సొసైటీ సెక్యూరిటీ విషయంలో వివాదం.. కర్రలు, రాడ్లతో ఘర్షణపడ్డ ఇరువర్గాలు.. వైరలవుతున్న వీడియో
ముందుగా వారంతా బెల్ట్‌లు, కర్రలు, రాడ్‌లతో కనిపించారు. రెండు బృందాలు కొట్టుకుంటుండగా, వారిలో కొంతమంది గొడవను ఆపేందుకు ప్రయత్నిస్తున్నారు.
సొసైటీలో సెక్యూరిటీ ఏజెన్సీ మార్పు విషయమై ఇరువర్గాల మధ్య గొడవ జరిగింది. ఉద్దేశపూర్వకంగా బెల్ట్‌లు, లాఠీలు, ఆయుధాలు ధరించిన రెండు సమూహాలు పరస్పరం దాడులకు దిగాయి. ఈ ఘర్షణకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. వీడియోలో ఒక బృందంలోని వ్యక్తులు యూనిఫాం ధరించిన భద్రతా సిబ్బంది. మరోవైపు సాధారణ ప్రజలు కనిపించారు. రెండు గ్రూపులు కర్రలు, బెల్టులు, రాడ్‌లతో ఘర్షణ పడుతున్నాయి. గేటుకు ఇరువైపులా ఉన్న వ్యక్తులు ఒకరినొకరు కర్రలతో కొట్టుకోవడం వీడియోలో కనిపిస్తుంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ ఘటన ఘజియాబాద్‌లో జరిగినట్టుగా తెలిసింది. మహాగున్ మస్కట్ సొసైటీలో సెక్యూరిటీ ఏజెన్సీలో మార్పు విషయమై గురువారం మధ్యాహ్నం గొడవ జరిగింది.
ఘజియాబాద్‌లోని మహాగున్ మస్కట్ సొసైటీలో సెక్యూరిటీ ఏజెన్సీలో మార్పు విషయమై గురువారం మధ్యాహ్నం గొడవ జరిగింది. క్రాసింగ్స్ రిపబ్లిక్ సమీపంలో ఉన్న సొసైటీ నివాసితులు, 2018లో ఎన్నికైన మునుపటి RWA ప్రస్తుత RWA యొక్క చట్టబద్ధతపై పోటీ చేసిన తర్వాత వివాదం తలెత్తిందని చెప్పారు. ఘర్షణకు సంబంధించిన వీడియోలో వారంతా ఉద్దేశపూర్వకంగా దాడులు చేసుకున్నట్టుగా తెలుస్తుంది. ముందుగా వారంతా బెల్ట్‌లు, కర్రలు, రాడ్‌లతో కనిపించారు. రెండు బృందాలు కొట్టుకుంటుండగా, వారిలో కొంతమంది గొడవను ఆపేందుకు ప్రయత్నిస్తున్నారు. ఒక RWA సభ్యుడు తెలిపిన వివరాల ప్రకారం,.. “గత RWA, ఎన్నికలలో అవకతవకలు జరిగినట్లు ఆరోపించిన తరువాత, వాటిని భర్తీ చేస్తామని భద్రతా ఏజెన్సీని బెదిరించారు. ఈరోజు, వారు గూండాలతో వచ్చారు… నివాసితులు వచ్చారు. ఈ క్రమంలోనే ఇరువురి మధ్య గొడవ జరిగిందని చెప్పారు.
Violent clash in Mahagun society over change of security agency. pic.twitter.com/b5sZsB6f6S
— nishant shekhar (@nishantshekhar1) September 29, 2022
అయితే, ఈ గొడవపై మరో వర్గం RWA సభ్యులు మాట్లాడుతూ..తమ నిర్వహణ బకాయిలను క్లియర్ చేయకుండానే ఎన్నికలు నిర్వహించటం, కొత్త RWA నియామకం జరపటం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. ముందు తమకు రావాల్సిన బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం..