Manchu Vishnu: మరోసారి ట్రోలర్స్‌పై ఘాటుగా రియాక్టయిన విష్ణు.. వారి పరువు బజారున పడుతందని కామెంట్
టాలీవుడ్‌లో ట్రోల్ ఫైట్ పీక్స్‌కు చేరుతోంది. సోషల్ మీడియా వేదికగా మంచు ఫ్యామిలిపై ట్రోల్స్ రచ్చ కొనసాగుతునే ఉంది. ఇప్పటికే ట్రోలర్స్‌కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన మంచు విష్ణు.. తాజాగా మరోసారి ఘాటుగా రియాక్టయ్యారు.
ప్రస్తుత డిజిటల్ లైఫ్‌స్టైల్‌లో.. సోషల్ మీడియా దూసుకుపోతోంది. పలు అంశాలపై తమ తమ అభిప్రాయాలును సెలబ్రిటీల నుంచి సాధారణ జనాల వరకు సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్నారు. ఎక్కడ ఏ చిన్న తప్పు కనిపించినా.. వాటిని ట్రోల్స్ చేస్తూ.. ఓ ఆట ఆడేసుకుంటారు కొందరు మీమ్ కుర్రాళ్లు. కొన్ని సందర్బాల్లో కావాలనే వ్యక్తులను, కుంటుబాలను టార్గెట్ చేస్తూ రెచ్చిపోతుంటారు. ఇలానే.. కొన్ని నెలలుగా.. సోషల్ మీడియా వేదికగా మంచు ఫ్యామిలిపై ట్రోల్స్ రచ్చ కొనసాగుతునే ఉంది. ఇప్పటికే ట్రోలర్స్‌ను హెచ్చరించిన మంచు విష్ణు.. తాజాగా మరోసారి గట్టి వార్నింగ్ ఇచ్చారు. త్వరలోనే పేర్లు బయటకొస్తాయని.. అప్పుడు పరువు బజారున పడుతుందన్నారు. తనపై ట్రోల్ చేస్తున్న వారిపై సైబర్ క్రైంకు ఫిర్యాదు చేసినట్టు చెప్పారు. 2 ఐపీ అడ్రస్‌లను ట్రేస్ చేశామని.. 18 యూట్యూబ్ ఛానెల్స్‌పై కేసులు పెట్టామన్నారు. తాము గుర్తించిన ఐపీ అడ్రస్‌లో ఒకటి ప్రముఖ నటుడిదన్నారు మంచు విష్ణు.
సినిమా ఇండస్ట్రీలో గతంలో ఒక కుటుంబంలా ఉండేవారమని..కొత్త వాళ్ళు రావడంతో ఆ పద్దతి సైడ్ ట్రాక్ పట్టిందన్నారు. తమపై పెయిడ్ క్యాంపెయిన్ చేస్తున్నవారిపై కచ్చితంగా చర్యలుంటాయన్నారు. ఈ ట్రోల్స్ సాధారణంగా తాము పట్టించుకోమని, కానీ జవాబుదారితనం కోసమే కేసులు పెట్టినట్లు తెలిపారు. కాగా మంచు విష్ణు ఆరోపించిన ఆ హీరో ఎవరన్నది ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఇంతకీ ఆ యాక్టరు ఎవరు..? మంచు కుటుంబంతో అతనికి డిఫరెన్సెస్ ఉన్నాయా..? లేక మరేవైనా రీజన్స్ ఉన్నాయా అన్న కోణంలో తెలుగు ఇండస్ట్రీలో డిస్కషన్ నడుస్తుంది. అంతేకాదు కంపెనీ పెట్టి మరీ ఎవరు ఇంత పనిచేయడానికి పూనుకున్నారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరికొంత మంది అయితే ఇదంతా సినిమా ప్రమోషన్ కోసమే విష్ణు ఈ కామెంట్స్ చేస్తున్నారని చెబుతున్నారు. మరి ఇందులో ట్రూత్ ఎంతన్నది తేలాల్సి ఉంది.
కాగా మంచు ఫ్యామిలీపై వస్తున్న ట్రోల్స్ విషయంలో విభిన్న అభిప్రాయాలు ఉన్నాయి. ఈ రకంగా మనుషులపై ట్రోలింగ్‌కు పాల్పడటం అనేది పైశాచిక ఆనందం అని కొందరు అంటుంటే.. మంచు వారే అందుకు స్కోప్ ఇస్తున్నారు అన్నవారు కూడా లేకపోలేదు. ఏది ఏమైనా మరోసారి ఇటు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో, అటు సోషల్ మీడియాలో మరోసారి మంచు కుటుంబం బ్యానర్ ఐటమ్ అయ్యింది.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.