Bank of Baroda Jobs 2022: బ్యాంక్‌ జాబ్స్‌! రాత పరీక్షలేకుండా బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాలో 345 ఉద్యోగాలు.. ఈ అర్హతలుంటే చాలు..

భారత ప్రభుత్వరంగానికి చెందిన బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా బ్రాంచుల్లో వెల్త్‌ మేనేజ్‌మెంట్‌ సర్వీసెస్‌ విభాగంలో.. ఒప్పంద ప్రాతిపదికన 345 సీనియర్‌ రిలేషనల్‌షిప్‌ మేనేజర్, ఈ వెల్త్‌ రిలేషన్‌షిప్‌ మేనేజర్‌, గ్రూప్‌ సేల్స్‌ హెడ్‌, ఆపరేషన్స్‌ హెడ్‌ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల..

Bank of Baroda Jobs 2022: బ్యాంక్‌ జాబ్స్‌! రాత పరీక్షలేకుండా బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాలో 345 ఉద్యోగాలు.. ఈ అర్హతలుంటే చాలు..
Bank Of Baroda
Follow us
Srilakshmi C

|

Updated on: Sep 30, 2022 | 4:08 PM

భారత ప్రభుత్వరంగానికి చెందిన బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా బ్రాంచుల్లో వెల్త్‌ మేనేజ్‌మెంట్‌ సర్వీసెస్‌ విభాగంలో.. ఒప్పంద ప్రాతిపదికన 345 సీనియర్‌ రిలేషనల్‌షిప్‌ మేనేజర్, ఈ వెల్త్‌ రిలేషన్‌షిప్‌ మేనేజర్‌, గ్రూప్‌ సేల్స్‌ హెడ్‌, ఆపరేషన్స్‌ హెడ్‌ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్ నుంచి డిగ్రీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో నోటిఫికేషన్‌లో సూచించిన విధంగా అనుభవం కూడా ఉండాలి. దరఖాస్తుదారుల వయసు పోస్టును బట్టి తప్పనిసరిగా 23 నుంచి 50 ఏళ్ల మధ్య ఉండాలి. ఈ అర్హతలున్నవారు ఆన్‌లైన్‌ విధానంలో అక్టోబర్‌ 20, 2022వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. జనరల్ అభ్యర్ధులు రూ.600లు, ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ/మహిళా అభ్యర్ధులు రూ.100లు దరఖాస్తు ఫీజు చెల్లించవల్సి ఉంటుంది.

షార్ట్‌లిస్టింగ్‌, పర్సనల్‌ ఇంటర్వ్యూ, గ్రూప్‌ డిస్కషన్‌, అనుభవం ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ఎంపికైన అభ్యర్ధులు హైదరాబాద్‌తోపాటు అహ్మదాబాద్‌, ఆనంద్‌, బెంగళూరు, భోపాల్, చండీగడ్‌, చెన్నై, కోయింబత్తూర్‌, గుర్‌గాన్‌, జలంధర్, జోధ్‌పూర్‌, కాన్పూర్, కోల్‌కతా, లక్నో, లూథియానా, మంగళూరు, ముంబాయి, నాగ్‌పూర్‌, న్యూఢిల్లీ, పూణె, రాజ్‌కోట్‌, సూరత్‌, వడోదర, వారణాసి, గౌవహతి, పాట్నాలలో పని చేయవల్సి ఉంటుంది. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

పోస్టుల వారీగా ఖాళీల వివరాలు..

ఇవి కూడా చదవండి
  • సీనియర్‌ రిలేషనల్‌షిప్‌ మేనేజర్ పోస్టులు: 320
  • ఈ వెల్త్‌ రిలేషన్‌షిప్‌ మేనేజర్‌ పోస్టులు: 24
  • గ్రూప్‌ సేల్స్‌ హెడ్‌ పోస్టులు: 1
  • ఆపరేషన్స్‌ హెడ్‌ పోస్టులు: 1

పూర్తి సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.