Yadagirigutta-CM KCR: లక్ష్మీనరసింహ స్వామివారిని దర్శించుకున్న సీఎం కేసీఆర్.. కిలో 16 తులాల బంగారం అందజేత
ప్రపంచ అద్భుత ఆధ్యాత్మిక క్షేత్రంగా రూపుదిద్దుకున్న యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి దాతలు కరువయ్యారా...సీఎం కేసీఆర్ ఊరూ...వాడా...అందరినీ భాగస్వామ్యం చేసేలా ప్రకటించినా దాతలు పట్టించుకోవడం లేదా అంటే అవుననేలా పరిస్థితులు నెలకొన్నాయి.
యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి దేవాలయాన్ని సీఎం కేసీఆర్ చరిత్రలో నిలిచి పోయేలా పునర్నిర్మాణం చేపట్టారు. మహా కుంభ సంప్రోక్షణ నేపథ్యంలో గతేడాది అక్టోబర్ లో సీఎం కేసీఆర్ లక్ష్మీ నరసింహస్వామి దివ్య విమాన గోపురాన్ని125 కిలోల స్వచ్ఛమైన బంగారంతో తాపడం చేయనున్నట్టు ప్రకటించారు. అందుకు భక్తులందరిని భాగస్వామ్యం చేయాలనుకున్నారు. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి వారి దివ్య విమాన గోపురాన్ని బంగారు తాపడంకోసం మొదటగా తన కుటుంబం నుంచి కిలో 16 తులాల బంగారం విరాళంగా ప్రకటించారు. కుటుంబంతో కలిసి వచ్చిన సీఎం కేసీఆర్ గతంలో ప్రకటించినట్టుగా కిలో 16 తులాల బంగారాన్ని స్వామివారికి విరాళంగా అందజేశారు.
ప్రధాన ఆలయ దివ్య గోపురం స్వర్ణ తాపడానికి ఆశించినట్లుగా దాతల నుంచి స్పందన రాలేదు. కేవలం అధికార పార్టీ నేతలు నుంచే కొద్ది మొత్తంలో బంగారం విరాళంగా వచ్చింది. ఇప్పటికీ దాతల నుంచి కేవలం 6 కిలోల 617 గ్రాముల బంగారం, రూ. 19 కోట్ల 38 లక్షల 17వేలు మాత్రమే సమకూరింది. మొత్తం 125 కిలోల బంగారు తాపడం కోసం రూ.65 కోట్ల వరకు ఖర్చు అవుతుంది. అయితే సుమారు రూ.22 కోట్ల మేర మాత్రమే సమకూరింది. మొత్తం సమకూరాక రిజర్వు బ్యాంకు నుంచి ఆ బంగారం కొనుగోలు చేసి స్వామి వారి గర్భగుడి దివ్య విమానానికి బంగారు తాపడం చేయనున్నారు.
వాయిస్: యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి వారి మహా కుంభ సంప్రోక్షణ తేదీ ప్రకటించిన రోజే సీఎం కేసీఆర్ సహా 22 కిలోల బంగారం ఇచ్చే దాతల వివరాలు ప్రకటించారు. అయితే సీఎం కేసీఆర్ కూడా ప్రకటించిన బంగారాన్ని ఆలయానికి అందజేయకపోవడం గమనార్హం. తిరుమల తరహాలోనే దివ్య విమానానికి బంగారు తాపడం చేయాలని తలంచిన సీఎం కేసీఆర్ ఆలోచనలకు దాతలు ముందుకు రాకపోవడంతో ఆలయ అధికారులు ఆలోచనలో పడ్డారు. ఇప్పటికైనా దాతలు ముందుకు వచ్చి దివ్య విమాన గోపురానికి బంగారం అందజేయాలన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
Reporter: Revan Reddy, TV9 Telugu
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..