Aha Dance Ikon: గుండెను బరువెక్కించిన తండ్రి ఎమోషన్.. డాన్స్ ఐకాన్ వేదికపై భావోద్వేగాలు..

స్టేజ్ పై ఓంకార్‏తో అందరూ భావోద్వేగానికి గురయ్యారు. తన తండ్రిని హగ్ చేసుకునే అదృష్టం లేదంటూ ఎమోషనల్ అయ్యారు శేఖర్ మాస్టర్.

Aha Dance Ikon: గుండెను బరువెక్కించిన తండ్రి ఎమోషన్.. డాన్స్ ఐకాన్ వేదికపై భావోద్వేగాలు..
Dance Ikon
Follow us
Rajitha Chanti

|

Updated on: Sep 29, 2022 | 8:48 PM

డిజిటల్ ప్లాట్ ఫాంలో ప్రేక్షకాదరణంతో దూసుకుపోతుంది తెలుగు ఓటీటీ మాధ్యమం ఆహా. బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాలు మాత్రమే కాకుండా.. వెబ్ సిరీస్, టాక్ షోస్, గేమ్ షోలతో ఎప్పటికప్పుడు సినీ ప్రియులను అలరిస్తుంది. ఇక ఇటీవల ఓంకార్ వ్యాఖ్యతగా డాన్స్ ఐకాన్ షో ప్రారంభమైన సంగతి తెలిసిందే. సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ, మోనాల్ గజ్జర్, కొరియాగ్రఫర్ శేఖర్ మాస్టర్ జడ్జిగా వ్యవహరిస్తున్నారు. టాలీవుడ్ టాప్ 6 నిర్మాతలు పన్నెండు గ్రూపులను కొనుగోలు చేసి ఈ షో నిర్వహిస్తున్నారు. విజయవంతంగా దూసుకుపోతున్న తాజా ఎపిసోడ్‏లో తండ్రి ఎమోషన్‏తో అందరి కళ్లు చెమ్మగిల్లాయి. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరలవుతుంది.

తాజా ఎపిసోడ్‏లో ఆసిఫ్ అనే కంటెస్టెంట్ ఆశాపాశం బంధి చేసేలే.. పాటకు అద్భుతంగా డాన్స్ చేశారు. తన డాన్స్‏ను వాళ్ల నాన్న చూడాలని… తనను గట్టిగా కౌగిలించుకోవాలని ఆసిఫ్ కోరికను నెరవేర్చారు ఓంకార్. ప్రతి పండగకి తన స్నేహితులను కౌగిలించుకుని శుభాకాంక్షలు తెలిపేవాడినని, కానీ తన తండ్రిని కౌగిలించుకునే అవకాశం రాలేదని ఆసిఫ్ కన్నీటిపర్యంతమయ్యాడు. దీంతో స్టేజ్ పై ఓంకార్‏తో అందరూ భావోద్వేగానికి గురయ్యారు. తన తండ్రిని హగ్ చేసుకునే అదృష్టం లేదంటూ ఎమోషనల్ అయ్యారు శేఖర్ మాస్టర్.

దీంతో ఓంకార్ దగ్గరకు వెళ్లి ఓదార్చారు. తనకు కూడా తండ్రి లేడని.. మీకు నేను.. నాకు మీరు అంటూ ధైర్యం చెప్పారు. ఆ సమయంలో మోనాల్ గజ్జర్ సైతం కన్నీళ్లు పెట్టుకుంది. ఆసిఫ్ తండ్రి ఎమోషన్‏తో సాగిన ఈ ఎపిసోడ్ అందరి హృదయాలను కదిలించింది.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.