Srivari Brahmotsavam: గరుడసేవలో స్వామివారికి అలంకరించేందుకు ప్రత్యేక గొడుగులు.. చెన్నై నుంచి తిరుమలకు రాక
సమితి ట్రస్టీ శ్రీ ఆర్.ఆర్.గోపాల్‌జి ఆధ్వర్యంలో తిరుమలకు చేరుకున్న గొడుగులకు టీటీడీ అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. ఆలయం ముందు ఈ గొడుగులను టీటీడీ ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డికి అందించారు. నాలుగు మాడ వీధుల్లో ఊరేగించిన అనంతరం ఆలయంలోకి తీసుకెళ్లారు.
Srivari Brahmotsavam: కలియుగ దైవం కొలువైన క్షేత్రం తిరుమల తిరుపతి. ఈ క్షేత్రం నిత్యం భక్తుల రద్దీతో సందడిగా ఉంటుంది. పండగలు పర్వదినాలతో పాటు ప్రత్యేక రోజుల్లో స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులు పోటెత్తుతారు. ఇక బ్రహ్మాండ నాయకుడి బ్రహ్మోత్సవాలను స్వయంగా దర్శించుకుని తరించేందుకు అయితే సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకూ ఆసక్తిని చూపిస్తారు. దాదాపు రెండేళ్ల తర్వాత బ్రహ్మోత్సవాలు భక్తుల సమక్షంలో టీటీడీ అంగరంగ వైభంగా నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో తిరుమల గిరులు భక్త సంద్రంతో నిండిపోయాయి. రేవు శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా గరుడసేవ జరగనుంది. దీంతో స్వామివారికి అలంకరించేందుకు హిందూ ధర్మార్థ సమితి చెన్నై నుండి గొడుగులను ఊరేగింపుగా శుక్రవారం తిరుమలకు తీసుకొచ్చింది.
సమితి ట్రస్టీ శ్రీ ఆర్.ఆర్.గోపాల్‌జి ఆధ్వర్యంలో తిరుమలకు చేరుకున్న గొడుగులకు టీటీడీ అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. ఆలయం ముందు ఈ గొడుగులను టీటీడీ ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డికి అందించారు. నాలుగు మాడ వీధుల్లో ఊరేగించిన అనంతరం ఆలయంలోకి తీసుకెళ్లారు. గరుడసేవలో ఈ గొడుగులను అలంకరించనున్నారు.
ఈ సందర్భంగా శ్రీ ఆర్.ఆర్.గోపాల్‌జి మాట్లాడుతూ ఈనెల 25న చెన్నై నుంచి 11 గొడుగుల ఊరేగింపు ప్రారంభమైందన్నారు. చెన్నైలోని చెన్నకేశవ పెరుమాళ్ ఆలయంలో ప్రత్యేక పూజల అనంతరం తిరువళ్లూరులోని వీరరాఘవ పెరుమాళ్ ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించామని చెప్పారు. గురువారం రాత్రి తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారికి 2 గొడుగులను సమర్పించినట్టు చెప్పారు. గత 17 సంవత్సరాలుగా తిరుమల శ్రీవారికి గరుడ సేవ నాడు అలంకరించడానికి శ్రీవారికి గొడుగులు సమర్పిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో హిందూ ధర్మార్థ సమితి ఫౌండర్ శ్రీ వేదాంతం పాల్గొన్నారు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..