కదులుతున్న రైల్లో గర్భిణీకి పురిటి నొప్పులు.. సాగర్‌ స్టేషన్‌ ప్లాట్‌ఫారమ్‌పై ఒక బిడ్డ.. ఆస్పత్రిలో మరొక బిడ్డ

GRP పోలీసులు, అంబులెన్స్, ముందు పోలీసు వాహనం భద్రత నడుమ వీఐపీ ట్రీట్‌మెంట్‌తో ఆమెను జిల్లా ఆసుపత్రిలోని ప్రసూతి వార్డులో చేర్చారు.

కదులుతున్న రైల్లో గర్భిణీకి పురిటి నొప్పులు.. సాగర్‌ స్టేషన్‌ ప్లాట్‌ఫారమ్‌పై ఒక బిడ్డ.. ఆస్పత్రిలో మరొక బిడ్డ
Woman Delivery
Jyothi Gadda

|

Sep 30, 2022 | 5:15 PM

రైలులో ప్రయాణిస్తున్న ఓ మహిళా ప్రయాణికురాలు ప్రసవ నొప్పులు రావటంతో సమీప స్టేషన్‌లోనే ఆడబిడ్డకు జన్మనిచ్చింది. తల్లి, బిడ్డను వెంటనే స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ ఆమె మరొక బిడ్డకు జన్మనిచ్చింది. ప్రసవం తర్వాత తల్లి, ఇద్దరు బిడ్డలు ఆరోగ్యంగా ఉన్నారు. వారు ముగ్గురినీ వైద్యుల పర్యవేక్షణలో ఉంచారు. ఈ విచిత్ర సంఘటనకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట తెగ సందడి చేస్తున్నాయి. పూర్తి వివరాల్లోకి వెళితే..

జమ్మూ-తావి ఎక్స్‌ప్రెస్ రైలులో ఒక మహిళ తీవ్రమైన ప్రసవ నొప్పులతో బాధపడుతోందని, ఆమెకు సహాయం అవసరమని ఎంపీ సాగర్ రైల్వే స్టేషన్ మేనేజర్ వైర్‌లెస్ ద్వారా సమాచారం అందుకున్నారు. మేనేజర్ వెంటనే రైల్వే ఆస్పత్రికి, జీఆర్పీకి సమాచారం అందించి మహిళను స్టేషన్‌లో దించారు. తప్పని పరిస్థితిలో ఆ మహిళకు స్టేషన్‌లోనే ప్రసవం చేయాల్సి వచ్చింది. తొలుత పండంటి ఆడబిడ్డ పుట్టింది. తల్లిని, పసికందుని పూర్తిగా సురక్షితంగా జీఆర్పీ పోలీసుల ఆధ్వర్యంలో ఆస్పత్రికి తరలించారు. లాడ్లీ ఆసుపత్రికి చేరుకోగానే.. పోలీసు రక్షణతో ఓ వీఐపీ వచ్చినట్లుగా చూసుకున్నారు. ఇక్కడ ఆ తల్లి మరో బిడ్డకు జన్మనిచ్చింది.

ఛత్తీస్‌గఢ్‌కు చెందిన లక్ష్మీ, ఆమె భర్త రాకేష్ కశ్యప్ సాగర్ మీదుగా వెళ్తున్న జమ్మూ-తావి ఎక్స్‌ప్రెస్ ఎస్-5లో ప్రయాణిస్తున్నారు. అకస్మాత్తుగా ఆమెకు విపరీతమైన ప్రసవ నొప్పులు మొదలయ్యాయి. ప్రయాణికులు రైలు సిబ్బందికి సమాచారం అందించడంతో సాగర్‌ స్టేషన్‌ యాజమాన్యానికి, జీఆర్‌పీకి సమాచారం అందించారు. సాగర్‌లో రైలు ఆగిన వెంటనే లక్ష్మిని, ఆమె భర్తను కిందకు దించారు. ప్రసవనొప్పి తీవ్రంగా ఉండడంతో లక్ష్మిని ఆస్పత్రికి తీసుకెళ్లే అవకాశం లేకపోయింది. దాంతో ప్లాట్‌ఫాంపైనే మహిళలు ఆమెకు చుట్టూరా చీరలు పట్టుకుని ప్రసవం చేశారు. ఆమె ఆరోగ్యవంతమైన ఆడబిడ్డకు జన్మనిచ్చింది. GRP పోలీసులు, అంబులెన్స్, ముందు పోలీసు వాహనం భద్రత నడుమ వీఐపీ ట్రీట్‌మెంట్‌తో ఆమెను జిల్లా ఆసుపత్రిలోని ప్రసూతి వార్డులో చేర్చారు. మహిళ ఇక్కడ కూడా తీవ్రమైన ప్రసవ నొప్పితో బాధపడుతోంది. మహిళను పరీక్షించిన వైద్యులు.. ఆమె కడుపులో మరో బిడ్డ ఉందని చెప్పారు. డెలివరీ అయిన తరువాత లక్ష్మి ఆరోగ్యకరమైన బిడ్డకు జన్మనిచ్చింది. అయితే ముందుజాగ్రత్తగా వారిని SNCUలో చేర్చారు.

ఇవి కూడా చదవండి

Woman Suffered Labor Pain

ఈ మొత్తం సంఘటన సమయంలో GRP పోలీసు సిబ్బంది ఆసుపత్రిలోనే ఉన్నారు. ఇద్దరినీ సురక్షితంగా ఇంటికి చేర్చిన తర్వాత మాత్రమే తిరిగి వెళ్లిపోయారు. ఈ సందర్భంగా జీఆర్‌పీ స్టేషన్‌ ఇన్‌ఛార్జ్‌ ప్రమోద్‌ కుమార్‌ అహిర్వార్‌ మాట్లాడుతూ..ప్రసవ వేదనతో అవస్థపడుతున్న మహిళకు ఇతర మహిళలు సహకరించారని చెప్పారు. సాగర్ రైల్వే స్టేషన్‌ సిబ్బంది, ఆసుపత్రి యాజమాన్యం వారి సత్వర సహాయానికి సదరు మహిళ, ఆమె భర్త కృతజ్ఞతలు తెలిపారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu