AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మ‌ద‌ర్ రోల్స్‌కు రెడీ అంటున్న హీరోయిన్స్‌.. బ్యూటీ కెరీర్‌కు ఏమాత్రం ప్రాబ్లమ్‌ లేదట..

ఒక వేళ మదర్‌ రోల్స్‌ చేశారా... ఇక అంతే సంగతి.. కెరీర్ అటకెక్కినట్టే అని ఫిక్స్ అయ్యే వారు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. ఓ కమర్షియల్ సినిమాలు చేస్తూనే తల్లి పాత్రలకు కూడా రెడీ అంటున్నారు ఈ జనరేషన్ హీరోయిన్స్‌.

మ‌ద‌ర్ రోల్స్‌కు రెడీ అంటున్న హీరోయిన్స్‌..  బ్యూటీ కెరీర్‌కు ఏమాత్రం ప్రాబ్లమ్‌ లేదట..
Top Actress
Jyothi Gadda
|

Updated on: Sep 29, 2022 | 9:08 PM

Share

గతంలో హీరోయిన్స్ అంటే గ్లామర్ రోల్స్ మాత్రమే చేయాలన్న ఫార్ములాను పక్కాగా ఫాలో అయ్యే వారు. ఒక వేళ మదర్‌ రోల్స్‌ చేశారా… ఇక అంతే సంగతి.. కెరీర్ అటకెక్కినట్టే అని ఫిక్స్ అయ్యే వారు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. ఓ కమర్షియల్ సినిమాలు చేస్తూనే తల్లి పాత్రలకు కూడా రెడీ అంటున్నారు ఈ జనరేషన్ హీరోయిన్స్‌. ఆ మధ్య క్రాక్ సినిమాతో బౌన్స్‌ బ్యాక్ అయిన శ్రుతి హాసన్‌ ఆ సినిమాలో ఓ కుర్రాడికి తల్లిగా కనిపించి మెప్పించారు. గ్లామర్ ఫీల్డ్‌లో హీరోయిన్‌గా స్టార్ ఇమేజ్‌ అందుకోకముందే మదర్‌ రోల్‌కి షిప్ట్ అయి అందరికీ షాక్ ఇచ్చారు. కానీ ఆ ఎఫెక్ట్ ఈ బ్యూటీ కెరీర్ మీద ఏ మాత్రం పడలేదు. ప్రజెంట్ సౌత్‌లో బిజీగా హీరోయిన్‌గా కంటిన్యూ అవుతున్నారు శ్రుతి.

కోవిడ్ టైమ్‌లో కీర్తి సురేష్‌ కూడా మదర్‌ రోల్‌లో మెప్పించారు. పెంగ్విన్ సినిమాలో తల్లి పాత్రలో నటించిన కీర్తి… తరువాత తన గ్లామర్ ఇమేజ్‌ను అలాగే కంటిన్యూ చేస్తున్నారు. ప్రజెంట్ స్టార్ హీరోలకు బెస్ట్ ఛాయిస్ అన్న లిస్ట్‌లో టాప్‌లో ఉన్నారు కీర్తి సురేష్‌.

లేడీ సూపర్ స్టార్ నయనతార అయితే ఎప్పటి నుంచే ఇలాంటి రిస్కీ రోల్స్‌కు రెడీ అంటున్నారు. విశ్వాసం సినిమాలో టీనేజ్ అమ్మాయికి మదర్‌గా నటించిన నయన్‌… రీసెంట్‌గా ‘ఓ2’ అనే డిజిటల్ మూవీలోనూ మదర్ రోల్‌లో నటించారు.

ఇవి కూడా చదవండి

టాలీవుడ్ సెన్సేషన్ సమంత కూడా తల్లి పాత్రకు రెడీ అంటున్నారు. ఆ మధ్య ఓ బేబీ సినిమాలో కొద్ది క్షణాలు పాటు తల్లి పాత్రలో కనిపించిన సామ్‌… మైథలాజికల్‌ మూవీగా రూపొందుతున్న శాకుంతలం సినిమాలో భరతుడి తల్లిగా కనిపించబోతున్నారు.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

తెలివిగా కాపీ కొట్టాం అనుకున్నారు.. కట్‌చేస్తే.. ఇది పరిస్థితి
తెలివిగా కాపీ కొట్టాం అనుకున్నారు.. కట్‌చేస్తే.. ఇది పరిస్థితి
లండన్‌‌‌‌ వీధుల్లో.. ఇదేం దరిద్రంరా బాబు..! ఎక్కడ చూసినా మరకలే
లండన్‌‌‌‌ వీధుల్లో.. ఇదేం దరిద్రంరా బాబు..! ఎక్కడ చూసినా మరకలే
200MP కెమెరా, బిగ్ బ్యాటరీతో Xiaomi 17 Ultra లాంఛ్, ధర ఎంతంటే?
200MP కెమెరా, బిగ్ బ్యాటరీతో Xiaomi 17 Ultra లాంఛ్, ధర ఎంతంటే?
తెలంగాణలో సంక్రాంతి సెలవులు అప్పుడే.. ఈసారి ఏకంగా 9 రోజులు.?
తెలంగాణలో సంక్రాంతి సెలవులు అప్పుడే.. ఈసారి ఏకంగా 9 రోజులు.?
మీనా కూతురు నైనిక ఎంత పెద్దదైపోయిందో చూశారా? ఫొటోస్ వైరల్
మీనా కూతురు నైనిక ఎంత పెద్దదైపోయిందో చూశారా? ఫొటోస్ వైరల్
కోహ్లీకే షాకిచ్చిన ఈ లేటెస్ట్ సెన్సేషన్ బౌలర్ ఎవరో తెలుసా?
కోహ్లీకే షాకిచ్చిన ఈ లేటెస్ట్ సెన్సేషన్ బౌలర్ ఎవరో తెలుసా?
ఆదిరెడ్డి యూట్యూబ్ సంపాదన ఎంతో తెలుసా.. ?
ఆదిరెడ్డి యూట్యూబ్ సంపాదన ఎంతో తెలుసా.. ?
పీఎఫ్ అకౌంట్ లేనివారి కోసం కేంద్రం కొత్త స్కీమ్.. చేరితే అన్నీ..
పీఎఫ్ అకౌంట్ లేనివారి కోసం కేంద్రం కొత్త స్కీమ్.. చేరితే అన్నీ..
ఈ చిత్రంలో దాగిఉన్న పుట్టగొడుగుని గుర్తిస్తే.. మీరే తోపులు!
ఈ చిత్రంలో దాగిఉన్న పుట్టగొడుగుని గుర్తిస్తే.. మీరే తోపులు!
ప్రపంచంలోనే అతి పొడవైన సొరంగ మార్గం! 7గంటల ప్రయాణం, 20నిమిషాల్లో
ప్రపంచంలోనే అతి పొడవైన సొరంగ మార్గం! 7గంటల ప్రయాణం, 20నిమిషాల్లో