Delhi News: దేవుడు కలలో చెప్పాడని ఆరేళ్ల చిన్నారి గొంతు కోసి చంపిన దుండగులు ..

దేవుడు చెప్పినట్లు మాత్రమే చేశామని.. తమ కలలో దేవుడు వచ్చాడని..  చిన్నారి మెడ నరికివేయమని తమకు చెప్పాడని నిందితులు చెప్పారు. ఇలా చేయడం మీకు మేలు చేస్తుందని దేవుడు చెప్పడంతో తాము దేవుడి ఆజ్ఞను పాటించినట్లు పేర్కొన్నారు. 

Delhi News: దేవుడు కలలో చెప్పాడని ఆరేళ్ల చిన్నారి గొంతు కోసి చంపిన దుండగులు ..
Delhi Police
Follow us
Surya Kala

|

Updated on: Oct 02, 2022 | 5:02 PM

ఢిల్లీలోని లోధీ కాలనీలో శనివారం అర్థరాత్రి షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఇందులో ఇద్దరు యువకులు కలిసి ఆరేళ్ల చిన్నారి గొంతు కోసి హత్య చేశారు. తాము ఇలా చేయడానికి చెప్పిన రీజన్ అందరికీ షాక్ ఇచ్చింది. ఎందుకంటే తమను అలా చేయమని దేవుడు కోరాడని నిందితులు పేర్కొన్నారు. దేవుడు కలలో వచ్చి ఇలా చేయమని కోరాడని చెప్పాడన్నారు. ఈ ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులిద్దరూ కతిహార్‌కు చెందిన విజయ్‌కుమార్‌గా, బీహార్‌లోని సహర్సాకు చెందిన అమర్‌కుమార్‌గా పోలీసులు గుర్తించారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిందితులిద్దరూ సీఆర్పీఎఫ్ హెడ్ క్వార్టర్స్‌లో కార్మికులుగా పనిచేస్తున్నారు. ఇక్కడే చనిపోయిన చిన్నారి తండ్రి కూడా పని చేసేవాడు. చిన్నారి హత్య విచారణలో పోలీసులకు షాకింగ్ విషయాలు తెలిశాయి. పోలీసుల విచారణలో మృతుడి  చిన్నారితో కానీ, అతని కుటుంబ సభ్యులతోగానీ తమకు ఎలాంటి శత్రుత్వం లేదని నిందితులు తెలిపారు. దేవుడు చెప్పినట్లు మాత్రమే చేశామని.. తమ కలలో దేవుడు వచ్చాడని..  చిన్నారి మెడ నరికివేయమని తమకు చెప్పాడని నిందితులు చెప్పారు. ఇలా చేయడం మీకు మేలు చేస్తుందని దేవుడు చెప్పడంతో తాము దేవుడి ఆజ్ఞను పాటించినట్లు పేర్కొన్నారు.  దేవుని ఆజ్ఞలను పాటించడానికి బిడ్డ కోసం వెతకగా.. తమను చిన్నారి కనిపించిందని.. అప్పుడు బాలికను పిలిచి క్షణికావేశంలో గొంతు కోసినట్లు చెప్పారు. చిన్నారి అరుపులు విన్న ఇరుగుపొరుగు వారు ఘటనా స్థలానికి చేరుకుని నిందితులను పట్టుకుని పోలీసులకు సమాచారం అందించారు. ఆ తర్వాత పోలీసులు వారిని అరెస్ట్ చేశారు.

ఈ ఘటన గురించి శనివారం అర్థరాత్రి, సీఆర్‌పీఎఫ్‌ ప్రధాన కార్యాలయం నిర్మాణంలో ఉన్న భవనం సెక్యూరిటీ అధికారి ఫోన్‌  తమకు సమాచారం ఇచ్చినట్లు పోలీసులు తెలిపారు. ఇద్దరు వ్యక్తులు 6 ఏళ్ల చిన్నారి గొంతు కోశారని చెప్పాడు. నిందితులిద్దరినీ సీఆర్పీఎఫ్ సిబ్బంది పట్టుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని నిందితులిద్దరినీ అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.

ఇవి కూడా చదవండి

ఘటన జరిగిన సమయంలో మద్యం మత్తులో ఉన్న నిందితులు ఘటన సమయంలో నిందితులిద్దరూ మద్యం మత్తులో ఉన్నారని పోలీసులు తెలిపారు. పోలీసుల కస్టడీలో కూడా నిందితుడు ఎదో వెదుకుతూనే ఉన్నారు. అందుకే పోలీసులు సైకాలజిస్టులను కూడా పిలిపించి వారి మానసిక పరిస్థితిని చెక్ చేయించారు. నిందితుడి మానసిక పరిస్థితి బాగోలేదని అనుమానిస్తున్నారు. ప్రస్తుతం పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన వెనుక మంత్ర తంత్రం, తోట్కా తదితర కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

నిందితులకు చిన్నారితో పరిచయం  చనిపోయిన చిన్నారికి నిందితుడు ముందే తెలుసని పోలీసులు తెలిపారు. అందుకే నిందితుడుహతురాలి తండ్రికి ఫోన్ చేసినప్పుడు పెద్దగా అనుమానించలేదన్నారు. చిన్నారి తనను నిందితులు ఎందుకు పిలుస్తున్నారో తెలియక అమాయకత్వంతో వారి దగ్గరకు వెళ్లి ప్రాణాలు పోగొట్టుకుంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?