రూ.5.5 కోట్ల కరెన్సీ నోట్లతో శ్రీ మ‌హా ల‌క్ష్మీదేవిగా అమ్మవారి అలంకరణ.. దర్శనానికి కిక్కిరిసిన భక్తులు..

న‌వ‌రాత్రుల్లో భాగంగా ఇక్కడ అమ్మ‌వారు మ‌హా ల‌క్ష్మీదేవిగా భ‌క్తుల‌కు ద‌ర్శ‌నం ఇస్తున్నారు. అమ్మ‌వారిని ద‌ర్శించుకునేందుకు భ‌క్తులు భారీగా త‌ర‌లి వ‌స్తున్నారు. క‌న్య‌కా ప‌ర‌మేశ్వ‌రి ఆల‌యం భ‌క్తుల‌తో కిక్కిరిసి పోయింది.

రూ.5.5 కోట్ల కరెన్సీ నోట్లతో శ్రీ మ‌హా ల‌క్ష్మీదేవిగా అమ్మవారి అలంకరణ.. దర్శనానికి కిక్కిరిసిన భక్తులు..
Kanyakaparameswari
Follow us
Jyothi Gadda

|

Updated on: Sep 30, 2022 | 5:47 PM

దేశవ్యాప్తంగా దసరా ఉత్సవాలు మిన్నంటుతున్నాయి. దేశ వ్యాప్తంగా దుర్గాదేవి ఆలయాలు ఎన్నో ఉన్నాయి. ఒక్కో ఆలయంలో ఒక్కో అవతారంతో అమ్మవారు భక్తులను ఆశీర్వదిస్తుంటారు. ఇక శరన్నవరాత్రి వేడుకల్లో దుర్గాదేవి అమ్మవారు రోజుకో అలంకారంలో భక్తులకు దర్శనమిస్తుంటారు. పరమేశ్వరి, పార్వతి, గాయత్రి, మహాకాళి, మహాలక్ష్మీ, మహా సరస్వతి, కనకదుర్గ, లలిత, రాజరాజేశ్వరి.. ఇలా ఏ పేరుతో పిలిచినా ఆయా రూపాల్లో ఉండే ‘పరాశక్తి’ ఒక్కటే. ప్రతి అమ్మవారి ఆలయంలోనూ ఈ శరన్నవరాత్రి వేడులు ఘనంగా జరుగుతాయి. దసరా నవరాత్రులను పురస్కరించుకొని తెలంగాణలోనూ బతుకమ్మ, దసరా సంబరాలు అంబరాన్నంటుతాయి. శ్రీ కన్యకా పరమేశ్వరీ ఆలయంలో అమ్మవారిని కరెన్సీ నోట్లతో సర్వాంగ సుందరంగా అలంకరించారు.

మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జిల్లాలో న‌వ‌రాత్రులు ఘ‌నంగా జరుగుతాయి. శ్రీ క‌న్య‌కాప‌ర‌మేశ్వ‌రి దేవి ఆల‌యంలో అమ్మ‌వారికి భారీ న‌గ‌దుతో అలంక‌ర‌ణ చేశారు. అమ్మ‌వారి అలంక‌ర‌ణ‌కు ఉప‌యోగించిన మొత్తం క‌రెన్సీ విలువ రూ. 5,55,55,555.55. మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జిల్లా కేంద్రంలో న‌వ‌రాత్రులు ఘ‌నంగా జ‌రుగుతున్నాయి. బ్ర‌హ్మ‌ణ‌వాడిలోని శ్రీ క‌న్యకా ప‌ర‌మేశ్వ‌రి దేవి ఆల‌యంలో రూ. 10, 20, 50, 100, 200, 500 నోట్ల‌తో అలంక‌రించారు. దీంతో అమ్మ‌వారు ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలిచారు. న‌వ‌రాత్రుల్లో భాగంగా ఇక్కడ అమ్మ‌వారు మ‌హా ల‌క్ష్మీదేవిగా భ‌క్తుల‌కు ద‌ర్శ‌నం ఇస్తున్నారు. అమ్మ‌వారిని ద‌ర్శించుకునేందుకు భ‌క్తులు భారీగా త‌ర‌లి వ‌స్తున్నారు. క‌న్య‌కా ప‌ర‌మేశ్వ‌రి ఆల‌యం భ‌క్తుల‌తో కిక్కిరిసి పోయింది.

ఇటు ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోనూ దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. వరంగల్‌లోని 19వ డివిజన్‌ నర్సంపేటరోడ్డులో గల శ్రీకనకదుర్గమాత ఆలయంలో 4వ రోజు లలిత పంచమి మహాలక్ష్మీమాత అలంకరణలో కనకదుర్గమాత అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. మహాలక్ష్మీ అలంకరణలో అమ్మవారిని రూ. 30 వేల కరెన్సీ నోట్లతో అమ్మవారికి అలంకరణ చేశారు. ఉదయం నుంచి ప్రత్యేక పూజలు, అభిషేకాలు, గణపతిపూజ, చంఢీహోమం నిర్వహించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..