PM in Gujarat: తాను వెళ్తున్న మార్గంలో అంబులెన్స్ ను గుర్తించిన ప్రధాని మోడీ .. కాన్వాయ్ ఆపి మరీ దారి

తాను వెళ్తున్న మార్గంలో వెళ్తున్న అంబులెన్స్ కు దారి ఇవ్వడానికి ప్రధాని మోడీ కాన్వాయ్ ఆగిపోయింది. ఇందుకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. 

PM in Gujarat: తాను వెళ్తున్న మార్గంలో అంబులెన్స్ ను గుర్తించిన ప్రధాని మోడీ .. కాన్వాయ్ ఆపి మరీ దారి
Pm Modi Stops Convoy
Follow us

|

Updated on: Sep 30, 2022 | 6:04 PM

మనదేశంలోనే కాదు.. ప్రపంచంలో ఎక్కడ ఏ రోడ్డుమీద అంబులెన్స్‌ సైరెన్ వినిపించినా ఒక ప్రాణాన్ని నిలబెట్టడానికి ప్రయత్నిస్తోందని అర్ధం.. అందుకనే అంబులెన్స్ సైరెన్ వినిపిస్తే చాలు.. రహదారి మీద వాహనాలు పక్కకు తప్పుకుని దారి ఇస్తాయి. తాను కూడా అందుకు మినహాయింపు కాదని నిరూపించారు ప్రధాని మోడీ.. తాను వెళ్తున్న మార్గంలో వెళ్తున్న అంబులెన్స్ కు దారి ఇవ్వడానికి ప్రధాని మోడీ కాన్వాయ్ ఆగిపోయింది. ఇందుకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.  ఈ ఘటన ప్రధాని గుజరాత్ పర్యటన సందర్భంగా చోటు చేసుకుంది.

గుజరాత్ లోని “అహ్మదాబాద్ నుండి గాంధీనగర్‌కు వెళ్లే మార్గంలో.. అంబులెన్స్‌కు దారి ఇవ్వడానికి ప్రధాని మోడీ మోడీ కాన్వాయ్  ఆగిపోయింది”. ఈ విషయాన్నీ గుజరాత్ బీజేపీ ఒక ప్రకటనలో తెలిపింది. తాము వెళ్తున్న మార్గంలో మార్గంలో అంబులెన్స్‌ వెళ్తుండడం గమనించిన ప్రధాని నరేంద్ర మోడీ  శుక్రవారం తన కాన్వాయ్‌ను ఆపాలని ఆదేశించారు.

ఇవి కూడా చదవండి

ప్రధాని ప్రస్తుతం తన సొంత రాష్ట్రం గుజరాత్‌లో రెండు రోజుల పర్యటనలో ఉన్నారు. బీజేపీ అధికార ప్రతినిధి డాక్టర్ రుత్విజ్ పటేల్ ‘మోదీ హయాంలో వీఐపీ కల్చర్ లేదు’ అంటూ ప్రధాని కాన్వాయ్‌ను ఆపుతున్న వీడియోను ట్వీట్ చేశారు.

మధ్యాహ్నం అహ్మదాబాద్‌లోని దూరదర్శన్ సెంటర్ దగ్గర తన బహిరంగ ర్యాలీని ముగించుకుని గాంధీనగర్‌లోని రాజ్‌భవన్‌కు మోడీ వెళుతుండగా ఈ ఘటన జరిగింది. గుజరాత్ పర్యటనలో రెండవ రోజు ప్రధాని బిజిబిజీ గా గడిపారు. ప్రధాని మోడీ గాంధీనగర్-ముంబై వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలును జెండా ఊపి ప్రారంభించార. అంతేకాదు అహ్మదాబాద్ మెట్రో రైలు ప్రాజెక్ట్ మొదటి దశను కూడా ప్రారంభించారు. సాయంత్రం బనస్కాంత జిల్లాకు వచ్చిన ప్రధాని బహిరంగ సభలో ప్రసంగించారు. సాయంత్రం ప్రసిద్ధ అంబాజీ ఆలయంలో హారతిని ప్రధాని ఇవ్వనున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..