IRCTC New Rules: గురకపెట్టి నిద్రపోవడం.. ఫోన్లో గట్టిగా మాట్లాడటం ఇక కుదరదు.. కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయి..

ఇండియన్ రైల్వే. ప్రయాణికులు ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రయాణాన్ని పూర్తి చేయాలన్నదే ఇండియన్ రైల్వే ప్రధాన లక్ష్యం. దీన్ని దృష్టిలో..

IRCTC New Rules: గురకపెట్టి నిద్రపోవడం.. ఫోన్లో గట్టిగా మాట్లాడటం ఇక కుదరదు..  కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయి..
Irctc New Rules
Follow us
Sanjay Kasula

|

Updated on: Sep 30, 2022 | 5:34 PM

రైల్వేలు ప్రయాణికుల సౌకర్యార్థం ఎప్పటికప్పుడు మార్పులు చేస్తూనే  ఉంది ఇండియన్ రైల్వే. ప్రయాణికులు ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రయాణాన్ని పూర్తి చేయాలన్నదే ఇండియన్ రైల్వే ప్రధాన లక్ష్యం. దీన్ని దృష్టిలో ఉంచుకుని రైల్వేశాఖ రాత్రిపూట ప్రయాణికులకు నిద్రాభంగం కలగకుండా నిబంధనలను మార్చబోతోంది ఇండియన్ రైల్వే. ఎందుకంటే కొందరు రాత్రిపూట నిద్రించే సమయంలో శబ్దం చేస్తూ ప్రయాణికులకు ఇబ్బంది కలిగించడం తరచుగా మనం చూస్తుంటాం. దీంతో ప్రయాణికులు రాత్రిపూట నిద్రలో ఇబ్బందులు పడుతుంటారు. రాత్రిపూట కంపార్ట్‌మెంట్ లోపల, వెలుపల నిద్రిస్తున్నప్పుడు, కోచ్‌లో ఇతరులతో బిగ్గరగా మాట్లాడటం, బిగ్గరగా సంగీతం వినడం  లేదా కాల్‌లో మాట్లాడటం చేస్తుంటారు. ఇలాంటి వారికి చెక్ పెట్టేందుకు కంపార్ట్‌మెంట్ లోపల, వెలుపల శబ్దం చేయకూడదని రైల్వే ప్రజలకు కఠినమైన సూచనలు చేసింది. దీనికి సంబంధించి భారతీయ రైల్వే కొత్త నిబంధనను తీసుకొచ్చింది. ఈ నిబంధనలు త్వరలో అమలులోకి వస్తాయి. నిబంధనలు పాటించనందుకు జరిమానా కూడా పడే అవకాశం ఉంది.

కొత్త నిబంధనల ప్రకారం, రాత్రి సమయాల్లో సంగీతం వినడానికి, బిగ్గరగా మాట్లాడటానికి, శబ్దం చేయడానికి లేదా కాల్‌లో బిగ్గరగా మాట్లాడటానికి అనుమతి ఉండదు. ప్రయాణికులు సులువుగా నిద్రపోయేలా, ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రయాణించేలా రైల్వేశాఖ ఈ కొత్త రూల్ తీసుకొచ్చింది. ఈ కొత్త నిబంధన అమల్లోకి వచ్చిన తర్వాత ప్రయాణికుల ప్రయాణం ప్రశాంతంగా ఉండడంతోపాటు సౌకర్యవంతంగా ఉండే అవకాశం ఉంది.

మరోవైపు, ఎవరైనా ప్రయాణీకుడు మరో ప్రయాణికుడికి ఇబ్బందిని కలిగిస్తే చర్య తీసుకోవడంతోపాటు.. వారికి జరిమానా విధించవచ్చు. దీని గురించి మీరు రైలు సిబ్బందికి ముఖ్యంగా టీటీకి ఫిర్యాదు చేయవచ్చు. దీని తర్వాత, ఆ ప్రయాణికుడిపై తక్షణ చర్యలు తీసుకుంటారు.

ఇలాంటి పరిస్థితుల్లో రాత్రి నిద్రించే సమయంలో ఇలాంటి పనులు చేయవద్దని రైల్వే అధికారులు అతనికి మొదటిసారిగా హెచ్చరిస్తారు. అయితే మీరు రాత్రిపూట వీడియో చూస్తున్నట్లయితే.. మీరు ఇయర్‌ఫోన్ వంటి పరికరాన్ని ఉపయోగించాల్సి ఉంటుంది.. తద్వారా ఎవరికీ ఇబ్బంది ఉండదు.

మరిన్ని జాతీయ వార్తల కోసం

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?