Viral Photo: వివాదాల నటి నయా లుక్ ని చూసి షాక్ తింటున్న అభిమానులు.. బాలనటి నుంచి హీరోయిన్ గా టీనేజ్ లోనే ఎంట్రీ..
కొత్త బంగారు లోకం సినిమాతో హీరోయిన్ గా చిన్న వయసులోనే ఎంట్రీ ఇచ్చింది. తర్వాత కొన్ని సినిమాల్లో హీరోయిన్ గా నటించినా మళ్ళీ హిట్ మాత్రం శ్వేతా ఖాతాలో పడలేదు. దీంతో వెంటనే ఐటెం సాంగ్ చేయడం మొదలు పెట్టింది
Viral Photo: విద్య, ఉద్యోగం, సినీ పరిశ్రమ ఇలా ఏ రంగంలోనైనా పాత వారు వెళ్తూ ఉంటారు.. కొత్తవారు వస్తూ ఉంటారు. అయితే అందరిలో కొందరు మాత్రమే తమ కంటూ ఓ గుర్తింపు సొంతం చేసుకుంటే.. ఒక్కరు ఇద్దరు మాత్రమే వచ్చిన గుర్తింపుని జీవితాంతం నిలబెట్టుకుంటారు.. ముఖ్యంగా సినీ పరిశ్రమలో ఒక్క సినిమాతోనే భారీ క్రేజ్ ను సొంతం చేసుకున్నవారు నటీనటులున్నారు. అయితే ఆ క్రేజ్ ను కొనసాగించలేక.. త్వరగానే తెరమరుగయ్యారు కూడా.. ముఖ్యంగా హీరోయిన్లలో ఒక్క సినిమాతోనే స్టార్ హీరోయిన్ హోదా ను అందుకుని.. శరవేగంగా గుర్తింపు తెచ్చుకుని.. అంతకంటే ఎక్కువ వేగంతో ఇండస్ట్రీకి దూరమైపోయారు. అలాంటి హీరోయిన్లలో ఒకరు శ్వేతా బసు ప్రసాద్. బాలనటిగా వెండి తెరపై అడుగు పెట్టిన శ్వేత.. టాలీవుడ్ లో కొత్తబంగారు లోకం సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమాతోనే అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది శ్వేతా బసు.
హీరోయిన్ గా శ్వేతా బసు ప్రసాద్ కొత్త బంగారు లోకం సినిమాలో వేడి వేడి పాలు ఎవరికమ్మా అంటూ తెలుగు ప్రేక్షకులను అలరించింది. బీహార్ కు చెందిన శ్వేతా హిందీ సినిమాలతో పాటు, అనేక హిందీ సీరియల్స్ లో బాల నటిగా నటించింది. మంచి గుర్తింపు సొంతం చేసుకుంది. తర్వాత కొత్త బంగారు లోకం సినిమాతో హీరోయిన్ గా చిన్న వయసులోనే ఎంట్రీ ఇచ్చింది. తర్వాత కొన్ని సినిమాల్లో హీరోయిన్ గా నటించినా మళ్ళీ హిట్ మాత్రం శ్వేతా ఖాతాలో పడలేదు. దీంతో వెంటనే ఐటెం సాంగ్ చేయడం మొదలు పెట్టింది. అయినప్పటికీ అక్కడ కూడా సక్సెస్ అందుకోలేదు.
ఇప్పుడు వెబ్ సిరీస్ మీద ఫోకస్ పెట్టింది శ్వేతా .. ప్రస్తుతం గునేగార్ అనే టెలి సిరీస్ లో నటించింది. ఈ సిరీస్ ప్రమోషన్ లో శ్వేతా ను చూసిన వారు షాక్ తిన్నారు. 30 ఏళ్లకే శ్వేతా ఇలా అయిపోయిందేంటి అని ఆశ్చర్యపోయారు. శ్వేతా సినిమాలతో కంటే వివాదాలతోనే ఎక్కువ పాపులర్ అయింది. ఫిలిం మేకర్ రోహిత్ మిట్టల్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్న శ్వేత ఒక్క సంవత్సరానికి విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే..
మరిన్నిఎంటర్టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..