Garba Dance: సహచర క్రీడాకారులతో నవరాత్రుల్లో సందడి చేసిన పీవీ సింధు.. గుజ‌రాతీ గెటప్‌తో డ్యాన్స్‌ అదరగొట్టిన తెలుగు తేజం

భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు త‌న ఆట‌తో కోర్టులో ప్రత్యర్థుల‌ను గ‌డ‌గ‌డ‌లాడిస్తుంది. ఆమె ఆట ఏ స్థాయిలో ఉంటుందో అంద‌రికీ తెలిసిందే. తాజాగా త‌న‌లోని మ‌రో ప్రతిభ‌ను సింధు బ‌య‌ట పెట్టింది.

Garba Dance: సహచర క్రీడాకారులతో నవరాత్రుల్లో సందడి చేసిన పీవీ సింధు.. గుజ‌రాతీ గెటప్‌తో డ్యాన్స్‌ అదరగొట్టిన తెలుగు తేజం
Pvsindhu Garbha Dance
Follow us
Surya Kala

|

Updated on: Oct 02, 2022 | 7:32 PM

దేశ వ్యాప్తంగా శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుపుకుంటున్నారు. వివిధ ప్రాంతాల్లో తమ సంస్కృతి, సంప్రాదయాలను అనుసరించి దుర్గాదేవికి పూజాదికార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. దసరా ఉత్సవాల్లో భాగంగా గర్భా నృత్య వేడుకల సందడి నెలకొంది. అనేక ప్రముఖ పట్టణాల్లో దాండియా నైట్స్ ను నిర్వహిస్తున్నారు. అందుకు సంబంధించిన వీడియోలు కూడా నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి. దసరా ఉత్సవాల్లో సామాన్యుల నుంచి సెలబ్రెటీలు, క్రీడాకారులు పాల్గొని.. అమ్మవారిని పూజించి సందడి చేస్తున్నారు. తాజాగా ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి తెలుగు తేజం పీవీ సింధు కూడా దసరా నవరాత్రి వేడుకల్లో పాల్గొంది. తన సహచర క్రీడాకారులతో గర్బా డ్యాన్స్ చేస్తూ ఎంజాయ్ చేసింది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.

భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు త‌న ఆట‌తో కోర్టులో ప్రత్యర్థుల‌ను గ‌డ‌గ‌డ‌లాడిస్తుంది. ఆమె ఆట ఏ స్థాయిలో ఉంటుందో అంద‌రికీ తెలిసిందే. తాజాగా త‌న‌లోని మ‌రో ప్రతిభ‌ను సింధు బ‌య‌ట పెట్టింది. జాతీయ క్రీడ‌ల ప్రారంభోత్సవం కోసం గుజ‌రాత్ అహ్మదాబాద్ వెళ్లిన ఆమె.. రెండు రోజుల నుంచే అక్కడే ఉన్నారు. అహ్మదాబాద్, సూర‌త్ లో దేవీ న‌వ‌రాత్రుల వేడుక‌ల‌కు హాజ‌రయ్యారు. గుజ‌రాత్ సంప్రదాయ దుస్తులు ధ‌రించిన ఆమె.. అక్కడి గ‌ర్బా నైట్స్‌లో మ‌హిళ‌ల‌తో క‌లిసి డ్యాన్స్ చేసి అల‌రించారు.

ఇవి కూడా చదవండి

గుజ‌రాతీ దుస్తులు ధ‌రించి అల‌రించిన సింధు

దిగ్గజ లాంగ్ జంపర్ అంజు బాబీ జార్జ్, మాజీ షట్లర్ తృప్తి ముర్గుండేతో కలిసి సింధు గర్బా ఈవెంట్‌కు హాజరై వారితో క‌లిసి కాలు క‌దిపారు. అనంత‌రం సూరత్‌లో కూడా ఈ వేడుక‌కు హాజ‌రైన ఆమె పురుషుల సింగిల్స్‌ షట్లర్‌ హెచ్‌ఎస్‌ ప్రణయ్‌, డబుల్స్‌ స్టార్‌ చిరాగ్‌ శెట్టితో కలిసి డ్యాన్స్ చేసిన సింధు అంద‌రినీ అల‌రించారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?