AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND VS SA ODI: యంగ్ స్టర్స్ కు భలే ఛాన్స్.. దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్ కు భారత్ జట్టు ఎంపిక..

దక్షిణాఫ్రికాతో అక్టోబర్ 6వ తేదీ నుంచి 11 వ తేదీ వరకు జరగనున్న మూడు మ్యాచ్ ల వన్డే సిరీస్ కు భారత జట్టును బీసీసీఐ అక్బోర్ 2వ తేదీ ఆదివారం ప్రకటించింది. వన్డే జట్టుకు శిఖర్ ధావన్ ను కెప్టెన్ గా, శ్రేయస్ అయ్యర్ ను వైస్ కెప్టెన్ గా ఎంపిక చేసింది. ప్రస్తుతం స్వదేశంలో..

IND VS SA ODI: యంగ్ స్టర్స్ కు భలే ఛాన్స్.. దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్ కు భారత్ జట్టు ఎంపిక..
Shikhar Dhawan
Amarnadh Daneti
|

Updated on: Oct 02, 2022 | 9:31 PM

Share

దక్షిణాఫ్రికాతో అక్టోబర్ 6వ తేదీ నుంచి 11 వ తేదీ వరకు జరగనున్న మూడు మ్యాచ్ ల వన్డే సిరీస్ కు భారత జట్టును బీసీసీఐ అక్బోర్ 2వ తేదీ ఆదివారం ప్రకటించింది. వన్డే జట్టుకు శిఖర్ ధావన్ ను కెప్టెన్ గా, శ్రేయస్ అయ్యర్ ను వైస్ కెప్టెన్ గా ఎంపిక చేసింది. ప్రస్తుతం స్వదేశంలో సౌతాఫ్రికాతో భారత్ టీ20 సిరీస్ ఆడుతోంది. ఇప్పటికే మొదటి మ్యాచ్ లో టీమిండియా గెలవగా, రెండో మ్యాచ్ గువహటి వేదికగా జరుగుతున్న విషయం తెలిసిందే. రెండో టీ20 మ్యాచ్ జరుగుతున్న రోజే బీసీసీఐ వన్డే టీమ్ ను ప్రకటించింది. అక్టోబర్ నెలలో టీ20 ప్రపంచ కప్ జరగనున్న నేపథ్యంలో టీ20 జట్టులో ఆడే ముఖ్యమైన ప్లేయర్లకు విశ్రాంతినిచ్చారు. వన్డే సిరీస్ లో ఏవైనా గాయాలైతే మళ్లీ వారు టీ20 ప్రపంచ కప్ కు దూరమయ్యే ఛాన్స్ ఉండటంతో బీసీసీఐ కొత్త ఆటగాళ్లకు ఛాన్స్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పటికే బుమ్రా గాయం కారణంగా దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్ తో పాటు టీ20 ప్రపంచకప్ కు దూరం అవ్వడంతో ముందుజాగ్రత్త చర్యగా వన్డే సిరీస్ లో కీలకమైన ఆటగాళ్లకు విశ్రాంతినిచ్చింది. విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రోహిత్ శర్మ, అక్షర్ పటేల్, హర్ధిక్ పాండ్యా వంటి ఆటగాళ్లకు టీ20 ప్రపంచకప్ దృష్ట్యా విశ్రాంతినిచ్చారు. వన్డే సిరీస్ లో వారికి చోటు కల్పించలేదు. టీ20 ప్రపంచకప్ కు సంజుశాంసన్ కు ఎంపిక చేయకపోవడంతో అనేక విమర్శలు వచ్చిన నేపథ్యంలో సంజు శాంసన్ కు దక్షిణాఫ్రికాతో జరిగే వన్డే సిరీస్ లో చోటు కల్పించారు.

ఐపీఎల్ లో మెరిసిన యువ ఆటగాళ్లు రజత్ పాటిదార్, రాహుల్ త్రిపాఠికి కూడా వన్డే జట్టులో స్థానం కల్పించారు. గాయం కారణంగా జస్ప్రీత్ బుమ్రా స్థానంలో టీ20 సిరీస్ కు ఎంపికైన హైదరాబాదీ ఆటగాడు మహమ్మద్ సిరాజ్ కు వన్డే సిరీస్ లో అవకాశం కల్పించారు. కులదీప్ యాదవ్, రవి బిష్ణోయ్, షహబాజ్ అహ్మద్ వంటి స్పినర్లకు అవకాశం కల్పించారు. బెంగాల్ కు చెందిన ముఖేష్ కుమార్ కు జట్టులో చోటు దక్కింది. టీ20 ప్రపంచ కప్ కు ప్రకటించిన జట్టులోని రిజర్వ్ ఆటగాళ్లలో కొంతమందికి వన్డే సీరిస్ లో అవకాశం కల్పించారు. వన్డేల్లో పెద్దగా ఆకట్టుకోపోయిన శుభమన్ గిల్ కు చోటు దక్కడంతో దక్షిణాఫ్రికాతో జరిగే వన్డే లో శిఖర్ ధావన్ తో కలిసి శుభమన్ గిల్ ఓపెనింగ్ చేసే అవకాశాలున్నాయి.

ఇవి కూడా చదవండి

దక్షిణాఫ్రికాతో జరగనున్న మూడు వన్డేల సిరీస్ కు బీసీసీఐ ప్రకటించిన జట్టు వివరాలు

భారత వన్డే జట్టు : శిఖర్ ధావన్ (కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, శుభ్‌మన్ గిల్, శ్రేయాస్ అయ్యర్ (వైస్ కెప్టెన్), రజత్ పటీదార్, రాహుల్ త్రిపాఠి, ఇషాన్ కిషన్ (వికెట్-కీపర్), సంజు శాంసన్ (వికెట్-కీపర్), షాబాజ్ అహ్మద్, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, రవి బిష్ణోయ్, ముఖేష్ కుమార్, అవేష్ ఖాన్, మహ్మద్ సిరాజ్, దీపక్ చాహర్

మరిన్ని క్రీడా వార్తల కోసం చూడండి..