Megastar chiranjeevi: ఆ విషయంలో తనయుడిని చూసిన గర్వపడుతున్న మెగాస్టార్.. చరణ్‏‏తో మధురమైన జ్ఞాపకాన్ని పంచుకున్న చిరంజీవి..

మెగాస్టార్ చిరంజీవి తన తనయుడిని చూసి గర్వపడుతున్నారు. నువ్వు మరిన్ని విజయాలు అందుకోవాలని కోరుకుంటున్నాను అంటూ ట్వీట్ చేశారు. ఇంతకీ ప్రత్యేకత ఏంటో తెలుసుకుందామా.

Megastar chiranjeevi: ఆ విషయంలో తనయుడిని చూసిన గర్వపడుతున్న మెగాస్టార్.. చరణ్‏‏తో మధురమైన జ్ఞాపకాన్ని పంచుకున్న చిరంజీవి..
Megastar Chiranjeevi, Ram C
Follow us
Rajitha Chanti

|

Updated on: Sep 28, 2022 | 5:36 PM

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్..ఆర్ఆర్ఆర్ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా భారీగా అభిమానులను సంపాదించుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి (Megastar chiranjeevi) వారసుడిగా‏ ఎన్నో అంచనాలతో సినీరంగ ప్రవేశం చేసిన చెర్రీ.. మొదటి సినిమానే డిజాస్టర్‏గా నిలిచింది. దీంతో చెర్రీ నటనపై.. లుక్స్ పై విపరీతంగా నెగిటివిటి వచ్చేసింది. చిరంజీవి తనయుడు మాత్రమే కాదు.. పరిశ్రమలో నిలదొక్కుకోవాలంటే నటన కూడా ముఖ్యమంటూ పలువురు కామెంట్స్ చేశారు. తనపై వస్తున్న నెగిటివిటికి ఏమాత్రం వెనకడుగు వేయకుండా తన రెండవ సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. రాజమౌళి దర్శకత్వంలో మగధీర సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చరణ్.. నటనతో మెప్పించాడు. ఈ మూవీలో చరణ్ ఆహార్యం, నటనపై విమర్శకులు సైతం ప్రశంసలు కురిపించారు. ఇక ఇప్పుడు పాన్ ఇండియా స్టార్‏గా దేశవ్యాప్తంగానే కాకుండా విదేశాల్లోనూ భారీగా అభిమానులను సంపాదించుకున్నారు చెర్రీ. ఆర్ఆర్ఆర్ సినిమాలో అల్లూరి సీతారామరాజు పాత్రలో చరణ్ నటనకు ప్రపంచమే ఫిదా అయ్యింది. ప్రస్తుతం సక్సెస్ ఫుల్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.

మెగాస్టార్ చిరంజీవి వారసుడిగా ఇండస్ట్రీలోకి చరణ్ హీరోగా అరంగేట్రం చేసి నేటికి (28 సెప్టెంబర్) 15 ఏళ్లు పూర్తి అవుతుంది. చరణ్ హీరోగా నటించిన మొదటి చిత్రం చిరుత 2007 సెప్టెంబర్ 28న విడుదలైంది. చరణ్ నటుడిగా 15 ఏళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా అభిమానులు సెలబ్రెషన్స్ చేసుకుంటున్నారు. ఇక ఇదే విషయంపై చిరంజీవి స్పందిస్తూ.. చెర్రీతో కలిసి ఉన్న మధురమైన క్షణాలను షేర్ చేసుకున్నారు.

” సినీ ప్రయాణంలో 15 సంవత్సరాల మైలురాయిని చేరుకోవడంపై సంతోషంగా ఉంది. తను నటుడిగా చిరుత నుంచి మగధీర, రంగస్థలం, ఆర్ఆర్ఆర్ వరకు ..ఇప్పుడు దర్శకుడు శంకర్‌తో #RC15కి ఎలా ఎదిగాడనేది మనసును కదిలించింది. అతని అభిరుచి, పనితీరు, అంకితభావం, అతను చేసే పనిలో రాణించాలనే కోరిక పట్ల చాలా సంతోషంగా ఉంది. నిన్ను చూసి గర్వపడుతున్నాను. నువ్వు ఇంక మరింత ఎత్తుకు ఎదగాలని.. మరిన్ని విజయాలు అందుకోవాలని కోరుకుంటున్నాను.” అంటూ ట్వీట్ చేశారు చిరు. ప్రస్తుతం మెగాస్టార్ గాడ్ ఫాదర్ ప్రమోషన్లలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.