AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Navaratri 2022: నవరాత్రుల్లో ఉపవాస దీక్ష భగ్నమయిందా.. అయితే పాటించాల్సిన పరిహారాలు ఏమిటో తెలుసా

మీరు నవరాత్రులలో  దుర్గాదేవికి ఉపవాసం ఉండి, పొరపాటున దానిని భగ్నం చేసినట్లయితే.. మీరు పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.  ఉపవాస దీక్షను అనుకోని పరిస్థితుల్లో విరమించినట్లు అయితే దానికి కొన్ని పరిహారాలున్నాయి.

Navaratri 2022: నవరాత్రుల్లో ఉపవాస దీక్ష భగ్నమయిందా.. అయితే పాటించాల్సిన పరిహారాలు ఏమిటో తెలుసా
Navaratri Durga Puja
Surya Kala
|

Updated on: Sep 30, 2022 | 4:02 PM

Share

ఈరోజు శరన్నవరాత్రుల్లో ఐదవ రోజు.  నేడు దుర్గాదేవిని స్కందమాత దేవి అవతారంలో పూజిస్తారు. నవరాత్రుల మొత్తం 9 రోజులలో, అమ్మవారిని సంప్రదాయాన్ని అనుసరించి అత్యంత భక్తిశ్రద్దలతో పూజిస్తారు. దుర్గాదేవిని ప్రసన్నం చేసుకోవడానికి కొందరు నవరాత్రుల్లో ఉపవాసం ఉంటారు. అయితే  చాలా సార్లు కొంతమంది అనుకోని పరిస్థులు ఎదురైనప్పుడు తప్పని సరి పరిస్థితుల్లోనో ఉపవాసాన్ని విరమిస్తారు. అప్పుడు తమ ఉపవాస దీక్ష భగ్నం అయిందని కొంతమంది తీవ్రంగా బాధపడతారు. మీరు నవరాత్రులలో  దుర్గాదేవికి ఉపవాసం ఉండి, పొరపాటున దానిని భగ్నం చేసినట్లయితే.. మీరు పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.  ఉపవాస దీక్షను అనుకోని పరిస్థితుల్లో విరమించినట్లు అయితే దానికి కొన్ని పరిహారాలున్నాయి. అవి ఏమిటో ఈరోజు తెలుసుకుందాం..

పాటించాల్సిన నివారణ చర్యలు:

  1.  అమ్మవారి అనుగ్రహం కోసం మీరు నవరాత్రి రోజుల్లో 9 రోజులు ఉపవాస దీక్షను చేపట్టినట్లు అయితే..  ఏదైనా కారణం వల్ల మీ ఉపవాసం పొరపాటున విచ్ఛిన్నమైతే.. ఆందోళన చెందకండి. అలాంటి అనుకోని సంఘటనలు జరిగితే.. మీరు వెంటనే అమ్మవారి ముందు చేతులు జోడించి మన్నించమని కోరుతూ.. క్షమాపణ చెప్పండి.
  2. నవరాత్రి ఉపవాసం పొరపాటున విడిచి పెట్టాల్సి వస్తే.. మీరు ఇంట్లో దేవీదేవతలకు హవనం చేయాలి. అదే సమయంలో క్షమించమని అడగండి.
  3. ఇవి కూడా చదవండి
  4. ఇలా హవనం చేయడం వలన ఉపవాస దీక్ష విరించిన తర్వాత ఏర్పడే దోషాలు తొలగిపోతాయని చెబుతారు. దీనితో పాటు.. హవన చేయడం ద్వారా మీ ఉపవాసం కూడా సంపూర్ణంగా పరిగణించబడుతుంది.
  5. ఉపవాసం విరమించిన తరువాత, మీరు పూజా మందిరంలో అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్టించవచ్చు. అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్టించిన తర్వాత పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదార కలిపి పంచామృతం చేసి.. ఆ పంచామృతంతో స్నానం చేయించండి.
  6. నవరాత్రి రోజున ఉపవాసం విరమించే సమయంలో మీరు అమ్మవారి ముందు వెళ్లి దుర్గాదేవీకి సంబంధించిన ప్రత్యేక మంత్రాలతో, హారతితో పూజించాలి. ఇది దుర్గ మాతను సంతోషపరుస్తుంది. ఇలా చేయడం వల్ల ఉపవాసం విరమించిన దోషం ఉండదని అంటారు.
  7. మీరు అనుకోకుండా ఉపవాసం విరమించినట్లయితే  చింతించకండి. అందుకు బదులుగా పూజారి వద్దకు వెళ్లి పరిహారం గురించి అడగండి. అప్పుడు అతని సలహా ప్రకారం అమ్మవారిని ప్రసన్నం చేసుకునేలా దాన ధర్మాలు చేయండి.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

(ఇక్కడ ఇచ్చినవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం).