AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Renu Desai: మాస్ మహరాజా సినిమాతో రేణు దేశాయ్ రీఎంట్రీ.. ఫస్ట్ లుక్ అదిరిపోయిందిగా..

తొలిసారి తన కూతురు ఆద్యను ఓ రియాల్టీ షోకు తీసువచ్చారు. ఫ్యామిలీకి పూర్తి సమయం కేటాయించిన రేణు దేశాయ్... ఇప్పుడు సిల్వర్ స్క్రీన్ పైకి రీఎంట్రీ

Renu Desai: మాస్ మహరాజా సినిమాతో రేణు దేశాయ్ రీఎంట్రీ.. ఫస్ట్ లుక్ అదిరిపోయిందిగా..
Renu Desai
Rajitha Chanti
|

Updated on: Sep 29, 2022 | 7:59 PM

Share

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. మాస్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబోలో వచ్చిన బద్రీ సినిమాతో వెండితెరకు పరిచయమయ్యారు రేణు దేశాయ్. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్‏గా నిలిచింది. ఇక ఆ తర్వాత పవన్ కళ్యాణ్ సరసన జానీ సినిమాలో నటించారు. ఈ సినిమా సమయంలోనే వీరిద్దరు ప్రేమలో ఉన్నారు. పెళ్లి తర్వాత ఆమె సినీ పరిశ్రమకు దూరమయ్యారు. దాదాపు 18 ఏళ్లపాటు సినిమాలకు దూరంగా ఉన్నారు. కళ్యాణ్ బాబుతో విడాకుల అనంతరం సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యారు రేణు దేశాయ్. ఫ్యామిలీ విషయాలు.. పిల్లల ఫోటోస్ షేర్ చేస్తూ ఫాలోవర్లతో టచ్‏లో ఉన్నారు. ఇక ఇటీవలే బుల్లితెరపై కూడా సందడి చేశారు. అంతేకాకుండా తొలిసారి తన కూతురు ఆద్యను ఓ రియాల్టీ షోకు తీసువచ్చారు. ఫ్యామిలీకి పూర్తి సమయం కేటాయించిన రేణు దేశాయ్… ఇప్పుడు సిల్వర్ స్క్రీన్ పైకి రీఎంట్రీ ఇస్తున్నారు. దాదాపు 18 సంవత్సరాల తర్వాత ఆమె మాస్ మహారాజా చిత్రంలో నటిస్తున్నారు.

ప్రస్తుతం వరుస చిత్రాలతో తెగ బిజీ అయ్యారు రవితేజ. ఆయన నటిస్తోన్న సినిమాలలో టైగర్ నాగేశ్వర రావు ఒకటి. స్టువర్ట్‏పురంలోని టైగర్ నాగేశ్వర రావు అనే ఓ దొంగ జీవితం ఆధారంగా ఈసినిమాను తెరకెక్కిస్తున్నారు డైరెక్టర్ వంశీ. ఇందులో నుపుర్ సనన్ కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమాతో రేణు దేశాయ్ మళ్లీ వెండితెరపై కనిపించనున్నారు. ఆమెకు సంబంధించిన ఫస్ట్ లుక్ ఇంట్రడ్యూసింగ్ వీడియో రిలీజ్ చేశారు మేకర్స్. వెల్ కమింగ్ రేణు దేశాయ్ టు ద బిగ్ స్క్రీన్ అంటూ వీడియోలో చూపించారు. తాజాగా విడుదలైన వీడియో చూస్తుంటే ఇందులో వపర్ ఫుల్ రోల్‏లో ఆమె కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఇందులో హేమలత లవణం అనే పాత్రను పోషిస్తున్నారు.

భారీ బడ్జెట్‏తో రవితేజ కెరీర్‏లో తొలిసారి పాన్ ఇండియా లెవల్లో నిర్మిస్తున్న సినిమా ఇది. అంతేకాకుండా ఇందులో బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ కీలకపాత్రలలో నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన రవితేజ ఫస్ట్ లుక్ పోస్టర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ సినిమా కాకుండా ధమాకా చిత్రంలోనూ నటిస్తున్నారు రవితేజ.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
ముంబైపై భారీ విజయం నమోదు చేసిన గైక్వాడ్ సేన
ముంబైపై భారీ విజయం నమోదు చేసిన గైక్వాడ్ సేన
భవిష్యత్ అంతా వెండిదే.. ఇందులో పెట్టుబడి పెడితే..
భవిష్యత్ అంతా వెండిదే.. ఇందులో పెట్టుబడి పెడితే..
క్రెడిట్ కార్డుల ద్వారా వచ్చే క్యాష్‌బ్యాక్‌పై ట్యాక్స్ ఉంటుందా..
క్రెడిట్ కార్డుల ద్వారా వచ్చే క్యాష్‌బ్యాక్‌పై ట్యాక్స్ ఉంటుందా..
సిరిసంపదలు కావాలా? శుక్రవారం లక్ష్మీ పూజ ఇలా చేస్తే ధనలాభం ఖాయం
సిరిసంపదలు కావాలా? శుక్రవారం లక్ష్మీ పూజ ఇలా చేస్తే ధనలాభం ఖాయం
అల్లు అర్జున్ 'రాకా' నుంచి దీపిక తప్పుకుందా? క్లారిటీ ఇదిగో
అల్లు అర్జున్ 'రాకా' నుంచి దీపిక తప్పుకుందా? క్లారిటీ ఇదిగో
అప్పట్లో తోపు హీరోయిన్.. 54 ఏళ్ల వయసులో రీఎంట్రీ..
అప్పట్లో తోపు హీరోయిన్.. 54 ఏళ్ల వయసులో రీఎంట్రీ..
నీటి అడుగున తిమింగలాలు పిల్లలకు పాలు ఎలా ఇస్తాయి? ఆ సీక్రెట్ ఇదే!
నీటి అడుగున తిమింగలాలు పిల్లలకు పాలు ఎలా ఇస్తాయి? ఆ సీక్రెట్ ఇదే!
నర్సంపేట ఆర్టీసీ డ్రైవర్ మృతి.. హైదరాబాద్ తరలిస్తుండగా..
నర్సంపేట ఆర్టీసీ డ్రైవర్ మృతి.. హైదరాబాద్ తరలిస్తుండగా..
ఊటీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? ఈ గైడ్ లేకుండా వెళ్లితే చాలా మిస్
ఊటీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? ఈ గైడ్ లేకుండా వెళ్లితే చాలా మిస్
తిన్న వెంటనే ఈ తప్పులు చేస్తున్నారా..? మీ జీర్ణవ్యవస్థ నాశనమవ్వడం
తిన్న వెంటనే ఈ తప్పులు చేస్తున్నారా..? మీ జీర్ణవ్యవస్థ నాశనమవ్వడం