Madhuri Dixit: ‘సెలబ్రిటీ లైఫ్ అంత ఈజీ కాదు’.. ఆసక్తికర కామెంట్స్ చేసిన సీనియర్ హీరోయిన్..
డైరెక్టర్ ఆనంద్ తివారీ తెరెక్కించిన ఈ మూవీలో గజరాజ్ రావ్, రిత్విక్ భౌమిక్, బర్ఖా సింగ్, సృష్టి శ్రీవాస్తవ, రజిత్ కపూర్, షీబా చద్దా, సిమోన్ సింగ్, మల్హర్ థాకర్, నినాద్ కామత్ నటించారు.
బాలీవుడ్ బ్యూటీ మాధురీ దీక్షిత్ ఇప్పుడు మరోసారి డిజిటల్ వేదికపై సినీ ప్రియులను అలరించేందుకు సిద్ధమయ్యారు. ఆమె ప్రధాన పాత్రలోన నటిస్తున్న డిజిటల్ ప్రాజెక్ట్ ‘మజా మా’. డైరెక్టర్ ఆనంద్ తివారీ తెరెక్కించిన ఈ మూవీలో గజరాజ్ రావ్, రిత్విక్ భౌమిక్, బర్ఖా సింగ్, సృష్టి శ్రీవాస్తవ, రజిత్ కపూర్, షీబా చద్దా, సిమోన్ సింగ్, మల్హర్ థాకర్, నినాద్ కామత్ నటించారు. ఈ మూవీలో మిడిల్ క్లాస్ మదర్‌గా.. ఇద్దరు టీనేజ్ పిల్లలకు తల్లిగా నటించారు మాధురి. అయితే మూవీ ప్రమోషన్‌లో భాగంగా మీడియాతో మాట్లాడిన ఈ సీనియర్ నటి, ఇండస్ట్రీ గురంచి… ప్రజెంట్ స్టార్స్ లైఫ్ గురించి ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశారు.
80స్, 90స్‌లో సిల్వర్ స్క్రీన్‌ను రూల్ చేసిన స్టార్స్‌లో హీరోయిన్లకే ఇప్పుడు మంచి అవకాశాలు వస్తున్నాయన్నారు మాధురి. గతంలో గ్లామర్ రోల్స్‌లో మాత్రమే కనిపించిన తారలు… ఇప్పుడు డిఫరెంట్ రోల్స్‌లో ప్రూవ్ చేసుకునే ఛాన్స్ ఉందన్నారు. అవకాశాలు బాగానే ఉన్నా… ఈ జనరేషన్‌లో స్టార్‌గా లైఫ్ కంటిన్యూ చేయటం కాస్త టఫ్ టాస్కే అంటున్నారు మాధురి. ముఖ్యంగా సెలబ్రిటీల విషయంలో మీడియా అటెన్షన్‌గా బాగా పెరిగిందని… అందుకే ప్రతీ విషయంలో ఎక్స్‌ట్రా కేర్ తీసుకోవాల్సి వస్తుందంటున్నారు.
ఆన్ స్క్రీన్ అందంగా కనిపించటమే కాదు… రెడ్ కార్పెట్స్ నుంచి ఎయిర్ పోర్ట్ లుక్స్ వరకు ప్రతీ విషయంలోనూ జాగ్రత్త పడాల్సి వస్తుందన్నారు. అయినా లైఫ్‌లో ఈ కొత్త ఫేజ్ తనకు హ్యాపీగానే ఉందంటున్నారు మాధురీ దీక్షిత్