AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mahesh Babu: తల్లి మరణం తర్వాత సోషల్ మీడియాలో మహేష్ పోస్ట్.. చెదిరిన మనసుతో సూపర్ స్టార్ ఎమోషనల్..

సూపర్ స్టార్ కృష్ణకు ఇందిరా దేవి మామ కూతురు. కుటుంబసభ్యుల నిర్ణయంతో మరదలు అయిన ఇందిరా దేవిని వివాహం చేసుకున్నారు. వీరికి ఐదుగురు సంతానం. పద్మ, మంజుల, ఇందిరా ప్రియదర్శిని, రమేష్ బాబు, మహేష్ బాబు.

Mahesh Babu: తల్లి మరణం తర్వాత సోషల్ మీడియాలో మహేష్ పోస్ట్.. చెదిరిన మనసుతో సూపర్ స్టార్ ఎమోషనల్..
Mahesh Babu
Rajitha Chanti
|

Updated on: Sep 28, 2022 | 6:47 PM

Share

తల్లి ఇందిరా దేవి మృతితో సూపర్ స్టార్ మహేష్ బాబు తీవ్ర దుఃఖంలో మునిగిపోయారు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఇందిరా దేవి బుధవారంఉదయం తన నివాసంలోనే కన్నుమూశారు. ఇందిరా దేవి పార్థివదేహాన్ని చూసి చలించిపోయారు మహేష్. ఒకే ఏడాదిలో అటు అన్నయ్య.. ఇటు తల్లి మరణంతో ఆయన కుటుంబంలో శోకసంద్రంలో మునిగిపోయింది. జూబ్లీహిల్స్ లోని మహా ప్రస్థానంలో ఇందిరా దేవి పూర్తిచేశారు కుటుంబసభ్యులు. తల్లి అంత్యక్రియలు పూర్తైన తర్వాత సోషల్ మీడియాలో ఇందిరా దేవి ఫోటోను షేర్ చేస్తూ నలుపు రంగు హార్ట్ ఎమోజీలు పోస్ట్ చేశారు మహేష్. ఈ పోస్ట్ పై అభిమానులు స్పందిస్తూ.. స్టే స్ట్రాంగ్ అన్నా.. మీతో మేము ఉన్నాం… బాధపడకండి అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

మహేష్ బాబుకు తల్లి ఇందిరా దేవి అంటే అమితమైన ప్రేమ. సినీ ప్రమోషన్లలో తన తల్లి గురించి గొప్పగా చెబుతూ ఎమోషనల్ అయ్యేవారు. అంతేకాకుండా.. తన ప్రతి సినిమా విడుదలకు ముందుకు అమ్మ ఇంటికి వెళ్లి కాఫీ తాగడం అలవాటు అంటూ పలు సందర్బాల్లో చెప్పుకొచ్చారు మహేష్. సూపర్ స్టార్ కృష్ణ సతీమణి అయినా.. సినీ పరిశ్రమకు దూరంగా ఉండేవారు. భర్త, కొడుకులిద్దరు స్టార్ హీరోస్ అయిన.. వారి సినిమా ప్రమోషనల్లో పాల్గోనేందుకు ఆసక్తి చూపించేవారు కాదు. కేవలం కుటుంబసభ్యుల ఫంక్షన్లలో మాత్రమే ఇందిరా దేవి కనిపించేవారు. పెళ్లి వరకు మహేష్ ఎక్కువగా తన తల్లితోనే గడిపారు. ఆమెతో మహేష్‏కు అనుబంధం ఎక్కువగానే ఉంది.

సూపర్ స్టార్ కృష్ణకు ఇందిరా దేవి మామ కూతురు. కుటుంబసభ్యుల నిర్ణయంతో మరదలు అయిన ఇందిరా దేవిని వివాహం చేసుకున్నారు. వీరికి ఐదుగురు సంతానం. పద్మ, మంజుల, ఇందిరా ప్రియదర్శిని, రమేష్ బాబు, మహేష్ బాబు. ఇందిరా దేవితో వివాహం జరిగిన నాలుగు సంవత్సరాల తర్వాత కృష్మ దివంగత నటి విజయ్ నిర్మలతో ప్రేమలో పడ్డారు. ఇదే విషయాన్ని ఇందిరా దేవితో చెప్పగా.. రెండవ వివాహనికి అంగీకరించింది. కృష్ణ రెండవ వివాహం తర్వాత ఇందిరా దేవి ఎక్కువగా బయట కనిపించలేదు.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

టాలీవుడ్‌తో పోటీగా సినిమాలు తీస్తున్న మరో ఇండస్ట్రీ? సక్సెస్ రేట్
టాలీవుడ్‌తో పోటీగా సినిమాలు తీస్తున్న మరో ఇండస్ట్రీ? సక్సెస్ రేట్
ప్రభుదేవా సినిమాలో నటిస్తున్న టాప్ మ్యూజిక్ డైరెక్టర్
ప్రభుదేవా సినిమాలో నటిస్తున్న టాప్ మ్యూజిక్ డైరెక్టర్
గత ఏడాది బిలియనీర్ల సంపద పెరుగుదల..చరిత్ర సృష్టించిందెవరో తెలుసా?
గత ఏడాది బిలియనీర్ల సంపద పెరుగుదల..చరిత్ర సృష్టించిందెవరో తెలుసా?
కాల్వలోకి పల్టీ కొట్టిన స్కూల్‌ బస్సు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
కాల్వలోకి పల్టీ కొట్టిన స్కూల్‌ బస్సు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
ప్రాణాలు తీసుకోవాలనే ఆలోచన వెనుక జెనెటిక్ మిస్టరీ దాగి ఉందా!
ప్రాణాలు తీసుకోవాలనే ఆలోచన వెనుక జెనెటిక్ మిస్టరీ దాగి ఉందా!
ఇంటర్ సిలబస్‌ మారుతుందోచ్‌.. ఇక మ్యాథ్స్‌ పరీక్ష 60 మార్కులకే!
ఇంటర్ సిలబస్‌ మారుతుందోచ్‌.. ఇక మ్యాథ్స్‌ పరీక్ష 60 మార్కులకే!
వింటర్ స్కిన్ కేర్ టిప్స్: ఈ 10 లాభాలు తెలిస్తే ఆ నూనె వదలరు!
వింటర్ స్కిన్ కేర్ టిప్స్: ఈ 10 లాభాలు తెలిస్తే ఆ నూనె వదలరు!
భర్తతో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్.. సామ్ ఏం చేసిందో చూశారా? వీడియో
భర్తతో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్.. సామ్ ఏం చేసిందో చూశారా? వీడియో
అన్నీ స్టేటస్‌లో పెట్టేస్తున్నారా! ఈ విషయం గురించి తెలుసా?
అన్నీ స్టేటస్‌లో పెట్టేస్తున్నారా! ఈ విషయం గురించి తెలుసా?
బెల్లం తింటున్నారా? అయితే ఈ షాకింగ్ విషయాలు తెలుసుకోవాల్సిందే!
బెల్లం తింటున్నారా? అయితే ఈ షాకింగ్ విషయాలు తెలుసుకోవాల్సిందే!