Garuda Seva: గరుడసేవకు వెళ్లే భక్తులకు అలెర్ట్.. ఆర్టీసీ ప్రత్యేక సేవలు.. కొండపైకి బైక్స్ కు నో ఎంట్రీ..

శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో అయిదో రోజు మలయప్ప స్వామి ఉదయం మోహినీ అవతారంలో దర్శనమిస్తారు. ఉదయం 8 నుండి 10 గంటల వ‌ర‌కు మోహినీ అవతారంలో భక్తులకు దర్శనం ఇస్తారు. రాత్రి 7 నుండి గరుడ వాహనలో స్వామివారు తిరు మాడ వీధుల్లో విహరిస్తారు. వెలకట్టలేనన్ని ఆభరణాలు ధరించి గరుడ వాహనంలోనూ ఊరేగుతూ భక్తులకు దర్శనిమస్తారు.

Garuda Seva: గరుడసేవకు వెళ్లే భక్తులకు అలెర్ట్.. ఆర్టీసీ ప్రత్యేక సేవలు.. కొండపైకి బైక్స్ కు నో ఎంట్రీ..
Garuda Seva
Follow us

|

Updated on: Sep 30, 2022 | 4:44 PM

Garuda Seva: అఖిలాండ కోటి బ్రహ్మాండనాయకుడైన శ్రీ వెంకటేశ్వర స్వామికి  సాలకట్ల బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల సందర్భంగా మలయప్ప స్వామీ ఇరువురి దేవేరులతో కలిసి పలు వాహనాలపై  తిరుమాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనం ఇస్తున్నారు. తొమ్మిదిరోజుల పాటు జరిగే ఈ బ్రహ్మోత్సవాల్లో గరుడ వాహన సేవకు విశిష్ట స్థానం ఉంది. తిరుమల తిరుపతిలో సృష్టి కర్త బ్రహ్మ స్వయంగా మొదలు పెట్టిన బ్రహ్మోత్సవాలకు ముక్కోటి దేవతలను గరుత్మంతుడు ఆహ్వానిస్తాడని నమ్మకం. కనుక బ్రహ్మ్మోత్సవాల్లో గరుడ వాహన సేవకు విశిష్ట స్థానం ఉంది. అంతేకాదు.. గరుడ వాహనంపై విహరించే ఉత్సవమూర్తికి విలకట్టలేనని ఆభరణాలైన.. మకరకంఠి, సహాస్రనామ మాల, లక్ష్మీహారాలను అలంకరిస్తారు. ఈ నేపథ్యంలో గరుడవాహన సేవ రోజున తెలుగు రాష్ట్రల నుంచి మాత్రమే కాదు దేశవిదేశాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు తిరుమల గిరికి చేరుకుంటారు. దీంతో భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా పోలీసులు, టీటీడీ సిబ్బంది ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో అయిదో రోజు మలయప్ప స్వామి ఉదయం మోహినీ అవతారంలో దర్శనమిస్తారు. ఉదయం 8 నుండి 10 గంటల వ‌ర‌కు మోహినీ అవతారంలో భక్తులకు దర్శనం ఇస్తారు. రాత్రి 7 నుండి గరుడ వాహనలో స్వామివారు తిరు మాడ వీధుల్లో విహరిస్తారు. వెలకట్టలేనన్ని ఆభరణాలు ధరించి గరుడ వాహనంలోనూ ఊరేగుతూ భక్తులకు దర్శనిమస్తారు. సమస్త వాహనాలలో సర్వశ్రేష్ఠమైంది గరుడవాహనం. గరుడ వాహనంపై ఊరేగే స్వామి వారిని దర్శించుకుంటే.. ఈతి బాధల నుంచి ఉపశమనం లభిస్తుందని విశ్వాసం. ఈ వాహన సేవల్లో పాల్గొనే భక్తులు శ్రీవారి కృపాకటాక్షాలకు పాత్రులవుతారని, సకల పాపాలు తొలగిపోతాయని, జ్ఞానం లభిస్తుందని భక్తుల నమ్మకం.

గరుడసేవ ఏర్పాట్లను పరిశీలించిన డీఐజీ రవి ప్రకాశ్

ఇవి కూడా చదవండి

అక్టోబర్ 1వ తేదీ శనివారం రోజున గరుడసేవ జరగనుంది. దీంతో గరుడవాహన సేవకు భారీ బందోబస్తును ఏర్పాటు చేసినట్లు డీఐజీ రవి ప్రకాశ్ చెప్పారు. అంతేకాదు ఏర్పాట్లను స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా డీఐజీ రవి ప్రకాష్ మాట్లాడుతూ.. తాము గరుడ సేవకు సుమారు 4 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నాంమని .. భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపడుతున్నామని పేర్కొన్నారు. ఇప్పటికే 5 అంచెల భద్రత ఏర్పాటు చేశామని చెప్పారు. ఇతర రాష్ట్రాల నుండి వచ్చే భక్తులు మార్గమధ్యంలో వెహికల్ పాసులు తీసుకోవాలని సూచించారు. తిరుపతికి వచ్చే 9 రోడ్లలో వెహికల్ పాసులను ఉచితంగా అందిస్తున్నామని పేర్కొన్నారు. మాడ వీధల్లో 1.80 లక్షల మంది భక్తులు వాహనసేవలను వీక్షించవచ్చని.. గరుడ వాహనం వీక్షించిన భక్తులు బయటకు రాగానే మిగిలిన భక్తులను మాడ వీధుల్లోకి పంపుతామని తెలిపారు. భారీ సంఖ్యలో భక్తులు రానున్న నేపథ్యంలో ఎటువంటి ఉగ్రవాద, అంసాఘిక కార్యకలాపాలు జరగకుండా ఆక్టోపస్, గ్రేహౌండ్స్ తో ప్రత్యేక నిఘా పెట్టామని తెలిపారు. భక్తులందరూ సహనంతో నిబంధనలు పాటిస్తే ఎలాంటి ఇబ్బందులు ఉండవన్నారు డీఐజీ రవి ప్రకాశ్.

ఆర్టీసీ ప్రత్యేక సేవలు:

తిరుమల శ్రీవారి గరుడసేవ రోజు యాత్రికులకు సేవలందించేందుకు ఆర్టీసీ సిద్ధమైంది. బ్రహ్మోత్సవాల్లో రోజూ నిమిషానికో బస్సు నడిపిన ఆర్టీసీ.. రేపు గరుడసేవ రోజు నిమిషానికి రెండు ఆర్టీసీ సర్వీసులను భక్తులకు అందుబాటులోకి తీసుకుని రానున్నది. ఎలక్ట్రిక్ బస్సులతో కలిపి తిరుమల ఘాట్ రోడ్ లో 5044 ట్రిప్పులతో 2 లక్షల మంది భక్తుల రాకపోకల టార్గెట్ గా ఆర్టీసీ సిద్ధమయింది. ఈ మేరకు తిరుపతిలో 13 చోట్ల టికెట్ కౌంటర్లు ఏర్పాటు చేసింది.

శ్రీ‌వారి గ‌రుడ‌సేవ‌కు ద్విచ‌క్ర‌వాహ‌నాలకు నో ఎంట్రీ:

శ్రీ‌వారి సాల‌క‌ట్ల బ్ర‌హ్మోత్స‌వాల్లో భాగంగా అక్టోబ‌రు 1న శ‌నివారం గ‌రుడ సేవ సంద‌ర్భంగా ద్విచ‌క్ర‌వాహ‌నాలను కొండమీదకు అనుమ‌తించ‌బ‌డ‌వని టీటీడీ ఏ పేర్కొంది. భ‌క్తుల భ‌ద్ర‌త దృష్ట్యా ఈరోజు మ‌ధ్యాహ్నం 12 గంట‌ల నుండి అక్టోబ‌రు 2వ తేదీ మ‌ధ్యాహ్నం 12 గంట‌ల వ‌ర‌కు తిరుమ‌ల ఘాట్ రోడ్ల‌ల్లో ద్విచ‌క్ర వాహ‌నాల‌ను టీటీడీ అనుమ‌తించ‌దు. కావున ఈ విష‌యాన్ని భ‌క్తులు గ‌మ‌నించి టీటీడీకి స‌హ‌క‌రించాల‌ని విజ్ఞ‌ప్తి చేస్తోంది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి..