Ajith Kumar: అజిత్ విలన్‌గా మారుతున్నారా ?.. రియల్ లైఫ్ స్టోరీతో రానున్న స్టార్..
హెచ్ వినోద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అజిత్ క్యారెక్టర్‌కు సంబంధించిన ఇంట్రస్టింగ్ న్యూస్ వైరల్ అవుతోంది. ఈ వార్తలతో వింటేజ్ మూడ్‌లోకి వెళ్లిపోతున్నారు తల ఫ్యాన్స్.

అజిత్ హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ తునివు. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. హెచ్ వినోద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అజిత్ క్యారెక్టర్‌కు సంబంధించిన ఇంట్రస్టింగ్ న్యూస్ వైరల్ అవుతోంది. ఈ వార్తలతో వింటేజ్ మూడ్‌లోకి వెళ్లిపోతున్నారు తల ఫ్యాన్స్. నేర్కొండ పార్వై, వలిమై లాంటి సూపర్ హిట్ సినిమాల తరువాత చేస్తున్న మూవీ కావటంతో తునివు మీద అభిమానులతో పాటు ఇండస్ట్రీ జనాల్లోనూ భారీ అంచనాలు ఉన్నాయి. తాజాగా ఈ క్రేజీ మూవీకి సంబంధించిన అప్‌డేట్స్ ఆ అంచనాలను మరింతగా పెంచేస్తున్నాయి.
అజిత్ డిఫరెంట్ లుక్‌లో కనిపిస్తున్న ఈ సినిమా రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా తెరకెక్కుతుందన్న టాక్ వినిపిస్తోంది. 1987లో జరిగిన పంజాబ్ బ్యాంక్ రాబరీ ఆధారంగానే ఈ సినిమాను రూపొందిస్తున్నారన్నది లేటెస్ట్ అప్‌డేట్. అంతేకాదు ఈ సినిమాలో అజిత్ గ్రే షేడ్స్ ఉన్న పాత్రలో నటిస్తున్నారన్న ప్రచారం కూడా జరుగుతోంది. మాజీ పోలీసు అధికారి అయిన లబ్ సింగ్ అనే నిజ జీవిత వ్యక్తి ఆధారంగా తెరకెక్కిస్తున్నారట.




గతంలో వాలి, మంగత్తా లాంటి సినిమాల్లో నెగెటివ్ రోల్స్‌లో నటించారు అజిత్. ఆ రెండు సినిమాలు బ్లాక్ బస్టర్స్ కావటంతో తునివు కూడా అదే రేంజ్‌లో సౌండ్ చేస్తుందన్న కాన్ఫిడెన్స్‌తో ఉన్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన లుక్స్‌కి మంచి రెస్పాన్స్ రావటంతో తల ఖాతాలో మరో బిగ్ హిట్ పక్కా అని ఫిక్స్ అయ్యారు ఫ్యాన్స్. తునివులో అజిత్ కుమార్ రెండు విభిన్న గెటప్‌లలో కనిపిస్తాడని తెలుస్తోంది. ఇందులో మంజు వారియర్ కథానాయికగా నటిస్తోంది. బోనీ కపూర్ నిర్మిస్తు్న్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ కానుంది.