Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dancing Dadi Video: ఈ వయస్సులో మీరు ఇలా డ్యాన్స్ చేయగలరా..? ఈ బామ్మ జోష్‌కు మీరు అవుతారు ఫ్యాన్స్

ఈ 'బామ్మ'ని 'డ్యాన్సింగ్ డాడీ' అని కూడా అంటారు. ఆమె తరచుగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో తన డ్యాన్స్‌కి సంబంధించిన వీడియోలను షేర్ చేస్తారు. 63 ఏళ్ల అమ్మమ్మ పేరు రవి బాల శర్మ.

Dancing Dadi Video: ఈ వయస్సులో మీరు ఇలా డ్యాన్స్ చేయగలరా..? ఈ బామ్మ జోష్‌కు మీరు అవుతారు ఫ్యాన్స్
Old Woman Dace Video Viral
Follow us
Surya Kala

|

Updated on: Sep 30, 2022 | 7:22 PM

వయస్సు కేవలం సంఖ్య మాత్రమే.. అంతకు మించి ఏమీ లేదని అంటారు. మనస్ఫూర్తిగా ఏదైనా చేయాలనే సంకల్పం ఉన్న వ్యక్తులు వయసు, పరిస్థితులు వంటి వాటిని లెక్క చేయరు.. తాము అనుకున్న దానిని సాధిస్తారు. అందుకు వృద్ధాప్యం కూడా మినహాయింపు కాదు. వయసు తో సంబంధం లేకుండా చదువుకునే వారున్నారు.. బిజినెస్ స్టార్ట్ చేసి చరిత్ర సృష్టించిన వారు కూడా ఉన్నారు.. ఇక తమ ప్రతిభను ప్రదర్శిస్తున్న వృద్ధుల వీడియోలు అయితే సోషల్ మీడియాలో కోకొల్లలు. మరికొందరు వివిధ రకాల ప్రపంచ రికార్డులను సృష్టిస్తూనే ఉన్నారు. కొందరు తమ గానం లేదా నృత్యంతో అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. సోషల్ మీడియాలో దీనికి సంబంధించిన వీడియోలన్నీ తరచూ వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం అలాంటి వీడియో ఒకటి వైరల్ అవుతోంది. అందులో ఒక ‘బామ్మగారు’ అద్భుతమైన నృత్యం చేశారు. అనేక మంది నెటిజన్లను తన అభిమానులుగా మార్చుకున్నారు.

ఈ ‘బామ్మ’ని ‘డ్యాన్సింగ్ డాడీ’ అని కూడా అంటారు. ఆమె తరచుగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో తన డ్యాన్స్‌కి సంబంధించిన వీడియోలను షేర్ చేస్తారు. 63 ఏళ్ల అమ్మమ్మ పేరు రవి బాల శర్మ. చాలా మందికి నడవడానికి కూడా ఇబ్బండి పడే ఈ వయసులో ఈ బామ్మ ఎంతో అద్భుతంగా డ్యాన్స్ చేస్తారు. బామ్మగారి డ్యాన్స్ కు నెటిజన్లు ఫిదా.. ప్రస్తుతం, వైరల్ అవుతున్న ఆమె డ్యాన్స్ వీడియోలో..  రణబీర్ కపూర్ , అలియా భట్ సూపర్ హిట్ సాంగ్ ‘కేసరియా తేరా ఇష్క్ హై పియా’కు  డ్యాన్స్ చేశారు. ఈ సాంగ్ఇటీవల విడుదలైన ‘బ్రహ్మాస్త్ర’ చిత్రంలోనిది. ఈ పాటకు శాస్త్రీయ శైలిలో అద్భుతంగా డ్యాన్స్ చేశారు.

ఇవి కూడా చదవండి

బామ్మగారి డ్యాన్స్ పై ఓ లుక్ వేయండి:

‘డ్యాన్సింగ్ డాడీ’ స్వయంగా తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఈ అద్భుతమైన డ్యాన్స్ వీడియోను షేర్ చేసింది. ఇప్పటివరకు 1 లక్షా 87 వేలకు పైగా వీక్షించారు. 16 వేల మందికి పైగా లైక్ చేసారు.

అదే సమయంలో, వీడియో చూసిన తర్వాత ప్రజలు వివిధ రకాల కామెంట్స్ చేశారు.  మేము కూడా మీ మీద మనసు పాడేసుకున్నాం అని కొందరు అంటుంటే, ‘ఆమె అస్సలు బామ్మగా కనిపించడం లేదు.. చాలా యంగ్ గా ఉన్నారు అని కొందరు అంటున్నారు. అదేవిధంగా, చాలా మంది వినియోగదారులు డాడీ నృత్యంపై ప్రశంసల వర్షం కురిపించారు.

మరిన్నిట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..