Salman Khan: బిగ్‌బాస్ షో హోస్ట్‌గా సల్మాన్ ఖాన్ రూ.1000 కోట్ల పారితోషికం తీసుకుంటున్నాడా ?.. హీరో రియాక్షన్ ఏంటంటే..
బిగ్ బాస్ హోస్ట్ చేసేందుకు సల్మన్ ఏకంగా రూ. 1000 కోట్ల పారితోషికం తీసుకుంటున్నారంటూ గత కొద్దిరోజులుగా వార్తలు చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. తాజాగా మీడియా ముందుకు వచ్చిన సల్మాన్ ఈ రెమ్యునరేషన్ పై స్పందించారు.
బుల్లితెరపై అతిపెద్ద రియాల్టీ షో బిగ్ బాస్. భాషతో సంబంధం లేకుండా ఈ షోకు ప్రేక్షకాదరణ ఎక్కువే. హిందీతోపాటు తెలుగు, కన్నడ, తమిళ్ భాషలలో విజయవంమయ్యింది బిగ్ బాస్. తెలుగులో ఐదు సీజన్స్ పూర్తిచేసుకుని ప్రస్తుతం ఆరవ సీజన్ నడుస్తోంద. ఇక హిందీలో పదిహేను సీజన్స్ కంప్లీట్ చేసుకున్న బిగ్ బాస్.. ఇప్పుడు 16 సీజన్ కోసం సిద్ధమైంది. మరికొన్ని రోజుల్లోనే బిగ్ బాస్ సీజన్ 16 ప్రారంభంకానుంది. ఇక ఎప్పటిలాగే ఈ షోకు హోస్ట్ గా సల్మాన్ ఖాన్ వ్యవహరించనున్నారు. అయితే ఈ బిగ్ బాస్ హోస్ట్ చేసేందుకు సల్మన్ ఏకంగా రూ. 1000 కోట్ల పారితోషికం తీసుకుంటున్నారంటూ గత కొద్దిరోజులుగా వార్తలు చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. తాజాగా మీడియా ముందుకు వచ్చిన సల్మాన్ ఈ రెమ్యునరేషన్ పై స్పందించారు. తన పారితోషికం గురించి వస్తున్న వార్తలలో ఎలాంటి నిజం లేదని. అంత మొత్తంలో రెమ్యునరేషన్ తీసుకుంటే ఇక తాను జీవితంలో పనిచేయాల్సిన అవసరం ఉండదన్నారు.
సల్మాన్ మాట్లాడుతూ.. నేను బిగ్ బాస్ షో చేస్తున్నానా ? లేదా ? అని ప్రతిసారి అడగడం విసుగు వస్తోంది. దీంతో నేను హోస్ట్ గా ఉండను అని చెప్పేశాను. ఇక వాళ్లకు మరో చాయిస్ లేక నన్ను అడిగారు. ఇక ఇప్పుడు నేను తీసుకుంటున్న రెమ్యునరేషన్ గురించి వస్తున్న వార్తలలో ఎలాంటి నిజం లేదు. వాస్తవానికి రూ. 1000 కోట్ల పారితోషికం తీసుకుంటే నేను జీవితంలో పనిచేయాల్సిన అవసరం లేదు. అప్పుడు నాకు చాలా ఖర్చులు ఉండేవి. అలాగే ఇన్ కమ్ టాక్స్ వాళ్లు నన్ను ఎప్పటికీ గమనిస్తూనే ఉండేవారు అంటూ చెప్పుకొచ్చారు.
అలాగే తాను ఈ షో ద్వారా చాలా నేర్చుకున్నానని.. ఎంతో మంది వ్యక్తులను కలుసుకున్నానని.. చాలామందిని సరైన దిశలోకి తీసుకురావడం జరిగింది అని తెలిపారు.
View this post on Instagram
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.