ప్రపంచవ్యాప్తంగా అభిమానులున్నారు. ఈ సినిమా తర్వాత డార్లింగ్ చేసిన సాహో, రాధేశ్యామ్ సినిమాలు డిజాస్టర్స్‏గా మిగిలినప్పటికీ.. ప్రభాస్ క్రేజ్ మాత్రం తగ్గలేదు. ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్నారు డార్లింగ్. సలార్, ప్రాజెక్ట్ కె చిత్రాలు ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుండగా.. స్పిరిట్ చిత్రం త్వరంలోనే పట్టాలెక్కనున్నాయి. ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకున్న ఆదిపురుష్ సినిమా అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్, టీజర్ గురించి ఎప్పటికప్పుడు నెట్టింట వార్తలు హల్చల్ చేస్తున్న సంగతి తెలిసిందే.

ఈ క్రమంలోనే అక్టోబర్ 2 అయోద్యలో ఆదిపురుష్ ఫస్ట్ లుక్, టీజర్ లాంచ్ చేయనున్నారు. దీంతో డార్లింగ్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. ఇందులో ప్రభాస్ రాముడి పాత్రలో కనిపించనుండగా.. బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ రావణుడిగా.. కృతి సనన్ సీత పాత్రలో కనిపించనుంది. తాజాగా ఈ సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలు ఫిల్మ్ సర్కిల్లో వినిపిస్తున్నాయి. బాలీవుడ్ అగ్ర హీరోలను కాదని.. డైరెక్టర్ ఓంరౌత్ రాముడి పాత్ర కోసం ప్రభాస్‏ను ఎంచుకోవడానికి పలు కారణాలున్నట్లుగా తెలుస్తోంది. అవెంటో తెలుసుకుందామా.

సినిమా అంటే ప్రాణం..

సినీ బ్యాగ్రౌండ్ ఫ్యామిలీ నుంచి వచ్చిన ప్రభాస్‏కు సినిమాలంటే పిచ్చి. నటనపై ఆసక్తితో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన డార్లింగ్.. అతి తక్కువ సమయంలోనే యంగ్ రెబల్ స్టార్‏గా భారీగా అభిమానులను సంపాదించుకున్నారు. అంతేకాకుండా.. ఎప్పటికప్పుడు విభిన్నమైన పాత్రలలో కనిపించేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తారు.

పని పట్ల అంకితభావం..

బాహుబలి సినిమా చేస్తున్న సమయంలో మరే ఇతర ప్రాజెక్ట్స్ ఒప్పుకోలేదు. కేవలం బాహుబలి సినిమాలో నటించాడు. తనవరకు వచ్చిన ఆఫర్స్ అన్నింటిని సున్నితంగా రిజెక్ట్స్ చేశాడు ప్రభాస్.

ప్రవర్తన..

పాన్ ఇండియా స్టార్ అయిన.. ఒదిగి ఉంటాడు ప్రభాస్. ముఖ్యంగా అభిమానుల పట్ల అతడు చూపించే ప్రేమ వెలకట్టలేనిది. తన కోసం వచ్చే ఫ్యాన్స్‏తో ఓపిగ్గా మాట్లాడే తీరు ఆకట్టుకుంటుంది. అంతేకాకుండా తన అభిమానుల కోసం జాగ్రత్తలు కూడా తీసుకుంటాడు.

సహనం..

ఒక ప్రాజెక్ట్‏ ఒప్పుకున్నాక.. ఆ సినిమా రిలీజ్ అయ్యేవరకు ఓపిగ్గా ఎదురుచూస్తుంటాడు. ఆలస్యం అయినా నిర్మాతలు.. డైరెక్టర్లను ఏమాత్రం ఇబ్బందిపెట్టడు. బాహుబలి సినిమాలు తీయడానికి అనేక సంవత్సరాల సమయం పట్టినా..ఓపిగ్గా ఎదురుచూశాడు. ఈ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ సంపాదించుకున్నాడు.