Navaratri 2022: నేటికీ కన్నయ్య కోసం ఎదురు చూస్తున్న రాధ స్నేహితురాలు చంద్ర.. ఈ ఆలయానికి వెళ్లాలంటే అమ్మ అనుమతి ఇవ్వాల్సిందే..

కృష్ణుడు నడయాడిన నేలలో రహస్యమైన,  పురాతనమైన ఆలయం ఉంది. ఈ ఆలయాన్ని చూడటానికి విదేశాల నుండి ప్రజలు వస్తారు. ఈ ఆలయాన్ని  సందర్శించడానికి అమ్మవారి అనుమతి అవసరం అట..

Navaratri 2022: నేటికీ కన్నయ్య కోసం ఎదురు చూస్తున్న రాధ స్నేహితురాలు చంద్ర.. ఈ ఆలయానికి వెళ్లాలంటే అమ్మ అనుమతి ఇవ్వాల్సిందే..
Chandrawali Mandir
Follow us
Surya Kala

|

Updated on: Sep 29, 2022 | 2:24 PM

Navaratri Special Chandravali Devi Temple: శరన్నవరాత్రుల్లో నేడు నాలుగో రోజు. నవరాత్రులలో నాల్గవ రోజున అమ్మవారిని కూష్మాండదేవి రూపంలో పూజించాలని పురాణాల్లో పేర్కొన్నారు. “కు” అంటే చిన్న, “ఊష్మ” అంటే శక్తి, “అండా” అంటే విశ్వం. తన శక్తితో ఈ విశ్వాన్ని సృష్టించింది అని అర్ధం. అమ్మవారు సింహం మీద స్వారీ చేస్తూ, ఎనిమిది చేతులతో ఏడు ఘోరమైన ఆయుధాలను కలిగి, ఒక జపమాలను కలిగి ఉంటుంది. ఈరోజు కూష్మాండదేవి రూపంలో అమ్మవారిని పూజిస్తే ఆరోగ్యం, ఐశ్వర్యం, శక్తీ లభిస్తాయని భక్తుల విశ్వాసం. ఈరోజు బృందావనంలోని అతిపురాతన ఆలయం గురించి తెలుసుకుందాం..

కృష్ణుడు నడయాడిన నేలలో రహస్యమైన,  పురాతనమైన ఆలయం ఉంది. ఈ ఆలయాన్ని చూడటానికి విదేశాల నుండి ప్రజలు వస్తారు. ఈ ఆలయాన్ని  సందర్శించడానికి అమ్మవారి అనుమతి అవసరం అట.. అమ్మవారి అనుమతి లేనిదే ఈ ఆలయాన్ని సందర్శించలేరని నమ్మకం.

మథురలోని మహావన ప్రాంతంలో యమునా నది సమీపంలో 5000 సంవత్సరాల నాటి చంద్రావళి దేవి ఆలయం ఉంది . ఈ ఆలయ కథ ద్వాపర యుగానికి సంబంధించినది. ద్వాపర యుగంలో రాధా రాణికి చాలా మంది స్నేహితులు ఉండేవారని నమ్ముతారు. ఆ స్నేహితుల్లో అత్యంత ప్రీతిపాత్రుడు చంద అనే స్నేహితురాలు. ఆమె రాధా రాణికి ఇష్టమైనది. శ్రీకృష్ణుడు గోకులానికి రావాలని పట్టుబట్టేవారు. అప్పుడు శ్రీకృష్ణుడు తన తండ్రి నందుడిని కలవడానికి రాధా రాణి, ఆమె స్నేహితులను తీసుకువచ్చాడు. కొంతదూరం నడిచిన అనంతరం గోకులం దగ్గర చంద అలసిపోయి శ్రీకృష్ణుడిని ఆపమని కోరింది.

ఇవి కూడా చదవండి

మర్రిచెట్టు కింద కూర్చుని భక్తులకు దర్శనం ఇస్తున్న అమ్మవారు: తన తండ్రి నందుడిని ఇక్కడే కలిసేలా చేస్తాను. నువ్వు ఇక్కడే విశ్రాంతి తీసుకో అని శ్రీ కృష్ణుడు చెప్పాడు. చంద మర్రి చెట్టు దగ్గర ఆగి, శ్రీ కృష్ణుడి కోసం వేచి చూస్తుంది. అక్కడ చంద్రావళి మాత ఆలయం ఉంది. ఆమె చంద్రావళి అమ్మవారిగా ప్రసిద్ధి చెందింది. అమ్మవారు శ్రీ కృష్ణ భగవానుని కోసం వేచి ఉంటారని..  మర్రి చెట్టు క్రింద కూర్చుని భక్తులకు దర్శనం ఇస్తుందని భక్తుల నమ్మకం.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: (ఇక్కడ ఇచ్చినవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)