AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: ఏపీ, తెలంగాణ ప్రభుత్వాల మధ్య ముదురుతున్న మాటల యుద్ధం.. ఎక్కవ చేస్తే దాడులు చేస్తామంటూ మంత్రి గంగుల ఘాటు వ్యాఖ్యలు..

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాల మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. ఒకరి విమర్శలకు మరొకరు ధీటైన కౌంటర్లు ఇస్తుండటంతో ఈ మాటల పంచాయితీ ఫీక్ స్టేజ్ కు చేరుకుంది. కొద్ది రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్ లోని వైఎస్.జగన్మోహన్ రెడ్డి..

Andhra Pradesh: ఏపీ, తెలంగాణ ప్రభుత్వాల మధ్య ముదురుతున్న మాటల యుద్ధం.. ఎక్కవ చేస్తే దాడులు చేస్తామంటూ మంత్రి గంగుల ఘాటు వ్యాఖ్యలు..
Telangana Minister Gangula Kamalakar
Amarnadh Daneti
|

Updated on: Oct 01, 2022 | 6:36 PM

Share

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాల మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. ఒకరి విమర్శలకు మరొకరు ధీటైన కౌంటర్లు ఇస్తుండటంతో ఈ మాటల పంచాయితీ ఫీక్ స్టేజ్ కు చేరుకుంది. కొద్ది రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్ లోని వైఎస్.జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉద్యోగులు, ఉపాధ్యాయులను వేధిస్తోందంటూ మీడియా సమావేశంలో వ్యాఖ్యానించారు. దీనిపై అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చారు ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ. అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి సజ్జల రామకృష్ణారెడ్డి కూడా హరీష్ రావు వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రీసెంట్ గా ఏపీ జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు కూడా హరీష్ రావు వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ మామ, అల్లుళ్ల మధ్య తగదా ఉండే వారే చూసుకోవాలంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఏపీ నాయకులకు అదిరిపోయే కౌంటర్ ఇవ్వడంతో పాటు ఒకింత ఘాటు వ్యాఖ్యలు చేశారు తెలంగాణ బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమాలకర్. కరీంనగర్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పచ్చని సంసారంలో ఏపీకి చెందిన వైసీపీ నాయకులు చిచ్చు పెట్టేలా వ్యవహరిస్తున్నారని అన్నారు. సజ్జల రామకృష్ణారెడ్డితో పాటు మంత్రి గుడివాడ అమర్ నాధ్ టీఆర్ ఎస్ పార్టీపై, తమ నాయకుడు హరీష్ రావుపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. బీజేపీకి వైసీపీ పార్టీ బీ టీమ్ గా పనిచేస్తోందంటూ విమర్శించారు. ఎందుకు సజ్జల రామకృష్ణారెడ్డి తమతో పెట్టుకుంటున్నారని అన్నారు. మా సంగతి మీకు తెలియదా.. మీరు గతంలో చూశారు.. మళ్లీ చూస్తారా అంటూ హెచ్చరించారు. కుటుంబాల మధ్య చిచ్చు పెట్టేది సజ్జల రామకృష్ణారెడ్డి బుద్ధి అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

వైఎస్ కుటుంబంలోకి వచ్చి తల్లిని, కొడుకుని, చెల్లిని, అన్నను విచ్చిన్నం చేసే ప్రయత్నం చేస్తున్నారంటూ సజ్జల రామకృష్ణారెడ్డిపై మంత్రి గంగుల కమలాకర్ వ్యాఖ్యానించారు. కేసీఆర్ కుటుంబాన్ని విడగొట్టాలనుకునే మీ ప్రయత్నాలు ఇక్కడ చెల్లవన్నారు. ఆంధ్రప్రదేశ్ లో వైఎస్.జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం విఫలమైందని, తెలంగాణకు వలసలు పెరిగాయంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు గంగుల కమలాకర్. సజ్జల రామకృష్ణా రెడ్డి ప్రస్టేషన్ లో ఉండి ఏమి మాట్లాడుతున్నారో తెలియడం లేదన్నారు. దేశంలో అన్ని రాష్ట్రాల కంటే తెలంగాణలో ఎక్కువ పథకాలు అమలవుతున్నాయని హరీష్ రావు చెప్పారని, అందులో తప్పేముందన్నారు. హరీష్ రావును పర్సనల్ గా ఎందుకు టార్గెట్ చేసి వ్యాఖ్యలు చేస్తున్నారంటూ వైసీపీ నాయకులను గంగుల కమాలకర్ ప్రశ్నించారు. తెలంగాణ మీద టి ఆర్ యస్ మీద ఎందుకు విషం చిమ్ముతున్నారన్నారు. తమ ముఖ్యమంత్రి, టీఆర్ ఎస్ ప్రభుత్వం జోలికి వస్తే దాడులు చేస్తామంటూ హెచ్చరించారు. తమ జోలికి వచ్చి తమను రెచ్చగొటొద్దని హితువు పలికారు. కేసీఆర్ కుటుంబం అంటే తమ శరీరంలో అవయవాలు వంటివని, తమ నుంచి విడదీయలేరని ఆసక్తికర వ్యాఖ్యలు సైతం చేశారు. తమను రెచ్చగొడితే మాత్రం తీవ్రమైన పరిణామాలుంటాయంటూ గంగుల కమాలకర్ హెచ్చరించారు.

ఇటీవల మీడియా సమావేశంలో తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగులు, ఉపాధ్యాయులను వేధిస్తోందని, కేసులు పెట్టి జైలుపాలు చేస్తోందంటూ వ్యాఖ్యానించారు. హరీష్ రావు వ్యాఖ్యలను ఏపీలోని అధికార వైసీపీ నాయకులు వరుసగా ఖండిస్తూ వచ్చారు. మంత్రి బొత్స సత్యనారాయణ, సజ్జల రామకృష్ణారెడ్డితో పాటు ఎంతోమంది వైసీపీ నాయకులు హరీష్ రావుకు కౌంటర్ ఇస్తూ వచ్చారు. ఏపీ నుంచి వైసీపీ నాయకుల మాటలదాడి పెరగడంతో ఇటు తెలంగాణ నుంచి టీఆర్ ఎస్ నాయకులు కూడా స్ట్రాంగ్ కౌంటర్ తో రెడీ అయ్యారు. దీనిలో భాగంగా తెలంగాణ మంత్రి గంగుల కమాలకర్ తాజాగా చేసిన ఘాటు వ్యాఖ్యలపై ఏపీకి చెందిన వైసీపీ నాయకులు ఎలా స్పందిస్తారనేది వేచి చూడాల్సి ఉంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం చూడండి..