Unique Love: హిందూ మతాన్ని స్వీకరించి మరీ తాను ప్రేమించిన మహిళను పెళ్లి చేసుకున్న వ్యక్తి.. ఎక్కడంటే..

తాము ప్రేమించిన వ్యక్తుల చేయి అందుకుని జీవితాంతం సంతోషంగా గడపడం కోసం ఎల్లలు దాటి.. సొంత ఊళ్లను.. సొంత దేశాన్నీ వదులుతున్న యువతీయువకుల గురించి తరచుగా వార్తలు వింటూనే ఉన్నాం.. తాజాగా ఓ వ్యక్తి తాను ప్రేమించిన మహిళను పెళ్లి చేసుకోవడం కోసం ఏకంగా తన మతాన్నీ విడిచి పెట్టాడు.. ఈ ఘటన మధ్రప్రదేశ్ లో చోటు చేసుకుంది.

Unique Love: హిందూ మతాన్ని స్వీకరించి మరీ తాను ప్రేమించిన మహిళను పెళ్లి చేసుకున్న వ్యక్తి.. ఎక్కడంటే..
Unique Marriage In Mp
Follow us
Surya Kala

|

Updated on: Oct 02, 2022 | 6:02 PM

సృష్టిలో తియ్యనిది ప్రేమ.. ప్రేమ గురించి ఎంత చెప్పినా ఎన్నిసార్లు  చెప్పినా తక్కువే..ఇంకా ఉందేమో అనిపిస్తుంది.. ప్రేమ గురించి కవులు, కథకులు తమదైన శైలిలో వర్ణిస్తూనే ఉన్నారు. ప్రేమ జాతి, మతం, ఆస్తులు, అంతస్తులు వయసు బేధం చూసుకోదు. ప్రపంచంలో ప్రేమని తెలియజేస్తూ.. వచ్చిన సినిమాలు, సీరియల్స్ అన్నీ సూపర్ హిట్ గానే నిలిచాయి. అంత పవర్ ప్రేమకు ఉంది. తాము ప్రేమించిన వ్యక్తుల చేయి అందుకుని జీవితాంతం సంతోషంగా గడపడం కోసం ఎల్లలు దాటి.. సొంత ఊళ్లను.. సొంత దేశాన్నీ వదులుతున్న యువతీయువకుల గురించి తరచుగా వార్తలు వింటూనే ఉన్నాం.. తాజాగా ఓ వ్యక్తి తాను ప్రేమించిన మహిళను పెళ్లి చేసుకోవడం కోసం ఏకంగా తన మతాన్నీ విడిచి పెట్టాడు.. ఈ ఘటన మధ్రప్రదేశ్ లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..

మధ్యప్రదేశ్‌లో ఓ వ్యక్తి తన మతాన్ని మార్చుకొని హిందూ పద్ధతుల్లో మహిళను వివాహం చేసుకున్నాడు. తన పేరును సైతం మార్చుకున్నాడు. ఉజ్జయినికి చెందిన మహ్మద్‌ నిసార్‌కు.. ఎనిమిదేళ్ల క్రితం రాణి కాయస్థతో పరిచయం ఏర్పడింది. ఇరువురూ క్రమంగా ప్రేమలో పడ్డారు. వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. తొలి నుంచీ మహ్మద్‌ నిసార్‌కు హిందూ ఆచారాల పట్ల ఆసక్తి ఉండేది. ఈ క్రమంలోనే హిందూ మతాన్ని స్వీకరించాడు.

Unique Marriage In Mp 1

Unique Marriage In Mp

ఇవి కూడా చదవండి

వేదమంత్రాల మధ్య మత మార్పిడి కార్యక్రమం నిర్వహించారు. అనంతరం పండితులు మహ్మద్‌ నిసార్‌ పేరును సోనూ సింగ్‌గా మార్చారు. ఆ తర్వాత ప్రియురాలిని వివాహం చేసుకున్నాడు. భవిష్యత్‌లోనూ హిందువుగా కొనసాగుతానని స్పష్టం చేశాడు. మందసౌర్‌లో ఇలాంటి ఘటన జరగడం ఇది నాలుగో సారి. ఇక్కడ మొత్తం నలుగురు వ్యక్తులు హిందూ మతంలోకి మారారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

సమంత పై కీర్తిసురేష్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..
సమంత పై కీర్తిసురేష్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..
'ఢిల్లీ సీఎం అతిషిని అరెస్టు చేయవచ్చు.. ': అరవింద్ కేజ్రీవాల్
'ఢిల్లీ సీఎం అతిషిని అరెస్టు చేయవచ్చు.. ': అరవింద్ కేజ్రీవాల్
ఇలాంటి డైట్ తీసుకుంటే లివర్ కడిగినట్లు శుభ్ర పడుతుంది..
ఇలాంటి డైట్ తీసుకుంటే లివర్ కడిగినట్లు శుభ్ర పడుతుంది..
ఏపీని వీడని వానలు.. వచ్చే 3 రోజులు ఈ ప్రాంతాల్లో వర్షాలే వర్షాలు.
ఏపీని వీడని వానలు.. వచ్చే 3 రోజులు ఈ ప్రాంతాల్లో వర్షాలే వర్షాలు.
సంధ్య థియేటర్‌ ఘటనపై ఫేక్‌ పోస్ట్‌లు పెడితే ఊరుకునేది లేదు..
సంధ్య థియేటర్‌ ఘటనపై ఫేక్‌ పోస్ట్‌లు పెడితే ఊరుకునేది లేదు..
చిన్న పరిశ్రమల్లో ఊపందుకున్న ఉపాధి అవకాశాలు.. ఏడాదిలో కోటి జాబ్స్
చిన్న పరిశ్రమల్లో ఊపందుకున్న ఉపాధి అవకాశాలు.. ఏడాదిలో కోటి జాబ్స్
హైదరాబాద్ కు చెందిన శ్రేయాస్‌కు కుంభ మేళా ప్రకటనల హక్కులు..
హైదరాబాద్ కు చెందిన శ్రేయాస్‌కు కుంభ మేళా ప్రకటనల హక్కులు..
అయ్యో స్వప్నా ఎంత పని చేశావు.. తాతయ్య బిల్ కోసం కావ్య కష్టాలు!
అయ్యో స్వప్నా ఎంత పని చేశావు.. తాతయ్య బిల్ కోసం కావ్య కష్టాలు!
అంతరిక్షంలో సునీతా విలియమ్స్ క్రిస్మస్ వేడుకలు..!
అంతరిక్షంలో సునీతా విలియమ్స్ క్రిస్మస్ వేడుకలు..!
ప్రార్థనలు ఫలించాయి.. శివన్న ఆపరేషన్ సక్సెస్..
ప్రార్థనలు ఫలించాయి.. శివన్న ఆపరేషన్ సక్సెస్..