AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నేను వస్తానంటూ తల్లితో మారం చేస్తున్న పిల్ల ఏనుగు.. వీడియో చూస్తే ఫిదా అవుతారు

పిల్ల ఏనుగులు చేసే కొన్ని తమాషా చిలిపి చేష్టలు హృదయాలను హత్తుకునేలా ఉంటాయి. ఏనుగు పిల్ల చేసిన వింత, చిలిపి చేష్టలకు సంబంధించిన వీడియోలు తరచుగా ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్నాయి.

నేను వస్తానంటూ తల్లితో మారం చేస్తున్న పిల్ల ఏనుగు.. వీడియో చూస్తే ఫిదా అవుతారు
Elephant
Jyothi Gadda
|

Updated on: Sep 30, 2022 | 8:07 PM

Share

సోషల్ మీడియాలో ఎన్నో రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. కొన్ని వీడియోలు షాకంగ్ గా ఉంటాయి. మరికొన్ని ఆశ్చర్యపోయేలా ఉంటాయి. ఇంకొన్ని వీడియోలు జనాల్ని ఆలోచింపజేస్తాయి. ముఖ్యంగా జంతువులకు సంబంధించిన వీడియోలు ఎక్కువగా ఫన్నీ సన్నివేశాలకు సంబంధించినవే ఉంటాయి. అలాంటి వాటినే నెటిజన్లు ఎక్కువగా చూసి ఆనందిస్తుంటారు. పిల్లలు సైతం ఏనుగులు, కోతులు, జీబ్రాలు, కుందేళ్లు వంటి కొన్ని రకాల జంతువుల వీడియోలను ఎక్కువగా ఇష్టపడుతుంటారు. ఇక జంతువులు సైతం అప్పుడప్పుడు మనుషుల్ని పోలిన పనులు చేస్తూ నెటిజన్లను మరింత అవాక్కయ్యేలా చేస్తుంటాయి. అలాంటి వాటిల్లో కోతులు, డాల్ఫిన్లు వంటి ఇతర జంతువుల మాదిరిగా కాకుండా, ఏనుగులు అసాధారణంగా తెలివైన జీవులు. ఏనుగులు మనుషుల మాదిరిగానే ఆలోచనలు, లోతైన భావాలు, భావోద్వేగాలను కలిగి ఉంటాయి. అలాంటప్పుడు పిల్ల ఏనుగులను చూడటం నిజంగా ఓ ఆనందకరమైన అనుభవం. నిద్రపోతున్నా, స్నానం చేసినా, తిన్నా, ఆడుకుంటున్నా.. నిల్చోకుండా అక్కడక్కడా పరిగెడుతూ ఉండే పిల్ల ఏనుగులు చూడముచ్చటగా ఉంటాయి.

పిల్ల ఏనుగులు చేసే కొన్ని తమాషా చిలిపి చేష్టలు హృదయాలను హత్తుకునేలా ఉంటాయి. ఏనుగు పిల్ల చేసిన వింత, చిలిపి చేష్టలకు సంబంధించిన వీడియోలు తరచుగా ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్నాయి. ఏనుగు చర్యలు నెటిజన్ల మనస్సులను తేలికపరుస్తాయి. అవి చూడటానికి సరదాగా ఉంటాయి. కొన్నిసార్లు వింతగా ప్రవర్తిస్తుంటాయి. ఆ విధంగా తల్లిని ఆటపట్టించే ఓ పిల్ల ఏనుగు వీడియో ఇది. ఇక్కడ చిన్న పిల్లాడిలా తల్లిని ప్రేమించే ఏనుగు వీడియో ఒకటి వైరల్ అవుతోంది. ఈ వీడియో అటవీ ప్రాంతంలో తీసినట్లుగా తెలుస్తోంది. అందులో ఓ పిల్ల ఏనుగు పిల్లాడిలా రోడ్డుపై దొర్లుతూ తిరుగుతోంది. అమ్మ ఆహారం సేకరణ కోసం వెళ్తుంటే..నేను వెంట వస్తానంటూ వెంటపడుతున్నట్టుగా అనిపించింది ఈ వీడియో.

ఇవి కూడా చదవండి

వీడియోలో, ఒక పిల్ల ఏనుగు అల్లరి చేయడం చూడవచ్చు, కానీ తల్లికి దానిని శాంతింపజేసే ఉద్దేశ్యం లేదని తెలుస్తోంది. ఈ వీడియోను ఐఎఫ్‌ఎస్ అధికారి సుశాంత నందా ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు. ఇంత క్యూట్‌గా ఉన్న ఈ వీడియోకు 30.3k వీక్షణలు, వేల సంఖ్యలోలు లైక్‌లు వచ్చాయి. ఏనుగు పిల్ల చిన్న పిల్లవాడిలా ప్రవర్తిస్తుందంటూ నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. నెటిజన్లు పిల్ల ఏనుగు చేసిన అల్లరి చేష్టలను ఆస్వాదిస్తూ కామెంట్స్ పోస్ట్ చేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం. ..ఇక్కడ క్లిక్ చేయండి